Grama/Ward Volunteers Awards 2022

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో 2,33,333 మంది వాలంటీర్లను రెండో ఏడాది కూడా సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Grama/Ward Volunteers Awards 2022

మొదటి కేటగిరీ:

ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికి పైగా సేవలందించిన వాలంటీర్లను “సేవామిత్ర” అవార్డుతో సత్కరించి రూ.10,000/- వేల చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జిని బహుకరిస్తారు.2,28,322 మంది వాలంటీర్లను అవార్డుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.

రెండో కేటగిరీ:

ఇంటింటికి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు , ఆరోగ్య శ్రీ కార్డులు తదితర కార్యక్రమాలల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఐదు మంది చొప్పున , ప్రతి నగర పాలక సంస్థ పరిధిలోని పది మంది చొప్పున వాలంటీర్లను “సేవారత్న” అవార్డుతో సత్కరిస్తారు.రూ.20,000/- వేల చొప్పున నగదు బహుమతితో పాటు సిల్వర్ మెడల్ , సర్టిఫికేట్, శాలువా , బ్యాడ్జి ని బహూకరిస్తారు.ఈ అవార్డుకు రాష్ట్ర వ్యాప్తంగా 4,136 మంది వాలంటీర్లను అవార్డుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.

మూడో కేటగిరీ:

తమకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలోని ప్రజలకు సేవల ద్వారా పూర్తి స్థాయిలో చేరువై అత్యుత్తమప్రతిభ కనబరచిన వాలంటీర్లనుఅసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున  875 మందిని ఎంపిక చేసి “సేవావజ్ర” అవార్డుతో సత్కరిస్తారు. రూ.30,000/- వేల చొప్పున  నగదు బహుమతితో పాటు గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, శాలువా , బ్యాడ్జి ని అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

2 thoughts on “Grama/Ward Volunteers Awards 2022”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top