jagananna-thodu-scheme-in-telugu

Jagananna Thodu Scheme in Telugu

‘జగనన్నతోడు’ పథకం

చిరువ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తి దారుల వ్యాపారాభివృత్తి కొరకు ‘జగనన్నతోడు’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000/- వేల రూపాయలు లోపు సున్నావడ్డీతో ప్రభుత్వం ఋణ సహాయము అందిస్తుంది.

చిరువ్యాపారులు అంటే ఎవరు?

  1. సాంప్రదాయ బద్దమైన చేతి వృత్తులను జీవనాధారంగా జీవించే అల్పాదాయ వర్గ ప్రజలు. ఉదా: మగ్గం పని, లేస్ వర్క్స్, కుమ్మరి, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు , తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, ఇత్తడి వస్తువుల తయారీ మొదలైనవి ఉత్పత్తివి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు.
  2. రోడ్డుపక్కన , వీధులలో , బహిరంగ ప్రదేశాలలో , ఫుట్ పాత్ లపై మరియు ప్రైవేట్ స్థలాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం చేసుకునేవారు (చిరుతిళ్ళు, అంగళ్లు, చెప్పులుకుట్టేవారు).
  3. సుమారు 5X5 అడుగుల స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాప్ లను ఏర్పాటు చేసుకుని వస్తువులు, సరుకులు అమ్ముకునేవారు.
  4. తోపుడు బండ్లు లేదా తలమీద/భుజంమీద/గంపలలో , వస్తువులు/సరుకులను మోస్తూ మరియు వీధులలో సరుకులు/వస్తువులు అమ్ముకునేవారు.
  5. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్ , మోటార్ సైకిల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు/వస్తువులు అమ్ముకునేవారు.

అర్హతలు:

  1. 18 సంవత్సరాలు నిండిన వారు.
  2. నెలవారీ ఆదాయం గ్రామాలలో ప్రాంతాలలో నెలకు  రూ.10,000/-  మరియు  పట్టణ ప్రాంతాలలో అయితే  రూ.12,000/- లోపు కలిగిన వారు.
  3. మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకారాలు (లేదా) మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాల లోపు వున్నవారు.
  4. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను (ఆధార్ కార్డు,ఓటర్ కార్డు లేదా ఇతరములు ) కలిగినవారు.

దరఖాస్తు చేసుకునే విధానము:

ap grama ward volunteer awards 2023 dates
AP Grama Ward Volunteer Awards – 2023
  1. అర్హత కలిగిన వారు వ్యాపార వివరాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును.
  2. అర్హులైన దరఖాస్తుదారునికి YSR ( Your Service Request- మీసేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.
  3. దరఖాస్తు చేసిన లబ్దిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి బ్యాంకుల ద్వారా సున్నావడ్డీతో రూ.10,000/- లోపు ఋణం ఇప్పించబడును.
  4. లబ్దిదారులు బకాయి లేకుండా వడ్డీతో బ్యాంకునకు నెలసరి కంతులు/ వాయిదాలు చెల్లించిన యెడల, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి వడ్డీని లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది.

కార్యాచరణ మార్గదర్శకాలు :

సర్వే మరియు ఎంపిక విధానము:-

  1. గ్రామ మరియు వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న చిరువ్యాపారులను సర్వే ద్వారా గుర్తించాలి.
  2. సామాజిక తనిఖీ కొరకు గుర్తించిన చిరువ్యాపారుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయంలో ప్రదర్శించాలి. సామాజిక తనిఖీ పూర్తి అయిన తరువాత తుది జాబితాను రూపొందించాలి.
  3. నిరంతర సామాజిక తనిఖీ కొరకు మరియు పారదర్శకత కొరకు తుది జాబితాను సచివాలయంలో ప్రదర్శించాలి.
  4. అర్హులైన ఎవరైనా తన పేరు తుది జాబితాలో నమోదు కాలేదు అంటే అట్టి వారు గ్రామ/వార్డు సచివాలయంలో పేరును నమోదు చేసుకోవలెను.
  5. జగనన్న తోడుగా పథక అమలును నిరంతరం పర్యవేక్షించుటకు పారదర్శకమైన ఆన్ లైన్ పోర్టల్ ను బ్యాంకుల సమన్వయంతో నిర్వహించబడుతుంది.
  6. తుది జాబితా ద్వారా ఎంపిక చేసిన చిరువ్యాపారులు అందరికీ గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా QR కోడ్ కలిగిన స్మార్ట్ గుర్తింపు కార్డును అందించాలి.
  7. బ్యాంకు అకౌంట్ లేని వారికి గ్రామ/వార్డు వాలంటీర్లు దగ్గరలోని బ్యాంకులలో వ్యక్తిగత పొదుపు (SB) అకౌంట్ ను ప్రారంభించాలి.

జగనన్న పథకం ద్వారా వడ్డీలేని ఆర్థిక సహాయం పొందు విధానం:

  1. ఈ పథకంలో దరఖాస్తులను గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామ/వార్డు సచివాలయాలలో స్వీకరిస్తారు.
  2. దరఖాస్తులను పూర్తిచేయుటలో మరియు అవసరమైన ఋజువర్తనాలు (డాకుమెంట్స్) జతపరచుటలో వార్డు వాలంటీర్లు చిరువ్యాపారులకు సహకరిస్తారు.
  3. గ్రామ/వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ వారు పరిశీలించి మరియు ఆమోదించిన జాబితాను బ్యాంకులకు పంపబడును.
  4. బ్యాంకు సిబ్బంది దరఖాస్తులను పరిశీలించిన తరువాత మార్గదర్శకాల ప్రకారం పథకానికి అర్హులైన దరఖాస్తుదారుల అభ్యర్తన మేరకు రూ.10,000/-లకు వరకు ఋణమును మంజూరు చేస్తారు.
  5. మంజూరు చేసిన ఋణమును వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ కు ప్రత్యక్షంగా బదిలీ చేస్తారు.
  6. ఋణం పంపిణీ చేసిన జాబితా మరియు తిరిగి చెల్లింపు లావాదేవీలను రోజువారీ విధానంలో బ్యాంకువారు గ్రామ/వార్డు సచివాలయాలకు మరియు బ్యాంకు కలెక్షన్ ఏజెంట్లకు సహకరించవలెను.
  7. బ్యాంకులకు వడ్డీ చెల్లింపు బ్యాంకుల అనుసంధానంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నిర్ధారిస్తుంది.

బ్యాంకులతో సమన్వయం:

mission-vatsalya-scheme
Mission Vatsalya Scheme Details in Telugu
  1. కేవలందరఖాస్తులను బ్యాంకులలో ఇచ్చినంత మాత్రానా ఋణాలు రావు.
  2. బ్యాంకులు దరఖాస్తులను పరిశీలించుతాయి. ఇది వరకే ఋణాలు పొందివున్నవారిని , సకాలంలో చెల్లింపులు చేయనివారిని తొలగించి, అర్హులను, అనర్హులను ఎంపిక చేస్తాయి.
  3. బ్యాంకుల నుండి అర్హుల జాబితా పొందవలెను.
  4. అర్హులైన దరఖాస్తుదారులకు ఋణాల మంజూరీలో బ్యాంకులకు సహకరించవలెను.
  5. ఉదాహరణ: బ్యాంకు ఖాతా దరఖాస్తులను నింపుట, ఋణ మంజూరు పత్రాలను సరిచూచుట, దరఖస్తుదారుల బయోమెట్రిక్ హాజరు కోసం వేలి ముద్రల పరికరాలను వినియోగించడానికై కరస్పాండెంట్ల సహకారం తీసుకొనుట.
  6. గ్రామీణ ప్రాంతాలలో వి.ఒ.ఎ., సీ.సీ., ఏ.పి.ఎం. & ఏరియా కోఆర్డినేటర్ల సహకారం తీసుకోవలెను.
  7. పట్టణ ప్రాంతాలలో మెప్మా లోని రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటి ఆర్గనైజర్లు , సిటీ మిషన్ ఆర్గనైజర్లు, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోవలెను.
  8. లక్ష్యాల సాధనకై డి.ఆర్.డి.ఒ & మెప్మా పథక సంచాలకులకు జాయింట్ కలెక్టర్లు (గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) తగు ఆదేశాలు జారీ చేయవలెను.

ఎం.పి.డి.ఒ లు & మునిసిపల్ కమీషనర్లు చేయవలసిన పనులు:

  1. జాయింట్ కలెక్టర్లు (గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) ద్వారా అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమర్పించవలెను.
  2. లీడ్ బ్యాంకు మేనేజర్ తో సమన్వయం చేసుకోవలెను.
  3. జాయింట్ కలెక్టర్ (గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) మార్గదర్శనం లో బ్యాంకు వారీ , బ్యాంకు శాఖ వారీ , ఋణ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవలెను.
  4. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించాలి లీడ్ జిల్లా మేనేజర్ ను కోరాలి.
  5. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో జగనన్న తోడు ఋణ కార్యాచరణ ప్రణాళికను ఆమోదింపజేసుకోవాలి.
  6. అన్ని బ్యాంకు శాఖలకు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ ఉత్తర్వులు చేరునట్లుగా చూసుకోవాలి.
  7. బ్యాంకు మేనేజర్లతో సమన్వయపరుచుకొని, మంజురీలు తెచ్చుకొని, జగనన్న తోడు ఋణ పంపిణీకి సిద్ధంగా ఉండాలి.
  8. ప్రభుత్వ నిర్ణయం మేరకు జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం నాడు చిరు వ్యాపారులకు ఋణ పంపిణీ చేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top