అగ్రిగోల్ద్ సర్వే లో ఏమైనా తప్పులు వుంటే సరిచేసుకోవటానికి మరో అవకాశం
- రూ.20 వేల రూపాయల లోపు అగ్రిగోల్డ్ నందు డిపాజిట్ చేసిన క్లెయిమ్ దారులకు ముఖ్య సూచన
- ఆగస్టు 6వ తేదీ 2021 సంవత్సరం నుంచి మొదలైన రాష్ట్రవ్యాప్త అగ్రిగోల్డ్ డిపాజిట్ దార్ల సర్వే నందు, వాలంటీర్ల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్న రూ.20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు తమ వివరాలను సరిచేసుకోవడానికి AP CID ఒక అవకాశం కల్పిస్తోంది.
- ఆగస్టు 13వ తేదీ మరియు 14వ తేదీ మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
- www.agrigolddata.in అనే వెబ్ సైట్ నందు డిపాజిట్ దారులు తమ ఆధార్ కార్డు సంఖ్యను నమోదు చేసిన వెంటనే వారు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న రూ.20 వేల రూపాయల లోపు క్లెయిమ్ వివరాలు కనిపిస్తాయి. అందులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే డిపాజిట్ దారులు తమ సంబంధిత MPDO ఆఫీసు నందు సరిచేసుకొనవలెను. ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే అగ్రిగోల్డ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004253875 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు.
Post Views: 8