అగ్రిగోల్డ్ బాధితులకు రెండోవిడత చెల్లింపులు విధి విధానాలు::
అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత కింద రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు నగదును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇప్పటికే రూ.10 వేల లోపు సొమ్మును డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం ఆ మొత్తాలను మొదటి విడత కింద గత సంవత్సరమే చెల్లించింది. ఈ సంవత్సరం రెండో విడత కింద రూ. 10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ దారులను ఆదుకోవాలని నిర్ణయించింది.గౌ.శ్రీ. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాలలో ఆ మొత్తాలను అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వారి బ్యాంకు ఖాతాలకు ఈ నెల 24న జమ చేయనున్నారు.
- అగ్రిగోల్డ్ సంస్థ లో రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు కట్టిన డిపాజిట్ దారుల సంబంధిత చెక్కు
- పే ఆర్డర్
- రసీదులు
- బ్యాంకు పాస్ పుస్తకం
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
పైన పేర్కొన్న అన్ని డాకుమెంట్స్ వివరాలను మీ గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ వద్ద నమోదు చేయించుకోవాలి. ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీలోగా నమోదు చేయించుకోవాలి.
- కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.
- అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వారికి రావాల్సిన నగదును వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సమ్మతించరు.
- ఒక డిపాజిట్ దారు ఒక క్లెయిమ్ కే అర్హులు.
- చనిపోయిన డిపాజిట్ దారుల డిపాజిట్ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్ హైర్ సర్టిఫికెట్ కూడా సమర్పించారు.
- గతంలో పదివేల లోపు క్లెయిమ్ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు.
- గత సంవత్సరం లబ్ది పొందని వారు మాత్రమే ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకోవాలి.
- అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004253875 కు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
Post Views: 6