వైఎస్ఆర్ చేయూత రెండో ఏడాదికి సంబంధించి అర్హుల జాబితాను సిద్దం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసి,ఎస్సి,ఎస్టీ,మైనార్టీల్లోని 45-60 ఏళ్ళ వయసు ఉన్న మహిళలకు ఏటా రూ.18,750/- చొప్పున నాలుగేళ్ళు పంపిణి చేయాలనేది పథక లక్ష్యం. రెండో విడత లబ్దిని జూన్ 22న ఇవ్వనున్నారు. ఇందుకు అర్హుల మొబైల్ నంబర్ ను ఆధార్ కు లింక్ చేయాలని , ఆ నంబరే బ్యాంకు ఖాతాలకు కూడా అనుసంధానించి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గతేడాది ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారిలో చనిపోయిన, ప్రస్తుత ఏడాదిలో 61 సంవత్సరాల వయసులోకి వచ్చిన , ఉపాధికి వలసలు వెళ్ళిన వారు అనర్హులవుతారు. వారి వివరాలను సేకరించి జాబితాల నుంచి తొలగిస్తారు. వాలంటీర్లు ఇంటింటా సర్వే చేసి లబ్దిదారులను ఎంపిక చేసి వారి పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేస్తారు.
వైఎస్ఆర్ చేయూత పథకం కోసం 45 ఏళ్ళు నిండి, కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసుకునే మహిళలు మాత్రమే ఆధార్ కు మొబైల్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలి. గతేడాది ఈ పథకం కింద లబ్ది పొందిన వారికి అవసరం లేదు. ఈ ఏడాది ఆగష్టు 12 నాటికీ 45 ఏళ్ళు నిండుతున్న వారు మాత్రమే ఆధార్ ను మొబైల్ నంబర్ ను లింక్ చేసుకోవాలి. ఈ ఏడాదితో 60 ఏళ్ళు పూర్తయిన వారికి పథకం వర్తించదని , వారి పేర్లను తొలగిస్తారు. సమాచారాన్ని వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు తెలియజేయాలి.
కొత్తగా ఈ సంవత్సరం అప్లై చేసే వారికి మాత్రమే ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరం.
Post Views: 3