ap-caste-survey-2024-faqs

AP Caste Survey – 2024 Faqs

1) కుల గణన సర్వే ఏ యాప్ నందు చెయ్యాలి?

Ans :: Gramaward Volunteer App

2) App నందు login ఎవరికి వుంటుంది?

Ans :: వాలంటీర్లకు login వుంటుంది. వాలంటీర్లు వారి యొక్క CFMS ID ద్వారా login అవ్వాలి.

3) యాప్ నందు ఏ విధంగా సర్వే చెయ్యాలి?

Ans :: వాలంటీర్లు లాగిన్ అయిన తరువాత సంబంధిత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో వున్న కుటుంబ వివరాలు అన్నీ ప్రదర్శితం అవుతాయి.

4) సర్వే ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది?

Ans :: 19.01.2024

5) సర్వే సమయంలో ఎవరి నుంచి eKYC తీసుకోవాలి?

Ans :: కుటుంబంలో ఒక వ్యక్తి నుంచి eKYC తీసుకోవాలి.

6) కుటుంబ సభ్యుని eKYC తరువాత వాలంటీర్ మరియు సచివాలయం ఉద్యోగి ఇద్దరూ eKYC వెయ్యాలా?

Ans :: అవును.

7) సర్వే సమయంలో విభాగం-I నందు ఏ ఏ వివరాలు నమోదు చెయ్యాలి?

Ans :: కుటుంబానికి సంబందించిన వివరాలు నమోదు చెయ్యాలి.

8) సర్వే సమయంలో విభాగం-II నందు ఏ ఏ వివరాలు నమోదు చెయ్యాలి?

Ans :: కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత వివరాలు నమోదు చెయ్యాలి.

9) కుటుంబం నందు ఎవరైనా సభ్యులు / మొత్తం సభ్యులు మరణించినప్పుడు ఏ విధంగా సర్వే చెయ్యాలి?

Ans :: సర్వే చేసే సమయంలో “సభ్యుని జీవన స్థితి” యందు “మరణించడం” అని సబ్మిట్ చేయుటకు అవకాశం కలదు.

10) కొంతమంది వలసలు వెళ్లారు? వీరి నుంచి eKYC ఏ విధంగా తీసుకోవాలి?

Ans :: OTP Authentication. ద్వారా అవకాశం కలదు.

11) సర్వే సమయంలో వేరు వేరు మొబైల్స్ ను వినియోగించవచ్చా?

Ans :: సర్వే ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే మొబైల్ ను వినియోగించాలి.

12) సర్వే సమయంలో అనివార్య కారణాల వలన ఏదైనా వాలంటీర్ మొబైల్ యొక్క మొబైల్ ను మార్చాలి అనుకున్న సందర్భంలో ఏ విధంగా చెయ్యాలి?

Ans :: అనివార్య కారణాల వలన సర్వే సమయంలో మొబైల్ ను మార్చిన యెడల, సంబంధిత ఎంపీడీఓ గారి లెటర్ ద్వారా గ్రామవార్డు సచివాలయ శాఖ జిల్లా కో ఆర్డినేటర్ కు వివరాలు అందించాలి.

13) సర్వే సమయంలో ఏవైనా వివరాలు తప్పుగా నమోదు చేసినచో ఏ విధంగా సరి చెయ్యవచ్చు?

Ans :: ఒకసారి సబ్మిట్ చేసిన వివరాలు మరలా edit చేయుటకు అవకాశం లేదు. కావున సర్వే సమయంలో జాగ్రత్తగా సర్వే చెయ్యగలరు.

14) కుటుంబ సభ్యులకు ఏ ఏ విధమైన eKYC నకు అవకాశం కలదు.?

Ans :: 1) Biometric 2) Iris 3) Facial 4) OTP

15) వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులకు ఏ ఏ విధమైన eKYC నకు అవకాశం కలదు?

Ans :: 1) Biometric 2) Iris 3) Facial

16) App నందు స్క్రీన్ షాట్ / స్క్రీన్ రికార్డు చేయుటకు అవకాశం కలదా?

Ans :: లేదు

17) కులగణన సర్వే చేయుటకు చివరి తేదీ?

Ans :: 28.01.2024

18) ఎవరైనా కుటుంబ సభ్యులు / ఏదేని కుటుంబం కుల గణన జాబితా నందు నందు లేనిచో ఏ విధంగా add చేసుకోవాలి?

Ans :: Gramaward volunteer యాప్ నందు లేదా పంచాయతీ కార్యదర్శి యొక్క లాగిన్ నందు కుటుంబ సభ్యులను /కుటుంబాన్ని add చేసుకోవచ్చు. Add చేసుకున్న 24 గంటలలోపు కులగణన నందు వివరాలు update చేయడం జరిగింది.

19) యాప్ యందు సర్వే చేసే సమయంలో ఉద్యోగుల జాబితా లో ఎవరైనా ఉద్యోగి వివరాలు లేనిచో, ఏ విధంగా చెయ్యాలి?

Ans :: GSWS Portal – DA/WEDPS/PS/WAS యొక్క Login  “Edit Employee Details” tab

నందు సంబంధిత ఉద్యోగి వివరాలు update చెయ్యాలి.

20) సర్వే సమయంలో సంపూర్ణ వివరాలు కాకుండా పాక్షిక వివరాలు నిక్షిప్త పరుచుటకు అవకాశం కలదా?

Ans :: అవును

21) విభాగం-I నందు కుటుంబం సభ్యుల అందరి నుంచి eKYC తీసుకోవాలా?

Ans :: కుటుంబం నుంచి ఒక సభ్యుని eKYC తీసుకుంటే సరిపోతుంది.

22) విభాగం-II నందు కుటుంబం సభ్యుల అందరి నుంచి eKYC తీసుకోవాలా?

Ans :: మొదటగా సర్వేలో పాల్గొన్న సభ్యుని యొక్క eKYC తప్పనిసరి.

విభాగం-II యందు కుటుంబ సభ్యులందరి నుంచి eKYC తీసుకోవాల్సిన అవసరం లేదు.

23) కొంతమంది బియ్యం కార్డు కలిగి లేరు? ఇటువంటి సందర్భంలో బియ్యం కార్డు నెంబర్ ఏ విధంగా నమోదు చెయ్యాలి?

Ans :: బియ్యం కార్డు కలిగి వున్న కుటుంబాలకు మాత్రమే బియ్యం కార్డు నెంబర్ నమోదు చెయ్యగలరు. ఒకవేళ బియ్యం కార్డు లేనిచో “రైస్ కార్డు సంఖ్య” అనే ప్రశ్నకు వివరాలు నమోదు చెయ్యవలసిన అవసరం లేదు.

24) సర్వే యందు కొంతమంది వ్యక్తులకు వ్యక్తి పేరు కాకుండా NA అని వుంది. ఇటువంటి వారికి వారి పేరు ఏ విధంగా update చెయ్యవచ్చు?

Ans :: గ్రామవార్డు వాలంటీర్ యాప్ “Update eKYC” నందు సంబంధిత వ్యక్తి యొక్క eKYC ద్వారా update చెయ్యగలరు.

25) సర్వే యందు కొంతమంది వ్యక్తులకు Gender వివరాలు NA అని వుంది. ఇటువంటి వారికి వారి Gender ని ఏ విధంగా update చెయ్యవచ్చు?

Ans :: గ్రామవార్డు వాలంటీర్ యాప్ “Update eKYC ” నందు సంబంధిత వ్యక్తి యొక్క eKYC ద్వారా update చెయ్యగలరు.

26) సర్వే యందు కొంతమంది వ్యక్తులకు వ్యక్తుల పేర్లు మరియు Gender వివరాలు NA అని వుంది. వీరికి ఇలాగే సర్వే పూర్తి చేయవచ్చా?

Ans :: అవును, సర్వే పూర్తి చేసిన వెంటనే గ్రామవార్డు వాలంటీర్ యాప్ “Update eKYC ” నందు సంబంధిత వ్యక్తి యొక్క eKYC update చెయ్యగలరు.

27) సర్వే సమయంలో కొంతమందికి కులము యొక్క వివరాలు automatic గా ప్రదర్శితం అవుతున్నాయి. మరి కొంతమందికి కావట్లేదు?

Ans :: పౌరులు, ఏపీ సేవా పోర్టల్ నుంచి Caste certificate పొంది వున్నచో వారి యొక్క ఆధార్ నకు లింక్ అయిన, సర్టిఫికెట్ యందు వున్న కులము యొక్క వివరములు automatic గా ప్రదర్శితం అవుతాయి.

28) Automatic గా ప్రదర్శితం అవుతున్న కులము వివరాలలో కొంతమందికి కులము వివరాలు తప్పుగా వున్నాయి. ఇటువంటి సందర్భంలో వారి యొక్క కులము వివరాలు ఏ విధంగా సరిచేయవచ్చు ?

Ans :: పౌరులు, ఏపీ సేవా పోర్టల్ నుంచి Caste certificate పొంది వున్నచో వారి యొక్క ఆధార్ నకు లింక్ అయిన, సర్టిఫికెట్ యందు వున్న కులము యొక్క వివరములు automatic గా ప్రదర్శితం అవుతాయి.

ఈ వివరాలు ఏవైనా తప్పుగా వున్నచో, సంబంధిత వ్యక్తులు వెంటనే తహసీల్దార్ వారిని సంప్రదించి revoke ఆప్షన్ ద్వారా మరలా caste certificate నకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్తగా పొందిన caste certificate వివరములు ఆటోమేటిక్ గా update చేయడం జరుగుతుంది.

29) విభాగం-II యందు ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, తదితర వివరాలు కుటుంబ సభ్యులందరికి నమోదు చెయ్యాలా? లేదా ఆస్థి కలిగిన వ్యక్తి కి మాత్రమే వ్యక్తిగతంగా నమోదు చెయ్యాలా?

Ans :: విభాగం-II యందు వ్యక్తిగత వివరాలు మాత్రమే నమోదు చెయ్యవలసి వుంటుంది. ఆస్థి కలిగిన వ్యక్తి కి మాత్రమే ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, తదితర వివరాలు నమోదు చెయ్యగలరు.

30) కొన్ని కుటుంబాలు జీవనాధారం కొరకు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వీరికి ఏ విధంగా సర్వే చెయ్యాలి?

Ans :: OTP Authentication.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top