Jagananna Vidya Deevena Scheme in Telugu
జగనన్న విద్య దీవెన పథకము :
పథకం యొక్క ఉద్దేశం:
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించడం.
ప్రయోజనాలు:
- ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ,బీఈడీ వంటి కోర్సులు చదువుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ వర్గాల వారికి, దివ్యాంగులు అయిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అందించడం.
- ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చడం.
అర్హతలు:
- పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటిఐ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులను ప్రభుత్వ గుర్తింపు కలిగిన కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
- విద్యార్థులు 75 శాతం హాజరుని తప్పనిసరిగా కలిగి ఉండాలి. కానీ కోవిడ్ కారణంగా గడిచిన విద్యాసంవత్సరానికి హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
- కుటుంబ వార్షిక ఆదాయం 2.50 లక్షల లోపు ఉన్న వారు అర్హులు.
- కుటుంబానికి వ్యవసాయ భూమి పరిమితి మాగాణి అయితే 10 ఎకరాల లోపు, మెట్ట అయితే 25 ఎకరాల లోపు లేదా రెండు కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు.
- పట్టణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగులు కన్నా తక్కువ బిల్డప్ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం ) కలిగిన కుటుంబం ఈ పథకానికి అర్హులు.
- ఆదాయం తో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
- టాక్సీ, ఆటో, ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్న కుటుంబాల వారికి ఆదాయ పరిమితి నిబంధన మినహాయింపు.
అనర్హతలు:
- ప్రభుత్వ సూచనల మేరకు వార్షిక ఆదాయ పరిమితి, భూమి పరిమితి కన్నా ఎక్కువగా ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
- కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ/ ఆదాయ పన్ను చెల్లింపుదారులు కానీ/ పదవి విరమణ పొంది పెన్షన్ పొందే వ్యక్తి కానీ అయి ఉండరాదు. ( పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు కలదు)
- డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలకు ఈ పథకం వర్తించదు.
- దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్ మెంట్, ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తించదు.
కావలసిన పత్రాలు:
- బ్యాంక్ ఖాతా పుస్తకం
- ఆధార్ కార్డు
- కుల దృవీకరణ పత్రం
- రెవిన్యూ శాఖ నుండి ఆదాయ ధ్రువీకరణ పత్రం
- రెసిడెన్షియల్ సర్టిఫికెట్
- కాలేజీ అడ్మిషన్ సర్టిఫికెట్
- అడ్మిషన్ ఫీజు రిసిప్ట్
- BPL లేదా EWS సర్టిఫికెట్
- తల్లిదండ్రుల వృత్తి ధ్రువీకరణ పత్రం
- ఉద్యోగులు అయితే నాన్ ట్యాక్స్ పేయర్ డిక్లరేషన్
2021- 22 ఆర్థిక సంవత్సరానికి గానూ జగనన్న విద్యా దీవెన 2వ విడత విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :
- 5 – జూలై – 2021 : తాజాగా నవీకరించిన డేటాబేస్ తో జ్ఞానభూమి(APCFSS) సాంకేతిక బృందం వారు జగనన్న విద్యా దీవెన దరఖాస్తులను ఆరు దశల దృవీకరణ నిర్వహిస్తారు.
- 6- జూలై – 2021: WEA/WES లాగిన్ లలో అనర్హుల జాబితాను ప్రదర్శిస్తారు.
- 6-12 జూలై – 2021 : ఆరు దశల ధృవీకరణతో అనర్హుల దరఖాస్తులను గుర్తిస్తారు.
- 3-10 జూలై – 2021 : WEA లు/WES లు లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ ని మరియు తల్లుల నుండి ఎలక్ట్రానిక్ అక్నాలెడ్జ్మెంట్ ని సేకరిస్తారు.
- 3-10 జూలై – 2021 : కళాశాలలకు రుసుము చెల్లించకపోవడానికి కారణాలను విశ్లేషిస్తారు. అలానే సకాలంలో ఫీజులు చెల్లించేలా సంబంధిత తల్లులకు ప్రేరణ కల్పిస్తారు.
- 13 జూలై – 2021 : సచివాలయాలలో జగనన్న విద్యా దీవెన రెండవ విడత ఫీజుల చెల్లింపు కి సంబంధించిన అర్హుల మరియు అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు.
- 14-15 జూలై – 2021 : సామాజిక ఆడిట్ ( సోషల్ ఆడిట్) లో భాగంగా జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
- 16 జూలై – 2021 : ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్ లాగిన్ కి WEA/WES అభ్యంతరాలపై వివరణాత్మక వ్యాఖ్యలను పంపడం జరుగుతుంది.
- 16 జూలై – 2021 : క్షేత్ర దృవీకరణ నిర్వహించిన తరువాత మరియు సమర్థవంతమైన కారణాలతో ఎంపీడీవోలు మరియు మునిసిపల్ కమిషనర్ అభ్యంతరాలను తొలగించడం.
- 22 జూలై – 2021 : APCFSS ద్వారా అర్హత గల విద్యార్థుల బిల్లుల విడుదల.
Post Views: 14