ysr-nethanna-nestham

YSR Nethanna Nestham Scheme 3 Days Campaign

వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పథకము మూడు రోజుల ప్రచార కార్యక్రమం

మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయిన గౌ. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ ఏడాదికి గానూ ఆగష్టు 10వ తేదీన ప్రారంభం కానున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం గురించిన సమాచారాన్ని, ఈ సందర్భంగా ఆయన ఇచ్చే సందేశాన్ని ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రభావవంతంగా చేరవేసేందుకు ఈ మూడు రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులను ఈ ప్రచార కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమలులో పూర్తిస్థాయిలో భాగస్వామ్యులను చేయనున్నారు. ఈ పథకం అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారానే తెలుసుకుంటారు.

 వైయస్సార్ నేతన్న నేస్తం పథకం – ప్రచార కార్యక్రమ ప్రణాళిక

గ్రామ మరియు వార్డు సచివాలయాల వాలంటీర్లు అందరూ కేటాయించిన కుటుంబాల్లోని వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులకు ఆ పథకం గురించిన వివరాలను మరియు ప్రయోజనాల గురించి తెలియజేయాలి. ఇంకా పూర్తి సమాచారం కోసం మరుసటి రోజు సంబంధిత సచివాలయాలకు  తప్పక హాజరు కావాలని తెలియజేయాలి.

గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో WEA/WWDS లు వైయస్సార్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారుల తో సమావేశాన్ని నిర్వహించాలి. ఆ సమావేశంలో జగనన్న ప్రభుత్వం “వైయస్సార్ నేతన్న నేస్తం” పథకాన్ని ప్రారంభించిన ముఖ్య ఉద్దేశ్యం, పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలు మరియు ప్రభుత్వ లక్ష్యాల గురించి లబ్ధిదారులతో చర్చించాలి. ఇదే రోజున “వైయస్సార్ నేతన్న నేస్తం” పథకం లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనిఖీ (Social Audit ) నిర్వహించబడుతుంది. అలానే అర్హుల జాబితా నుండి తొలగించబడిన లబ్ధిదారుల గురించి విచారణలను కూడా నిర్వహిస్తారు.

వైయస్సార్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులకు ఈ పథకం గురించి మరొక్కసారి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అదేసమయంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని లబ్ధిదారులకు చెప్పడం జరుగుతుంది. ఇంకా మరుసటి రోజు వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించడం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించవలెను. మునిసిపల్ కమిషనర్ లు / ఎంపీడీవోలు లబ్ధిదారుల 2వ రోజు, 3వ రోజు హాజరును సేకరించి JC, VSWS లకు పంపించాలి.

ఆగస్టు 10వ తేదీన గౌరవ ముఖ్యమంత్రివర్యులైన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదికిగాను వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు.

▣▶ YSR Nethanna Nestham Scheme 3 Days Campaign Proceedings Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top