how-to-delete-sadarem-id-number

How to Delete Sadarem ID Number

సదరం ఐడి నంబర్ ని తొలగించేందుకు మార్గదర్శకాలు

1.  ఓల్డ్ సర్టిఫికెట్స్ ( 2017 ఆగస్టు కి ముందువి మ్యాన్యువల్ సర్టిఫికెట్స్) ఈ సర్టిఫికెట్స్ డిలీషన్ కి డైరెక్టుగా సదరన్ క్యాంపు జరిగే హాస్పిటల్ నుండి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చును. గ్రీవెన్స్ ఆప్షన్ సదరం సైట్ లో ఉంటుంది. సదరం డిపార్ట్మెంట్ ఐడి స్టేటస్ చెక్ చేసి ఓల్డ్ సర్టిఫికెట్ అయితే కనుక అప్రూవల్ ఇచ్చి డిలీట్ చేస్తుంది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

2. టెంపరరీ సర్టిఫికెట్స్ డాక్టర్ గారు దివ్యాంగుడిని తనిఖీ చేసిన తరువాత భవిష్యత్తులో అతనికి తగ్గుతుంది అని అనిపిస్తే టెంపరరీ సర్టిఫికెట్స్ ఇవ్వబడును. ఆ సర్టిఫికెట్స్ కాలపరిమితి ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు ఇవ్వబడును. సర్టిఫికెట్ తేది గడువు పూర్తి అయిన తర్వాత హాస్పిటల్ నుండి గ్రీవెన్స్ పెట్టవచ్చును. సదరం డిపార్ట్మెంట్ ఐడీ స్టేటస్ చెక్ చేసి తేది గడువు పూర్తి అయితే కనుక వెంటనే అప్రూవల్ వస్తుంది, వారు తిరిగి మరల స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

3. డైరెక్ట్ రిజెక్ట్ కేస్, అస్సెస్డ్ అండ్ రిజెక్ట్ కేస్ :

  • డాక్టర్ గారు దివ్యాంగుడిని తనిఖీ చేసిన తర్వాత తనకి ఉన్న వైకల్య శాతం ని నమోదు చేస్తారు. దాన్ని బట్టి ఆ సర్టిఫికెట్ పర్మినెంట్ లేక అసెస్మెంట్ తిరిగి రిజెక్ట్ అయిన కేసా అనేది తెలుస్తుంది.
  • 40% శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అవి పర్మినెంట్ సర్టిఫికెట్ పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతుంది.
  • వైకల్య శాతం 40% కంటే తక్కువ ఉంటే గనుక అట్టి సర్టిఫికెట్ రిజెక్ట్ అయిన కేస్ అని అర్థం చేసుకోవాలి. ఈ వైకల్య శాతం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇస్తున్నారన్నది గుర్తించుకోవాలి.
  • అలాగే వైకల్య శాతం అనేది 40% శాతం కంటే ఎక్కువ ఉండి ఆ సదరన్ ఐడి టెంపరరీ సర్టిఫికెట్ అయితే కనుక వారు పెన్షన్ కి ఎలిజిబుల్ కారు.

4. అసెస్మెంట్ జరిగి రిజెక్ట్ అయిన కేసులు ( 40% కంటే తక్కువ పర్సంటేజీ వచ్చినవాళ్లు ), టెంపరరీ సర్టిఫికెట్స్ వాళ్లు మరలా తనిఖీకి అవకాశం పొందాలంటే వారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో స్పందన కార్యక్రమాలు జరుగును. అక్కడ వాళ్లు అర్జీ ఇస్తే అక్కడ ఉన్న అధికారులు జిల్లాలోని ఏదో ఒక హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు. అర్జీ ఇచ్చిన దివ్యాంగుడు ఆ హాస్పిటల్ కి వెళ్లి సంబంధిత డాక్టర్ గారి దగ్గర ఒపి మీద తిరిగి తనిఖీ కి వెళ్ళాలి. డాక్టర్ గారు వారిని తనిఖీ చేసి వాళ్లు గనక ఎలిజిబుల్ అయితే గనుక ఆ ఒపి మీద ఇట్ ఈజ్ ఫిట్ రీ అసెస్మెంట్ లేదా ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీ అసెస్మెంట్ అని రాయాలి, లేదా వారు ఎలిజిబుల్ కారు మరలా తనిఖీ చేసిన డాక్టర్ గారికి అనిపిస్తే వెంటనే వారికి మీరు అర్హులు కారు సదరం రూల్స్ ప్రకారం అని చెప్పి వెనక్కి పంపవచ్చును.

  • ఎలిజిబుల్ అని డాక్టర్ గారు ఒపి మీద రాస్తే గనుక అట్టి డాక్టర్ గారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాయాలి. సదరు దివ్యాంగుడికి రీ అసెస్మెంట్ కి అవకాశం ఇవ్వమని…
  • పైన చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ ఉంటే కనుక అట్టి సదరం ఐడి కి రీ అసెస్మెంట్ కి అవకాశం ఇవ్వటం జరుగుతుంది.

ఏ సర్టిఫికెట్ కైనా రీ అసెస్మెంట్ ఇవ్వాలి అంటే సదరం మెయిల్ కి పంపాల్సిన డాక్యుమెంట్స్ :

1 స్పందన అర్జీ

2 డాక్టర్ OP

3 డాక్టర్ గారు కమిషనర్ గారికి రాసిన లెటర్

5. ఏ ఐడి అయినా గ్రీవెన్స్ సదరం సైట్లో రెండుసార్లు మాత్రమే పెట్టగలరు. రెండుసార్లు గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేస్తే గనుక ఆ ఐడి ని మూడవసారి గ్రీవెన్స్ పెట్టడం కుదరదు.మూడోసారి గ్రీవెన్స్ పెట్టడానికి ప్రయత్నించినా ఎర్రర్ 500 అనే మెసేజ్ చూపిస్తుంది.

6 thoughts on “How to Delete Sadarem ID Number”

  1. I am deaf I mnage with hearing id. I tried in 2019 for disability certificate. But I got certificate inofrming : it is found that you do not come under the category of person with disability.
    the doctor did not mention the persontage of the deafness in the certifcate after assessment.
    I have a doubt that the assessment is not correct.
    How can I confirm?
    I use hearing aids for both ears /unless I ware aid I cannot listen/hear what others say.
    Any one help me plz
    contact no 9154641888

  2. hi sir
    This is c Sudarshan i have Sadarem id but I am not able to download certificate ,when i am checking on that period no certificate issued , But now i am not able to apply new certificate its showing Assessment already done certificate generated SD ID
    :10149850100000120 (ADHAR: 430148187155) pllz i need to delete id and apply new certificate,
    Pllz help me.
    Thanking you,
    your’s faithfully,
    c Sudarshan
    7702617006

  3. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. మీ వెబ్సైటు ని ప్రతి రోజు చూస్తూ ఉంటాను . అందరికి ఉపయోగ పడే సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top