rice card ekyc

Rice Card E-KYC Faqs

రైస్ కార్డు – EKYC చేసేటప్పుడు సందేహాలు-సమాధానాలు

ఎవరైనా వృద్ధులు లేదా రోజువారీ కూలీ పనులు చేసుకొను వారి వేలి ముద్రలు సరిగా నమోదు కాని వారికి ఏవిధంగా eKYC చేయించాలి?

చౌకధరల దుకాణం నందు గల e-PoS మెషిన్ నందు FUSION FINGER ఆప్షన్ ద్వారా eKYC చేయించాలి.

జాబితాలో eKYC పెండింగ్ అని ఉన్నాయి కానీ AePDS-AP యాప్ లో eKYC status “Y” అని ఉంది, అలాంటి వారికి ఇప్పుడు మళ్లీ eKYC చేయించాలా? వద్దా?

ఖచ్చితంగా ఇప్పుడు మళ్లీ AePDS-AP యాప్ లో eKYC చేయించాలి.

రైస్ కార్డు లో చనిపోయిన వారి eKYC ఎలా చేయాలి?

AePDS-AP యాప్ ద్వారా “Death Decoration” చెయ్యాలి. వాటిని సంబంధిత VRO epds login లో Death Confirmation చెయ్యాలి.

ప్రస్తుతం వేరే ఊరిలో ఉన్న వారికి eKYC ఎలా చెయ్యాలి ?

ప్రస్తుతం మన ఊరికి రాలేని పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అక్కడ Volunteer దగ్గర కూడా eKYC చేయించుకొనవచ్చును.

రైస్ కార్డు eKYC చేయడానికి చివరి తేదీ ఎప్పుడు ?

చివరి తేదీ ఆగష్టు 20 .

గతంలో చైల్డ్ డిక్లరేషన్, మైగ్రాంట్ డిక్లరేషన్ చేసిన వారికి స్టేటస్ YES ఉన్నా వారికి మరలా చెయ్యాలా ?

చైల్డ్ డిక్లరేషన్, మైగ్రాంట్ డిక్లరేషన్ చేసినవి తాత్కాలికంగా సక్సెస్ అయినా వారికి మరలా eKYC చెయ్యాలి.

5 సంవత్సరములు దాటిన పిల్లలకు ఏవిధంగా eKYC చేయించాలి.?

అలాంటి వారిని మొదట ఆధార్ సెంటర్ కి వెళ్లి వారి వేలిముద్రలను అప్ డేట్ చేసుకోవలెను. అప్ డేట్ అయిన తరువాత వీరికి eKYC చేయించవలెను.

5 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు eKYC ఏవిధంగా చేయించాలి?

ప్రస్తుతానికి వీరికి ఆప్షన్ ఇవ్వలేదు.

5 సంవత్సరములు దాటిన పిల్లలకు ఏవిధంగా eKYC చేయించటానికి చివరి తేది?

సెప్టెంబర్ నెల చివరి వరకు వీరికి అవకాశం వుంది.

రైస్ కార్డులో సభ్యుల ఆధార్ నంబర్ తప్పుగా వుంటే, వాటిని ఏవిధంగా సరిచేయాలి?

అలాంటి వారివి సరిచేయడానికి గ్రామ/వార్డు సచివాలయము వారికి ఆప్షన్ ఇచ్చారు.

eKYC స్టేటస్ “Y” అని వచ్చిన వాళ్లకి మరలా చేశాక అది విజయవంతం అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ?

VRO వారి AePDS సైట్ లో Reports సెక్షన్ లో చూసుకోవచ్చు. eKYC చేసిన గంట తరువాత అప్డేట్ అవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top