Jagananna Vidya Kanuka Scheme in Telugu
జగనన్న విద్యా కానుక పథకము పూర్తి వివరాలు:
పథకం యొక్క ఉద్దేశం:
- పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు అభ్యసనంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడం.
పథకం యొక్క లక్ష్యం:
- పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడం. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం.
జగనన్న విద్యా కానుక లో ఏముంటాయంటే..?
- జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 వ తరగతి నుండి 10 వ విద్యార్థులకు అందజేసే కిట్ లో ఒక స్కూల్ బ్యాగ్ , 3 జతల యునిఫామ్స్,ఒక జత బూట్లు,రెండు జతల సాక్సులు ,బెల్టు , ఒక సెట్ టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ ,వర్క్ బుక్స్ ఉంటాయి.
- ఇంకా పిల్లలకు ఇస్తున్న మూడు జతల యూనిఫాం కుట్టు కూలీ కోసం ఒకటో తరగతి నుంచి 8వ తరగతి లోపు విద్యార్థులకు రూ.120 రూపాయలు చొప్పున తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఒక్కొక్కరికి రూ.250 రూపాయల చొప్పున నిధులను విద్యార్థుల తల్లుల అకౌంట్లకే నేరుగా విడుదల చేస్తారు.
- వీటితో పాటు పిల్లలకు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ కూడా ఈ విద్యా సంవత్సరం నుండి అందించనున్నారు.
పారదర్శక సేకరణ:
- జగనన్న విద్య కానుక లో విద్యార్థులకు అందించే వస్తువులు, బుక్స్, యూనిఫామ్ క్లాత్ ను ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా రివర్స్ టెండరింగ్,ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించారు.
- దేశంలో ఎక్కడా లేనివిధంగా బడిపిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్కూల్ కిట్లు ఇస్తున్న మొదటి, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది.
ఇతర వివరములు:
- జగనన్న విద్యా కానుక విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాశాఖాధికారి ని సంప్రదించవలెను.
- కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థులు బయోమెట్రిక్ మరియు ఐరిష్ హాజరుకు సహకరించవలెను.
- “జగనన్న విద్యా కానుక” కు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే 9121296051 &9121296052 నంబర్లకు పని దినాల్లో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 6 గంటల లోపు సంప్రదించవలెను.
Post Views: 7
Hats off to Jagan annaya