ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా పథకం
పథకం నియమాలు
- నిర్వచనాలు:
ఈ నిబంధనలో సందర్భానికి సరితూగని సందర్భాలలో మినహా ఇతరత్రా ఈ క్రింది పదాలు ఈ క్రింద తెల్పిన అర్థంలో వాడబడినవి.
- మాస్టర్ పాలసీ హోల్డర్ ………….. బ్యాంకు అయి ఉంటుంది.(లేదా) బ్యాంకింగ్ కంపెనీల (ఎ &టీయు) చట్టం, 1970 పరిధిలో ఏర్పడిన కార్పోరేట్ సంస్థ అయి ఉంటుంది. “బ్యాంకు” అనగా ………….. బ్యాంకు.
- “కార్పోరేషన్” అంటే , 1956 జీవిత బీమా సంస్థ చట్టం, సెక్షన్ 3 పరిధిలో స్థాపించబడిన భారతీయ జీవిత బీమా సంస్థ.
- “పథకం” అంటే ‘బ్యాంకు’ పొదుపు ఖాతాదారుల కోసం రూపొందించిన ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ అని అర్థం.
- “నిబంధనలు” అంటే దిగువ పొందుపరచిన పథక నియమనిబంధనలు మరియు కాలానుగుణంగా సవరించబడేవి.
- “సభ్యుడు” అంటే పథకంలో చేరి , నిబంధనల ప్రకారం జీవిత బీమా ప్రయోజనం పొందిన లేదా పొందనున్న బ్యాంకు పొదుపు ఖాతాదారు.
- “అమలు తేదీ” అంటే పథకం ప్రారంభమయ్యే 1 జూన్ 2015 తేది.
- “వార్షిక పునరుద్దరణ తేది” అంటే , ప్రస్తుత పథకానికి సంబంధించిన 1 జూన్ 2016 తేది , మరియు ఆ తర్వాత ప్రతి సంవత్సరం జూన్ 1 వ తేదీ.
- “ముగింపు(టెర్మినల్) తేదీ” , అంటే , ప్రతి సభ్యునికి సంబంధించి 55 సంవత్సరముల వయసు నిండిన తరువాతి వార్షిక పునరుద్దరణ తేది, లేదా బ్యాంకు లో తమ ఖాతా మూసి వేసిన లేదా ప్రీమియం చెల్లింపు నిలిపివేసిన తేది మూడింటిలో ఏది ముందు అయితే అది ముగింపు తేది అవుతుంది.
- “బీమా” అంటే సభ్యుని జీవితానికి నిర్దేశించిన బీమా హామీ
- “లబ్దిదారు” అంటే బ్యాంకు రికార్డులలో సభ్యులు తమ నామినీగా నియమించిన వ్యక్తి, లేదా వ్యక్తులు.
2. పథకానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలోను బ్యాంకు సభ్యుల తరపున పనిచేస్తుంది. అలాగే ఒప్పందం ద్వారా బ్యాంకు చేపట్టే అన్ని చర్యలకు , కార్పోరేషన్ కు బ్యాంకు ఇచ్చే నోటీసులకు సభ్యులు అందరు కట్టుబడి ఉండవలెను.
3. అర్హత: ప్రాతినిథ్య బ్యాంకు ఖాతాదారులలో 18 సంవత్సరముల వయసు నిండిన వారి నుంచి 50 సంవత్సరముల వయసు ( పుట్టిన రోజుకు సమీప వయసు) కల్గి , ‘నమోదుకు అనుమతించిన కాల వ్యవధిలో’ పథకంలో చేరేందుకు తమ సమ్మతిని తెలిపిన వారందరూ పథకంలో చేరేందుకు అర్హులు.
4. ప్రవేశ వయస్సు: పొదుపు ఖాతాదారు బ్యాంకు కు సమర్పించిన వయస్సు ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రవేశ వయస్సును నిర్ణయిస్తారు.
5. ఆరోగ్య సాక్ష్యాధారం: అర్హులైన సభ్యులందరూ , కార్పోరేషన్ (బీమా సంస్థ) కోరిన విధంగా , పథకంలో చేరునపుడు మరియు నమోదు కాలం ముగిసిన పిదప పథకంలో చేరు సభ్యులైనను, పథకంలో చేరుటకు ఇచ్చే సమ్మతిని మరియు వాంగ్మూల ప్రకటన పత్రంలో పొందుపరిచిన విధంగా సంతృప్తికరమైన ఆరోగ్య ధృవీకరణను బ్యాంకు కు సమర్పించవలెను.
6. ప్రీమియం : ప్రీమియంను సభ్యుల పొదుపు ఖాతా నుంచి మినహాయించుకుంటారు. పథకంలో చేరే సమయంతో సంబంధం లేకుండా అంటే తొలి సంవత్సరంలో నమోదు కాలంలో లేదా గడువు ముగిసిన తర్వాత ఎప్పుడైనా ప్రీమియం రూ.330/- అదనంగా సేవా పన్నుతో సహా (వర్తిస్తే) పునరుద్దరణ ప్రీమియంను కాలానుగుణంగా వార్షిక పునరుద్దరణ తేదీన నిర్ణయించబడిన విధంగా వసూలు చేస్తారు.
7. హామీ: బీమా చేసిన సభ్యుడు మరణించినచో సదరు సభ్యుని నామినీకి రూ.2,00,000/- లక్షలు చెల్లించేందుకు హామీ ఇస్తారు.
8. ముగింపు తేది కంటే ముందే మరణిస్తే చేకూరే ప్రయోజనాలు: ముగింపు తేదీకంటే ముందుగానే ఎవరైనా సభ్యుడు మరణించినచో బీమా చేసిన సొమ్ము మొత్తము , సదరు సభ్యుడు అంతవరకూ ప్రీమియం సకాలంలో సక్రమంగా చెల్లించి ఉన్నట్లయితే సభ్యుడు ప్రతిపాదించిన లబ్దిదారునకు చెల్లించబడుతుంది.
9. బీమా రద్దు:
ఈ దిగువ పేర్కొన్న సందర్భాలలో సభ్యుల జీవిత బీమా రద్దవుతుంది.ఆ తరువాత బీమా ప్రయోజనాలు ఏవీ సదరు సభ్యునికి చెల్లించబడవు.
- సభ్యుని వయస్సు వార్షిక పునరుద్దరణ తేదీకి 55 సంవత్సరముల (పుట్టినరోజు సమీప వయస్సు) నిండినట్లయితే .
- బ్యాంకు ఖాతా మూసి వేయడం లేదా బీమా పథకం ప్రీమియం చెల్లించుటకు అవసరమైన సొమ్ము ఖాతాలో లేకపోవడం.
10. ప్రమాద రక్షణ తొలగింపు : నిర్ణీత తేదీన ప్రీమియం చెల్లింపుకు అవసరమైన మొత్తం బ్యాంకు ఖాతాలో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన బీమా సదుపాయాన్ని పొడిగించిన గడువు (గ్రేస్ పీరియడ్) లోగా ప్రీమియం చెల్లించి ఆరోగ్య ధృవీకరణ పత్రము అందజేసిన యెడల బీమా సదుపాయము పునరుద్దరిస్తారు.
11. తనఖాకు వీలులేని విధానం: పథకం పరిధిలోని బీమా ప్రయోజనాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. వీటిని అసైన్ మెంట్ చేయుట, తనఖా పెట్టుట వగైరాలు చేయడానికి వీలులేదు.
12. పథకం నిలిపివేయుట లేదా సవరణలు: ఎప్పుడైనా పథకాన్ని రద్దుచేయుటకు (లేదా) వార్షిక పునరుద్దరణ తేదీన అందుకు సంబంధించిన నిబంధనలను ఒక నెల రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సవరించే పూర్తి హక్కులు బ్యాంకు లేదా కార్పోరేషన్ కు ఉంటాయి.కార్పోరేషన్ మరియు బ్యాంకు మధ్య పరస్పర ఒప్పందంతో పథకం నియమ నిబంధనలను మార్చవచ్చు.
13. న్యాయ పరిధి: బీమా పథకం పరిధిలోని బీమా హామీలన్నీ భారతీయ ఒప్పందాలు. జీవిత బీమా చట్టం , 1956, సవరించబడిన భారతీయ బీమా చట్టం, 1938, ఆదాయ పన్ను చట్టం 1961 (లేదా) కాలానుగుణంగా చేసిన ఏదైనా చట్టంతో సహా భారతీయ చట్టాలకు లోబడే ఒప్పందాలు వుంటాయి. ఎవరైనా సభ్యుడు చనిపోయినప్పుడు చెల్లించే ప్రయోజనాలన్నీ భారతీయ రుపాయలలోనే చెల్లించబడతాయి.
14. అవగాహన ఒప్పందం: పథకం పరిధిలోని అన్ని బీమా సదుపాయాలను పొందుపరుస్తూ కార్పోరేషన్ , బ్యాంకు తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది.
15. గ్రేస్ పీరియడ్ (పొడిగించిన గడువు): కార్పోరేషన్ నిర్దేశించిన ప్రత్యేక కార్యాలయములో ప్రీమియం చెల్లించేందుకు, ప్రీమియం చెల్లింపు గడువు తేది నుంచి 30 రోజుల పాటు పొడిగించిన గడువు ఉంటుంది. ఈ కాలంలో సభ్యుడు చనిపోయినచో 7 వ నిబంధనలో నిర్దేశించిన విధంగా ప్రీమియం అందిన తర్వాతనే బీమా ప్రయోజనం చెల్లిస్తారు.
16. లబ్దిదారుని నియామకం: ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు భార్య లేదా భర్తను ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్ల/పిల్లలను, తమపై ఆధారపడిన వారిని , లబ్దిదారులుగా నియమించవలెను. కాలానుగుణంగా సవరించబడిన 1938 బీమా చట్టం 39వ సెక్షన్ ప్రకారం నామినీని నియమించవలెను. లబ్దిదారు మైనర్ అయినచో బీమా ప్రయోజనాలను అందుకునే నియమత వ్యక్తి పేరును సభ్యుడు తప్పక పేర్కొనవలెను. నామినేషన్ కు సంబంధించిన రికార్డులను , సభ్యుల రిజిస్టర్ లో బ్యాంకు నిర్వహిస్తుంది. సభ్యుడు మృతి చెందినచో ఆ రికార్డుల ప్రకారం సభ్యుడు నామినేట్ చేసిన వ్యక్తికే బీమా ప్రయోజనాలను అందిస్తారు.
17. సమర్పణ (సరెండర్) విలువ/ఫల ప్రయోజనం: ఈ పథకం పరిధిలో సమర్పణ (సరెండర్) విలువ లేదా ఫల ప్రయోజనం ఉండవు.
18. క్లెయిమ్ పరిష్కారం: మరణ సమాచారం తెలియగానే , సదరు ఖాతా గల బ్యాంకు శాఖ క్లెయిమ్ ఫారం (అనుబంధం 7), మరణ ధృవీకరణ పత్రం, విడుదల ఫారం (అనుబంధం 8), ప్రతిపాదిక లబ్దిదారుని నుంచి బీమా సర్టిఫికేట్ మొదలగు వాటిని, సదరు ఖాతాను నిర్వహిస్తున్న ఎల్.ఐ.సీ శాఖ నుంచి క్లెయిమ్ పరిష్కారానికి సంబంధించిన నియమిత బ్యాంకు శాఖకు పంపిస్తుంది. క్లెయిమ్ అందిన తర్వాత క్లెయిమ్ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాలో జమచేసి ఆ విషయాన్ని నియమిత బ్యాంకు శాఖకు తెలియజేస్తారు (అనుబంధం 9), ఏదేని ఇతర వివరాలు కోరబడిననూ లేదా క్లెయిమ్ తిరస్కరించబడిననూ సదరు విషయం నియమిత బ్యాంకు శాఖకు తెలియజేయబడుతుంది.
19. ప్రీమియం రేట్లు మరియు బీమా నిబంధనలు: ప్రీమియం రేట్లు మరియు బీమా నిబంధనలు బ్యాంకు మరియు పథకము నిర్వహించుటకు సిద్ధమయ్యే బీమా సంస్థ మధ్య కుదుర్చుకునే ఒప్పందానికి లోబడి ఉంటాయి. బీమా రక్షణ కల్పించుటకు నిబంధనలు మరియు ప్రీమియం రేట్లను బ్యాంకు కు మూడు నెలల ముందు నోటీసు ఇచ్చి కాలానుగుణంగా బీమా సంస్థ ఏదేని వార్షిక పునరుద్దరణ తేదీన సవరించవచ్చును.
నామినీ మైనర్ , వాండ్ల అమ్మమ్మ దగ్గర యుంటునాడు.. అప్పుడు ఎవరి బ్యాంక్ అకౌంటు పంపుకోవాలి.