ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం
పథకం వివరాలు:
ఈ ప్రమాద బీమా పథకం ఒక ఏడాది కాలానికి వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం పునరుద్దరించుకోవచ్చు.ఈ పథకంలో బీమా రక్షణ ప్రమాదం కారణంగా సంభవించే హఠాన్మరణానికి గాని, అంగ వైకల్యానికి గాని వర్తిస్తుంది. ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు (పిఎస్ జిఐసిలు ) మరియు అవసరమైన అనుమతులను పొంది,ఒకే విధమైన షరతులతో ఈ పథకాన్ని అందించే ఇతర సాధారణ బీమా కంపెనీలు బ్యాంకుతో అనుసంధానమై ఈ పథకాన్ని అమలు చేస్తాయి. బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం ఈ పథకాన్ని అందించుటకు ఏ బీమా కంపెనీ భాగస్వామ్యంతోనైనా నిర్వహించుటకు స్వేఛ్చ కలిగి ఉన్నాయి.
పథకం వర్తింపు:
ఈ పథకం అమలు చేసే బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న 18 సం.. నుంచి 70సం..ల మధ్య వయస్సు కలిగిన ఖాతాదారులందరికీ ఇది వర్తిస్తుంది. ఒకే బ్యాంకులో కాని , ఇతర బ్యాంకుల్లో కాని ఒక వ్యక్తికి ఎక్కువ పొదుపు ఖాతాలున్నచో , ఒకే ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు ప్రాథమిక కేవైసిగా ఉంటుంది.
నమోదు విధానం/ కాలవ్యవధి :
బీమా రక్షణ ఒక ఏడాదికి వర్తిస్తుంది. రక్షణ కాలవ్యవధి జూన్ 1వ తేదీనుంచి మే 31తేదీవరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన నిర్దేశిత దరఖాస్తును సమర్పించి పథకంలో చేరవచ్చు/ పొదుపు ఖాతానుంచి ఆటో డెబిట్ ద్వారా ప్రీమియం చెల్లింపు చేయవచ్చు. నమోదు కావడానికి మొదటి ఏడాది ఆగష్టు 31, 2015 వరకు వ్యవధి ఉంటుంది.పథకం ప్రవేశపెట్టిన తొలిఏడాది భారత ప్రభుత్వం మరో మూడు నెలలపాటు అంటే నవంబర్ 30, 2015 వరకు నమోదుకు అవకాశం ఇవ్వవచ్చు . వార్షిక ప్రీమియంను చెల్లించి ప్రత్యేక నియమ నిబంధనలకు లోబడి ఈ పథకంలో చేరవచ్చు. గత అనుభవాల దృష్ట్యా షరతులు, నిబంధనలు పునర్వ్యవస్థీకరిస్తూ పథకం కొనసాగింపుకులోబడి ఖాతాదారులు పథకంలో చేరడానికి కాలపరిమితి లేని / దీర్ఘకాలిక అంగీకారాన్ని / ఆటో డెబిట్ అధికారాన్ని బ్యాంకుకు ఇవ్వవచ్చు.
ఈ పథకం నుంచి ఎప్పుడైనా వైదొలగిన వ్యక్తులు పై పద్దతిలో మళ్ళీ ఈ పథకంలో చేరవచ్చు. పథకం కొనసాగుతున్నప్పుడు ప్రతి ఏడాది అర్హులైన కొత్తవారు చేరవచ్చు. అలాగే ప్రస్తుతం అర్హత ఉండి ఇదివరకు పథకంలో చేరనివారు కుడా ఈ పథకంలో భవిష్యత్తులో చేరవచ్చు.
ప్రయోజనాలు : కింది పట్టికలో ఇచ్చిన విధంగా ఉంటాయి.
ప్రయోజనాల పట్టిక | బీమా మొత్తం |
ఎ) మృతి | రూ.2 లక్షలు |
బి) రెండు కళ్ళు గాని రెండు చేతులు గాని , రెండు పాదాలు గాని నష్టపోయినా ఒక కన్ను పూర్తిగా చూపుకోల్పోయిన మరియు చేయి లేదా పాదం పనిచేయకపోయినా | రూ.2 లక్షలు |
సి) ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా పాదం పూర్తిగా పని చేయకపోయినప్పుడు | రూ.1 లక్ష |
ప్రీమియం:
ఒక వ్యక్తికి ఏడాదికి రూ.12/- ఈ పథకం కింద వార్షిక బీమా రక్షణ కాలానికి ఒకేసారి జూన్ 1వ తేదీనగాని , అంతకుముందుగాని, బ్యాంకు ఖాతానుంచి ఖాతాదారు చెల్లించవలసిన ప్రీమియంను ఆటో డెబిట్ పద్దతిలో వసూలు చేస్తారు. అయితే ఆటో డెబిట్ జూన్ 1 తరువాత జరిగితే ఆ తరువాతి నెల 1వ తేదీనుంచి బీమా రక్షణ వర్త్గిస్తుంది.