Jagananna Ammavodi Scheme in Telugu

Jagananna Ammavodi Scheme in Telugu

జగనన్న అమ్మ ఒడి పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించిన “జగనన్న అమ్మ ఒడి” పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ జీవో నెంబర్ 79 ను విడుదల చేశారు.

 ప్రభుత్వ,  ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్ళు, కాలేజీల్లో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్ ) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం  నుంచే ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి ఏడాదికి రూ.15,000/- అందించనున్నారు. తల్లి లేకుంటే ఆ పిల్లల అధికారిక సంరక్షకునికి ఈ మొత్తాన్ని ఇస్తారు.

AP EAPCET 2026 Counseling dates, web options process, and document verification complete details
AP EAPCET 2026 Counseling Complete Details

 రెసిడెన్షియల్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు సైతం ఈ సహాయం అందనుంది. పాఠశాలల్లో చేరికల, హాజరు పెంపు, సమాన విద్యావకాశాలు కల్పన, ఉత్తమ బోధనా ప్రమాణాల సాధన లక్ష్యంగా “జగనన్న అమ్మ ఒడి పథకాన్ని” ప్రభుత్వం అమలు చేయనుంది. తద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే బలమైన విద్యాపునాదులు ఏర్పడుతాయని ప్రభుత్వం అభిలషిస్తోంది.

జగనన్న అమ్మ ఒడి పథకం అర్హతలు:

thalliki-vandanam-2026-2
Thalliki Vandanam Latest Release Date-2026
  1. కుటుంబంలోని పిల్లల సంఖ్య తో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.
  2. ఆ కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
  3. లబ్ధిదారుడు/తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి.
  4. ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న ఆ కుటుంబంలోని పిల్లలకూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  5. రేషన్ కార్డు లోని సమాచారాన్ని ఆరు దశల్లో పరిశీలించి ధృవీకరిస్తారు.
  6. స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో పాఠశాలలో ప్రవేశం పొందిన అనాధలు/వీధి పిల్లలకు ఈ ప్రయోజనాన్ని సంబంధిత శాఖల తో సంప్రదించి అమలు చేస్తారు. విద్యార్థులు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
  7. పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యాసంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి.
  8. సమన్వయంతో కూడిన వ్యవస్థ ద్వారా విద్యార్థులు, లబ్ధిదారులను గుర్తిస్తారు.
  9. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు,

చెల్లింపు విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది :

  1. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు జాతీయ బ్యాంకులో లేదా పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి.
  2.  అర్హులైన వారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ.15,000/- వేల రూపాయలు జమ అవుతుంది.
  3. ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తారు. దీన్ని కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ కు లింకు చేస్తారు.
  4. ఆయా విద్యా సంస్థలు అందించే విద్యార్థుల డేటాను చైల్డ్ ఇన్ఫో , యూ-డైస్,  సివిల్ సప్లై డేటా లతో సరి పోల్చుతారు.
  5.  ఆ డేటాను సంస్థ తరపు ఉండే తనిఖీ అధికారి ధృవీకరించాలి.
  6. అనంతరం డీఈవో, జిల్లా వృత్తి విద్యాధికారి, ప్రాంతీయ విద్యాధికారుల పరిశీలన అనంతరమే లబ్దిదారుల ఖాతాలోకి నగదును జమ చేస్తారు.
  7. గ్రామ వాలంటీర్ స్కూల్ డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలి.తన పరిధిలోని తల్లి లేదా సంరక్షకుడిని వాలంటీర్ గుర్తించాలి. నిర్ణీత ప్రొఫార్మా లో వారి వివరాలు సేకరించి, ఎంఈఓ లకు  సమర్పించాలి.
  8. డిఈఓ , ప్రాంతీయ విద్యాధికారి, వృత్తి విద్యాధికారి, జిల్లా కలెక్టర్లకు సంబంధిత లబ్ధిదారుల డేటాను సమర్పించాలి.
  9. పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులు,లబ్ధిదారులే బాద్యులు.
  10. డేటా విశ్లేషణ, ఇతర కార్యకలాపాలకు ఐటి, సివిల్ సప్లైస్, రియల్ టైం గవర్నెన్స్ విభాగాలు సాంకేతిక సహకారంతో పని చేయాలి.
  11. లబ్ధిదారుల జాబితాలను గ్రామ మరియు వార్డు సచివాలయాలలో సోషల్ ఆడిట్ కు  వీలుగా ప్రదర్శించాలి.

1 thought on “Jagananna Ammavodi Scheme in Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top