mission-vatsalya-scheme

Mission Vatsalya Scheme Details in Telugu

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?
ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య, విద్య మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి కొంత సహాయమును అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ ద్వారా పిల్లలకు నెలకు రూ.4,000/- రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఒక కుటుంబములో ఇద్దరు పిల్లల వరకూ ధరఖాస్తు చేసుకోవచ్చు.
మిషన్ వాత్సల్య పథకానికి ఎవరెవరు అర్హులు?
స్కాలర్ షిప్ కార్యక్రమం మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ అర్హతలు కలిగిన 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు అర్హులు.

1.వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబాన్ని వదిలేసిన తల్లి యొక్క పిల్లలు.
2.అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్న అనాధ బాలలు
3.ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు
4. శారీరకంగా, ఆర్ధికంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రుల పిల్లలు
5.బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం. రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగవైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/ వేధింపులకు/ దుర్వినియోగం/ దోపిడీలకు గురైన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
6.PM CARE FOR CHILDREN మంజూరు అయిన బాలలు
7.తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా వున్నా లేదా విడాకులు తీసుకొన్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరఖాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
8.పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరూ మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో(సంరక్షకులతో) కలిసి జీవించుచున్నవారు.
9.తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
10.బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబముతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురి అయిన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురి అయిన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
11.కరోనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరైతే PM CARES పథకం కింద నమోదు అయినటువంటి పిల్లలు.

మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ ఆర్ధిక పరిమితి ఏంటి ?

1.రెసిడెన్సియల్ స్కూల్ యందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.
2.ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం రూ.72,000/- కి,అదే విధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం రూ.96,000/- లకు ఎక్కువ ఉండరాదు.

మిషన్ వాత్సల్య’ నిధుల కేటాయింపు ఎలా?

ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వము వాటా 60% శాతం అంటే రూ. 2,400/- కాగా రాష్ట్ర ప్రభుత్వము వాటా 40% శాతం రూ.1,600/- నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్సాహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొనసాగించేందుకు దోహదపడుతుంది.

మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటి ?

  • స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరముల వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకూ బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్థిక సహాయమును నిలుపుదల చేయబడుతుంది.
  • పిల్లలు 30 రోజులకు మించి పాఠశాలకు హాజరు కాకపోతే సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మినహాయింపు కలదు)
  • ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో చేరితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.
  • ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
  • తల్లి చనిపోయిన తరువాత తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందుకంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
  • పిల్లల స్టడీ సర్టిఫికెట్ ఈ విద్యా సంవత్సరం అనగా 2022- 2023 మాత్రమే సమర్పించండి.

మిషన్ వాత్సల్యకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ లు ఏమిటి?

  • బాలుడి లేదా బాలిక యొక్క జనన ధృవీకరణ పత్రం
  • బాలుడి లేదా బాలిక యొక్క ఆధార్ కార్డు
  • తల్లి ఆధార్ కార్డు
  • తండ్రి ఆధార్ కార్డు
  • తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రము,మరణానికి కారణము
  • గార్డియన్(సంరక్షకుడు) ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్
  • కుల ధృవీకరణ పత్రము
  • బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
  • స్టడీ సర్టిఫికేట్
  • ఆదాయ ధృవీకరణ పత్రము.
  • బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసి జాయింట్ అకౌంట్.

దరఖాస్తు చివరి తేది : ఏప్రిల్ 26 వ తేదీలోగా సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి.

1 thought on “Mission Vatsalya Scheme Details in Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top