జగనన్న చేదోడు పథకము
సొంత షాపు కలిగిన రజకులకు, నాయీబ్రాహ్మణులకు మరియు టైలర్లకు వారి జీవన ప్రమాణాల మెరుగుకై “జగనన్న చేదోడు” పథకం ద్వారా సంవత్సరానికి రూ.10,000/- వేల ఆర్థిక సహాయం అందించబడును.
అర్హతలు:
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/- వేల కంటే తక్కువ ఉండాలి.
- మొత్తం కుటుంబానికి మూడు ఎకరాలు మాగాణి భూమి లేదా పది ఎకరాలు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండూ కలిపి పది ఎకరాలు మించరాదు.
- కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
- పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణ స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
- కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా 4వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో, టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందునకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించబడును.
- కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.
- ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కుల ధ్రువీకరణ పత్రం (SC,ST,BC,Minority, EBC ) కలిగి ఉండవలెను.
- షాపులున్న టైలర్లు అనగా అన్ని కులములకు చెందిన వారు (SC,ST,BC,Minority, EBC ) టైలరింగ్ వృత్తిపై అనగా ప్రధాన వృత్తిగా స్వీకరించి దాని పై పూర్తిగా ఆధారపడి జీవనోపాధి చేయుచున్న వారు మాత్రమే అర్హులు.
- షాపు కలిగి దానినే జీవనాధారంగా వృత్తి చేసుకుంటున్న రజకులు మరియు నాయీబ్రాహ్మణులు సంబంధిత కుల దృవీకరణ పత్రం కలిగిన వారు అర్హులు.
ప్రయోజనాలు:
- ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.10,000/- వేల చొప్పున ఆర్థిక సహాయం అందించబడును.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం:
- అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు తో పాటు స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ /వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును.
- అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request – మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
- దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ.10,000/- ఒకసారి మంజూరు చేసే “జగనన్న చేదోడు” పథకం ద్వారా లబ్ధి చేకూర్చబడుతుంది.
Post Views: 17
BANDI SURYANARAYANA
ADVOCATE
ENROLLMENT NO.AP/283/2019
ANANTAPUR DIST
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసారు.