వై.యస్.ఆర్ రైతు భరోసా మరియు పి.ఎం.కిసాన్
సాగు సమయంలో రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి అధిక ఉత్పత్తి సాధించుటకై ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 13,500/- పెట్టుబడి సహాయం ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి సహాయం రూ.67,500/-.
అర్హతలు:
- వెబ్ లాండ్ డేటా ఆధారంగా భూమి పరిమాణం తో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ మరియు డి -పట్టా భూములను ( సంబంధిత రికార్డుల లో నమోదైన వాటిని ) సాగు చేయుచున్న రైతు కుటుంబాలు.
- పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేస్తున్న రైతులు ఎస్సీ, ఎస్టీ ,బిసి ,మైనారిటీ కి చెందిన సొంత భూమి లేని సాగుదారులు వ్యవసాయ ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం ఒక ఎకరం ,పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం 0.5 ఎకరం లేదా కనీసం 0.1 ఎకరం తమలపాకు సాగు చేయుచున్న చో అట్టి సాగుదారులు అర్హులు.
- ఒక భూమి యజమానికి ఒకరి కన్నా ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటే, అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్డ్ తెగకు చెందిన కౌలు రైతుకు ఇవ్వబడుతుంది. తరువాత ప్రాధాన్యత క్రమంలో షెడ్యూల్డ్ కులం, వెనుకబడిన మరియు మైనారిటీ తరగతికి చెందిన వారు ఉంటే వారికి ఇవ్వబడుతుంది.
- గిరిజన ప్రాంతాలలో, గిరిజన చట్టాలు ఆధారంగా గిరిజన సాగుదారులను మాత్రమే గుర్తించడం జరుగుతుంది.
- ఒకే ఊరిలో ఉన్న సన్నకారు రైతు మరియు భూమిలేని సాగుదారులు మధ్యగల కౌలు ఒప్పందం చెల్లదు.
- దేవాదాయ శాఖ నమోదు ల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్ధిని పొందడానికి అర్హులు.
- రైతు కుటుంబంలో పెళ్లి కానీ ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నా కూడా సంబంధిత రైతు మినహాయింపు వర్గంలో లేకపోతే వై.యస్.ఆర్ రైతు భరోసాకి అర్హుడు.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం:
- పట్టాదారు పాసు బుక్కు ఆధారంగా అర్హులైన భూమి గల రైతులను గుర్తించడం జరుగుతుంది.
- భూమి లేని సాగు దారులను పంట సాగు దారుల హక్కు పత్రం ఆధారంగా గుర్తించడం జరుగుతుంది.
- ఇతర వివరాలకు స్వయంగా రైతు భరోసా కేంద్రాలలో గాని గ్రామ మరియు వార్డు సచివాలయాలలో గాని సంప్రదించవలెను.
- అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request – మీసేవ అభ్యర్థన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
- సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1902 కు ఫోన్ చేయగలరు.
వై.యస్.ఆర్ రైతు భరోసా నగదును ఏవిధంగా చెక్ చేసుకోవాలి?
- Google సెర్చ్ బార్ లో YSR Rythubharosa అని టైపు చేసి సెర్చ్ చేయాలి
- సెర్చ్ రిజల్ట్స్ లో https://ysrrythubharosa.ap.gov.in/ అనే లింకు పై క్లిక్ చేయాలి.
- Government Official website ఓపెన్ అవుతుంది.
- మెనూ బార్ లో know your status అనే ట్యాబ్ పై క్లిక్ చేస్తే know your Rythubharosa Status అనే లింకు పై క్లిక్ చేయాలి.
- YSRRB(2021-22) Payment Status అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ Aadhaar Number దగ్గర మీరు చెక్ చేయాల్సిన రైతు యొక్క ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి,Submit బటన్ పై క్లిక్ చేయాలి.
- రైతుకు సంబంధించిన పేమెంట్ స్టేట్ మెంట్ ఓపెన్ అవుతుంది.
- రైతు పేరు,స్టేటస్ దగ్గర Payment Success అని వుంటే మీకు అమౌంట్ పడిందని అర్థం.అలాగే బ్యాంకు పేరు, అకౌంట్ నంబర్,అమౌంట్ చూపిస్తుంది.
- ఈ విధంగా రైతు భరోసా స్టేటస్ ను తెలుసుకోవచ్చును.
Post Views: 7