వైఎస్సార్ఆరోగ్యశ్రీ ఆసరా పథకము పూర్తి వివరాలు
- ఆపరేషన్ అయిన తర్వాత ఎవరైనా పనులకు పోలేక పస్తులు పడుకునే పరిస్థితులు రాకూడదని తోడుగా నిలిచేందుకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లో అంతర్భాగంగా ఆరోగ్య ఆసరా పథకమును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకము 2019 డిసెంబర్ 1 నుండి ఈ పథకము అమలుల్లోకి వచ్చింది.
- ఈ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకి రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేల రూపాయలను ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేస్తారు.
- రోగులకు ఈ తరహా చేయూతను అందించడం భారతదేశంలోనే ఇదే ప్రథమం.
- కుటుంబ పెద్ద జబ్బు బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు.
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదును జమ చేస్తారు.
- 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
- రోగి డిశ్చార్జ్ అయ్యే సమయంలో బ్యాంకు ఖాతా మరియు ఆధార్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల యొక్క బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు.
- శస్త్రచికిత్స అనంతరం రోగి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకం ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తుంది.
వైఎస్సార్ ఆసరా వివరాలు :
- మొత్తం స్పెషాలిటీ విభాగాలు – 26
- ఎన్నిరకాల శస్త్రచికిత్సలు – 836
- రోజుకు ఇచ్చే మొత్తం – 225
- నెల రోజుల విశ్రాంతి కి – 5000
- లబ్ధిదారుల సంఖ్య – 4.50 లక్షలు
- ఏటా వ్యయం దాదాపు – 300 కోట్ల రూపాయలు
Post Views: 33
AMONt pending mylavarapu nagamani elurupadu klla madalam Andhra Pradesh