AP EAPCET 2026 Counseling dates, web options process, and document verification complete details

AP EAPCET 2026 Counseling Complete Details

AP EAPCET 2026 కౌన్సెలింగ్ పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ MPC, Bi.P.C చదివినటువంటి విద్యార్థులు, పై చదువుల కొరకు అంటే బీటెక్ మరియు ఫార్మసీ, నర్సింగ్ వంటి కోర్సులు చేసేందుకు AP EAPCET ఎంట్రన్స్ ఎగ్జామ్ ను రాశారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు వచ్చేసి, బిటెక్ మరియు ఫార్మసీ, నర్సింగ్ వంటి కోర్సులు ఉచితంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం పొందుతారు. AP EAPCET ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ కు సంబంధించినటువంటి డేట్ లను అయితే రిలీజ్ చేయడం జరిగింది.

AP EAPCET 2026 కౌన్సెలింగ్ అంటే ఏమిటి?

AP EAPCET అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSCHE ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఒక ఎంట్రన్స్ పరీక్ష. దీనికి MPC మరియు Bi.P.C చదివేటటువంటి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ AP EAPCET పరీక్షలో విద్యార్థులు క్వాలిఫై అయితే, వారు గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో ఉచితంగా బీటెక్, బి ఫార్మసీ, నర్సింగ్ వంటి కోర్సులను పూర్తి చేయవచ్చు.

ఈ కౌన్సెలింగ్ లో వచ్చేసి ప్రధానంగా ఐదు దశలు ఉంటాయి:

  • రిజిస్ట్రేషన్
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • వెబ్ ఆప్షన్స్
  • సీట్ అలాట్మెంట్
  • సెల్ఫ్ రిపోర్టింగ్

పైన చూపించినటువంటి ప్రధాన దశలను కంప్లీట్ చేసి, విద్యార్థులు AP EAPCET నుండి గుర్తింపు పొందిన పాఠశాలలో ఉచితంగా అడ్మిషన్ పొందవచ్చును.

AP EAPCET రిజిస్ట్రేషన్:

తేదీ: 2026 జూలై 20 నుంచి జూలై 29 వరకు నిర్వహించబడుతుంది.

AP EAPCET పరీక్షలో అర్హత సాధించినటువంటి విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు మీరు చదువుకున్నటువంటి స్కూలు, కళాశాల, ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కు తగినంత రుసుము చెల్లించవలసి ఉంటుంది. OC మరియు OBC విద్యార్థులు 1200 రూపాయలు చెల్లించాలి. SC మరియు ST విద్యార్థులు 600 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:

AP EAPCET REGISTRATION LINK

  • Step 1: అధికారిక కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • Step 2: Candidate Registration పై క్లిక్ చేయండి.
  • Step 3: AP EAPCET Hall Ticket Number, Rank, Date of Birth నమోదు చేయండి.
  • Step 4: Processing Fee ను UPI, Debit Card, Credit Card లేదా Net Banking ద్వారా చెల్లించండి.
  • Step 5: చెల్లింపు పూర్తయ్యాక Registration Form ఓపెన్ అవుతుంది. అందులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.
  • Step 6: నమోదు చేసిన వివరాలను ఒకసారి సరిచూసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • Step 7: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత Registration Number/Receipt ను డౌన్‌లోడ్ చేసుకోండి.

AP EAPCET డాక్యుమెంట్ వెరిఫికేషన్:

తేదీ: 2026 జూలై 22 నుంచి జూలై 31 వరకు కొనసాగుతుంది.

thalliki-vandanam-2026-2
Thalliki Vandanam Latest Release Date-2026

ఈ స్టెప్ లో వచ్చేసి, ఎవరైతే విద్యార్థులు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో, వారు వచ్చేసి వారి యొక్క విద్యకు సంబంధించినటువంటి మార్కు లిస్టులు, స్టడీ సర్టిఫికెట్లు మరియు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత APSCHE ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి, ముందు దశకు అంటే వెబ్ ఆప్షన్ దశకు పంపడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మనకు అక్కడ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. ఇచ్చినటువంటి గడువులోపు మళ్లీ సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది.

AP EAPCET WEB ఆప్షన్ దశ:

తేదీ: 2026 జూలై 25 నుంచి జూలై 31 వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

వెబ్ ఆప్షన్లలో మార్పులు:

2026 ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లను ఒకసారి మార్చుకునే అవకాశం ఉంటుంది.

విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, ఈ దశకు అయితే రావడం జరుగుతుంది. ఈ దశలో వచ్చేసి విద్యార్థులు వారి మార్కుల ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా కాలేజీలను నిర్ణయించుకునే ముందు, ఒకసారి ముందు సంవత్సరం ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా ఏ కళాశాలలకు ఎంత కటాఫ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.

క్రింది ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింకు ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ ను పెట్టుకోవచ్చు.

వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానం:

  • Step 1: అధికారిక వెబ్ ఆప్షన్స్ పోర్టల్‌ను ఓపెన్ చేసి Login చేయండి. Hall Ticket Number, Date of Birth మరియు అవసరమైతే OTPతో లాగిన్ అవ్వండి.
  • Step 2: మీకు కావలసిన కాలేజీ మరియు బ్రాంచ్ (ఉదా: CSE, ECE, EEE)ను ఎంపిక చేయండి.
  • Step 3: మీకు అత్యంత ఇష్టమైన కాలేజీ/బ్రాంచ్‌ను Option No. 1గా పెట్టండి. తర్వాత మిగతా కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో జోడించండి.
  • Step 4: ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
  • Step 5: అవసరమైతే Up/Down బటన్లతో ఆప్షన్ల క్రమాన్ని మార్చండి.
  • Step 6: అన్ని ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత Save పై క్లిక్ చేయండి.
  • Step 7: చివరిగా Logout చేసి, వెబ్ ఆప్షన్లు సరిగ్గా సేవ్ అయ్యాయో ఒకసారి మళ్లీ లాగిన్ అయి పరిశీలించండి. వెబ్ ఆప్షన్లు మార్చేందుకు అవకాశం ఉంటే, ప్రకటించిన గడువులోపు మాత్రమే మార్పులు చేయండి.

AP EAPCET సీట్ అలాట్మెంట్:

తేదీ: 2026 ఆగస్టు 6న సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల చేయబడతాయి.

ఈ దశలో విద్యార్థులు సరైన పద్ధతిలో వారి మార్కుల ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకొని ఉంటే, వారికి వారు ఎంచుకున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో సీటు కేటాయించబడుతుంది.

నేను కింద చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్పు ఆధారంగా మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి.

thalliki-vandanam-2026.png
Thalliki Vandanam Scheme-2026: తల్లికి వందనం పథకం పూర్తి వివరాలు

అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ విధానం:

  • Step 1: కౌన్సెలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సైన్ ఇన్ అవ్వండి.
  • Step 2: లాగిన్ అయిన తర్వాత Seat Allotment విభాగాన్ని ఓపెన్ చేయండి.
  • Step 3: స్క్రీన్‌పై కనిపించే సీట్ అలాట్‌మెంట్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో కాలేజీ పేరు, బ్రాంచ్, కేటగిరీ మరియు రిపోర్టింగ్ వివరాలు ఉంటాయి.
  • Step 4: మీకు సీటు కేటాయించబడితే Seat Allotment Order ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసి ఒక ప్రింట్ కాపీ తీసుకుని భద్రంగా ఉంచుకోండి.

AP EAPCET సెల్ఫ్ రిపోర్టింగ్:

తేదీ: 2026 ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి.

ఈ దశ విద్యార్థులకు చివరి దశ. విద్యార్థులు వారు సీట్ అలాట్మెంట్ ఆధారంగా వారికి వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి, విద్యార్థికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి పూర్తి మార్కుల లిస్టులు మరియు టిసి వంటివి వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆ కళాశాలలో సీట్ కన్ఫర్మేషన్ కొరకు మీరు రాతపూర్వకంగా అడ్మిషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది.

సెల్ఫ్ రిపోర్టింగ్ కి తీసుకు వెళ్లాల్సిన పత్రాలు:

  • AP EAPCET 2026 హాల్ టికెట్
  • AP EAPCET 2026 ర్యాంక్ కార్డు
  • సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్
  • సెల్ఫ్ రిపోర్టింగ్ అక్‌నాలెడ్జ్‌మెంట్
  • 10వ తరగతి మార్కుల మెమో
  • ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
  • స్టడీ సర్టిఫికేట్లు
  • ఆధార్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • కుల ధృవీకరణ పత్రం
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • EWS సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • నివాసం / లోకల్ స్టేటస్ సర్టిఫికేట్

NOTE: కాలేజీకి వెళ్లే సమయంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు రెండు నుంచి మూడు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లడం మంచిది. దీంతో అడ్మిషన్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.

ఇతర ప్రశ్నలు:

EAPCET రెండవ కౌన్సెలింగ్ ఉంటుందా?

చాలా సందర్భాల్లో రెండవ కౌన్సెలింగ్ మరియు మూడవ కౌన్సెలింగ్ కూడా జరిపినటువంటి రోజులైతే ఉన్నాయి. రెండు మాత్రం పక్కాగా జరుగుతాయి.

EAPCET రిజిస్ట్రేషన్ ఫీజు ఒకసారి ఒక కౌన్సెలింగ్ కి కడితే సరిపోతుందా? మళ్లీ కౌన్సెలింగ్ కు కూడా అమౌంట్ పే చేయాలా?

అవసరంలేదు, ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ కు అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఎన్ని కౌన్సెలింగ్ లు ఉంటే అన్ని కౌన్సెలింగ్ లలో మనం ఆ డబ్బులతోనే పాల్గొనవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top