‘జగనన్నతోడు’ పథకం
చిరువ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తి దారుల వ్యాపారాభివృత్తి కొరకు ‘జగనన్నతోడు’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000/- వేల రూపాయలు లోపు సున్నావడ్డీతో ప్రభుత్వం ఋణ సహాయము అందిస్తుంది.
చిరువ్యాపారులు అంటే ఎవరు?
- సాంప్రదాయ బద్దమైన చేతి వృత్తులను జీవనాధారంగా జీవించే అల్పాదాయ వర్గ ప్రజలు. ఉదా: మగ్గం పని, లేస్ వర్క్స్, కుమ్మరి, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు , తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, ఇత్తడి వస్తువుల తయారీ మొదలైనవి ఉత్పత్తివి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు.
- రోడ్డుపక్కన , వీధులలో , బహిరంగ ప్రదేశాలలో , ఫుట్ పాత్ లపై మరియు ప్రైవేట్ స్థలాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం చేసుకునేవారు (చిరుతిళ్ళు, అంగళ్లు, చెప్పులుకుట్టేవారు).
- సుమారు 5X5 అడుగుల స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాప్ లను ఏర్పాటు చేసుకుని వస్తువులు, సరుకులు అమ్ముకునేవారు.
- తోపుడు బండ్లు లేదా తలమీద/భుజంమీద/గంపలలో , వస్తువులు/సరుకులను మోస్తూ మరియు వీధులలో సరుకులు/వస్తువులు అమ్ముకునేవారు.
- ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్ , మోటార్ సైకిల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు/వస్తువులు అమ్ముకునేవారు.
అర్హతలు:
- 18 సంవత్సరాలు నిండిన వారు.
- నెలవారీ ఆదాయం గ్రామాలలో ప్రాంతాలలో నెలకు రూ.10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/- లోపు కలిగిన వారు.
- మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకారాలు (లేదా) మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాల లోపు వున్నవారు.
- ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను (ఆధార్ కార్డు,ఓటర్ కార్డు లేదా ఇతరములు ) కలిగినవారు.
దరఖాస్తు చేసుకునే విధానము:
- అర్హత కలిగిన వారు వ్యాపార వివరాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును.
- అర్హులైన దరఖాస్తుదారునికి YSR ( Your Service Request- మీసేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.
- దరఖాస్తు చేసిన లబ్దిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి బ్యాంకుల ద్వారా సున్నావడ్డీతో రూ.10,000/- లోపు ఋణం ఇప్పించబడును.
- లబ్దిదారులు బకాయి లేకుండా వడ్డీతో బ్యాంకునకు నెలసరి కంతులు/ వాయిదాలు చెల్లించిన యెడల, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి వడ్డీని లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది.
కార్యాచరణ మార్గదర్శకాలు :
సర్వే మరియు ఎంపిక విధానము:-
- గ్రామ మరియు వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న చిరువ్యాపారులను సర్వే ద్వారా గుర్తించాలి.
- సామాజిక తనిఖీ కొరకు గుర్తించిన చిరువ్యాపారుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయంలో ప్రదర్శించాలి. సామాజిక తనిఖీ పూర్తి అయిన తరువాత తుది జాబితాను రూపొందించాలి.
- నిరంతర సామాజిక తనిఖీ కొరకు మరియు పారదర్శకత కొరకు తుది జాబితాను సచివాలయంలో ప్రదర్శించాలి.
- అర్హులైన ఎవరైనా తన పేరు తుది జాబితాలో నమోదు కాలేదు అంటే అట్టి వారు గ్రామ/వార్డు సచివాలయంలో పేరును నమోదు చేసుకోవలెను.
- జగనన్న తోడుగా పథక అమలును నిరంతరం పర్యవేక్షించుటకు పారదర్శకమైన ఆన్ లైన్ పోర్టల్ ను బ్యాంకుల సమన్వయంతో నిర్వహించబడుతుంది.
- తుది జాబితా ద్వారా ఎంపిక చేసిన చిరువ్యాపారులు అందరికీ గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా QR కోడ్ కలిగిన స్మార్ట్ గుర్తింపు కార్డును అందించాలి.
- బ్యాంకు అకౌంట్ లేని వారికి గ్రామ/వార్డు వాలంటీర్లు దగ్గరలోని బ్యాంకులలో వ్యక్తిగత పొదుపు (SB) అకౌంట్ ను ప్రారంభించాలి.
జగనన్న పథకం ద్వారా వడ్డీలేని ఆర్థిక సహాయం పొందు విధానం:
- ఈ పథకంలో దరఖాస్తులను గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామ/వార్డు సచివాలయాలలో స్వీకరిస్తారు.
- దరఖాస్తులను పూర్తిచేయుటలో మరియు అవసరమైన ఋజువర్తనాలు (డాకుమెంట్స్) జతపరచుటలో వార్డు వాలంటీర్లు చిరువ్యాపారులకు సహకరిస్తారు.
- గ్రామ/వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ వారు పరిశీలించి మరియు ఆమోదించిన జాబితాను బ్యాంకులకు పంపబడును.
- బ్యాంకు సిబ్బంది దరఖాస్తులను పరిశీలించిన తరువాత మార్గదర్శకాల ప్రకారం పథకానికి అర్హులైన దరఖాస్తుదారుల అభ్యర్తన మేరకు రూ.10,000/-లకు వరకు ఋణమును మంజూరు చేస్తారు.
- మంజూరు చేసిన ఋణమును వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ కు ప్రత్యక్షంగా బదిలీ చేస్తారు.
- ఋణం పంపిణీ చేసిన జాబితా మరియు తిరిగి చెల్లింపు లావాదేవీలను రోజువారీ విధానంలో బ్యాంకువారు గ్రామ/వార్డు సచివాలయాలకు మరియు బ్యాంకు కలెక్షన్ ఏజెంట్లకు సహకరించవలెను.
- బ్యాంకులకు వడ్డీ చెల్లింపు బ్యాంకుల అనుసంధానంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నిర్ధారిస్తుంది.
బ్యాంకులతో సమన్వయం:
- కేవలందరఖాస్తులను బ్యాంకులలో ఇచ్చినంత మాత్రానా ఋణాలు రావు.
- బ్యాంకులు దరఖాస్తులను పరిశీలించుతాయి. ఇది వరకే ఋణాలు పొందివున్నవారిని , సకాలంలో చెల్లింపులు చేయనివారిని తొలగించి, అర్హులను, అనర్హులను ఎంపిక చేస్తాయి.
- బ్యాంకుల నుండి అర్హుల జాబితా పొందవలెను.
- అర్హులైన దరఖాస్తుదారులకు ఋణాల మంజూరీలో బ్యాంకులకు సహకరించవలెను.
- ఉదాహరణ: బ్యాంకు ఖాతా దరఖాస్తులను నింపుట, ఋణ మంజూరు పత్రాలను సరిచూచుట, దరఖస్తుదారుల బయోమెట్రిక్ హాజరు కోసం వేలి ముద్రల పరికరాలను వినియోగించడానికై కరస్పాండెంట్ల సహకారం తీసుకొనుట.
- గ్రామీణ ప్రాంతాలలో వి.ఒ.ఎ., సీ.సీ., ఏ.పి.ఎం. & ఏరియా కోఆర్డినేటర్ల సహకారం తీసుకోవలెను.
- పట్టణ ప్రాంతాలలో మెప్మా లోని రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటి ఆర్గనైజర్లు , సిటీ మిషన్ ఆర్గనైజర్లు, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోవలెను.
- లక్ష్యాల సాధనకై డి.ఆర్.డి.ఒ & మెప్మా పథక సంచాలకులకు జాయింట్ కలెక్టర్లు (గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) తగు ఆదేశాలు జారీ చేయవలెను.
ఎం.పి.డి.ఒ లు & మునిసిపల్ కమీషనర్లు చేయవలసిన పనులు:
- జాయింట్ కలెక్టర్లు (గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) ద్వారా అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమర్పించవలెను.
- లీడ్ బ్యాంకు మేనేజర్ తో సమన్వయం చేసుకోవలెను.
- జాయింట్ కలెక్టర్ (గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) మార్గదర్శనం లో బ్యాంకు వారీ , బ్యాంకు శాఖ వారీ , ఋణ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవలెను.
- జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించాలి లీడ్ జిల్లా మేనేజర్ ను కోరాలి.
- జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో జగనన్న తోడు ఋణ కార్యాచరణ ప్రణాళికను ఆమోదింపజేసుకోవాలి.
- అన్ని బ్యాంకు శాఖలకు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ ఉత్తర్వులు చేరునట్లుగా చూసుకోవాలి.
- బ్యాంకు మేనేజర్లతో సమన్వయపరుచుకొని, మంజురీలు తెచ్చుకొని, జగనన్న తోడు ఋణ పంపిణీకి సిద్ధంగా ఉండాలి.
- ప్రభుత్వ నిర్ణయం మేరకు జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం నాడు చిరు వ్యాపారులకు ఋణ పంపిణీ చేయాలి.
Post Views: 24