ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం వివరాలు:
ఏ.పి.ఎం.ఆర్.టి.ఎస్ ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా అందిస్తున్న పథకం “ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం”. 18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన ఉద్యోగులు మరియు విద్యార్థులు అయిన ప్రవాసాంధ్రులు ఎవరైనా ఈ బీమా పథకాన్ని పొందవచ్చు. ఉద్యోగులైతే మూడు సంవత్సరాలకు గానూ రూ.550/- రూపాయలు మరియు విద్యార్థుల అయితే ఒక సంవత్సరానికి రూ.180/- రూపాయలు చెల్లించి ఈ బీమా ఎన్రోల్ /రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
ప్రవాసాంధ్ర భరోసా బీమా వలన కలిగే ప్రయోజనాలు:
ఉద్యోగులకు (వయస్సు పరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య) ప్రీమియం రూ.553/- మూడు సంవత్సరాలకు భీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన నష్టపరిహారం కింద రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం.
- భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించడానికి లేదా అంగవైకల్యం కలిగిన వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు ఒక సహాయకుని తో పాటు సాధారణ తరగతి విమాన ఖర్చుల చెల్లింపు.
- మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యం కలిగిన వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల కింద బీమా కాలపరిమితి వరకు సంవత్సరానికి రూ.50 వేల రూపాయల వరకు చెల్లింపు.
- ప్రమాదం వలన సంభవించే గాయాలు /అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల కింద లక్షరూపాయల వరకు చెల్లింపు.
- అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తించినట్లయితే ఆ వ్యక్తికి, ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన చార్జీల చెల్లింపు.
- భీమా చేయబడిన మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాలపరిమితిలో సాధారణ ప్రసూతి ఆసుపత్రి ఖర్చుల క్రింద రూ.35 వేల రూపాయల వరకు లేదా సిజేరియన్ ఆపరేషన్ ఆసుపత్రి ఖర్చుల కింద రూ.50 వేల రూపాయల వరకు చెల్లింపు. గమనిక: ప్రసూతి ప్రయోజనాన్ని పొందటానికి పాలసీ బాండ్ జారీ చేసిన తేదీ నుండి కనీసం తొమ్మిది నెలల వ్యవధి ఉండాలి.
- ఉద్యోగ సమయంలో కంపెనీ యాజమాన్యంతో ఏవేని సమస్యలు తలెత్తినట్లయితే, ఆ సమస్యల పరిష్కారానికి అయ్యే న్యాయ పరిష్కార ఖర్చుల క్రింద రూ.45 వేల రూపాయల వరకు చెల్లింపు.
విద్యార్థులకు /(వయస్సు పరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య) ప్రీమియం రూ.180/- రూపాయలు ఒక సంవత్సరానికి
- భీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా నష్టపరిహారం కింద రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం.
- భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించడానికి లేదా అంగవైకల్యం కలిగిన వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు ఒక సహాయకునితో తో పాటు సాధారణ తరగతి విమాన ఖర్చుల చెల్లింపు.
- ప్రమాదం వలన సంభవించే గాయాలు /అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల కింద లక్షరూపాయల వరకు చెల్లింపు.
- ప్రమాదం /అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లయితే ఆ వ్యక్తికి, ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన చార్జీల చెల్లింపు.
కావలసిన పత్రాలు /డాక్యుమెంట్స్ (ఉద్యోగులు మరియు విద్యార్థుల కొరకు ):
- పాస్ పోర్ట్ ఫ్రంట్ పేజీ
- పాస్ పోర్ట్ బ్యాక్ పేజీ
- ఫారిన్ రెసిడెన్స్ ప్రూఫ్ ( వీసా లేదా సివిల్ ఐడి లేదా ఆఫర్ లెటర్) మరిన్ని వివరాలకు ఏ.పి.ఎన్.ఆర్.టి.ఎస్ హెల్ప్ లైన్ నెంబర్ +91 8632340678, వాట్సాప్ నెంబర్ +91 8500027678 ను సంప్రదించగలరు.