రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో వాలంటీర్లను మూడో ఏడాది కూడా సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
మొదటి కేటగిరీ: ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికి పైగా సేవలందించిన వాలంటీర్లను “సేవామిత్ర”అవార్డుతో సత్కరించి రూ.10,000/-వేల చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జిని బహుకరిస్తారు.
రెండో కేటగిరీ: ఇంటింటికి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు , ఆరోగ్య శ్రీ కార్డులు తదితర కార్యక్రమాలల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఐదు మంది చొప్పున , ప్రతి నగర పాలక సంస్థ పరిధిలోని పది మంది చొప్పున వాలంటీర్లను “సేవారత్న” అవార్డుతో రూ.20,000/- వేల చొప్పున నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికేట్, శాలువా , బ్యాడ్జితో సత్కరిస్తారు.
మూడో కేటగిరీ:తమకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలోని ప్రజలకు సేవల ద్వారా పూర్తి స్థాయిలో చేరువై అత్యుత్తమప్రతిభ కనబరచిన వాలంటీర్లనుఅసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురుని ఎంపిక చేసి “సేవావజ్ర” అవార్డుతో సత్కరిస్తారు. రూ.30,000/- వేల చొప్పున నగదు బహుమతితో పాటు గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, శాలువా , బ్యాడ్జి ని అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా వాలంటీర్ల సేవామిత్ర, సేవ రత్న,సేవా వజ్ర కు ఎంపిక అయిన వారి వివరాలు ఇవ్వడం జరిగింది.
good information.