agrigold-survey-volunteers-app

Agrigold Depositors Survey Faqs


Warning: Trying to access array offset on value of type bool in /home/u833945783/domains/gramavolunteers.com/public_html/wp-content/plugins/sitespeaker-widget/sitespeaker.php on line 13

వాలంటీర్ల అగ్రిగోల్డ్ సర్వే ప్రశ్నలు - సమాధానాలు:

ఫిజికల్ గా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి?

● ఒరిజినల్ రిసిప్ట్ లేదా చెక్ లేదా పే ఆర్డర్ స్లిప్. ● ఆధార్ జిరాక్స్. ● బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్. (ప్రతి డాక్యుమెంట్ మీద ఆధార్ నెంబర్ రాయాలి)

బాండ్ మాత్రమే ఉన్నాయి తీసుకోవచ్చా?

బాండ్ తీసుకోకూడదు, అందులో మనకు కావాల్సిన వివరాలు ఉండవు.

ఒక వ్యక్తి రెండు లేదా మూడు కట్టి ఉంటే ఎలా?

టోటల్ బ్యాలెన్స్ వద్ద 20,000 లోపల ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి.

ఓకే ఇంటిలో ఇద్దరు లేదా ముగ్గురు లబ్దిదారులు ఉంటే ఎలా?

ప్రతి వ్యక్తి కూడా అర్హుడే.

బాండ్ నందు, ఆధార్ నందు, బ్యాంక్ పాస్ బుక్ నందు పేరు ఒకరే అయి ఉండాలా?

[అవును,] ఖచ్చితంగా ఓకే వ్యక్తి అయి ఉండాలి. పేరులో చిన్న చిన్న మార్పులు ఉన్నా పర్లేదు.

పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లైతే ఎవరికి ఆ అమౌంట్ చెందుతుంది, నామినీ డీటైల్స్ పొందుపరచాలా?

అలాంటివి స్వీకరించవద్దు, సరైన ఉత్తర్వులు వచ్చే వరకు పెండింగ్ పెట్టండి.

10,000 లోపల వాటిని తీసుకోవచ్చా?

మొదటి సారి రూ.10,000 లోపు వారికి అమౌంట్ ఇచ్చినప్పుడు ఏవైనా కారణాల వల్ల తీసుకోనట్లయితే వారు కూడా అర్హులే.

రెండు లేదా ఎక్కువ స్కీమ్స్ ఉన్న వారు మాకు తెలియకుండా వాలంటీర్ల వద్ద ఎంట్రీ పెట్టుకుంటే ఎలా?

వెరిఫికేషన్ లో వాటిని తొలగించాలా వద్దా అన్నది పై అధికారులు నిర్ణయిస్తారు.

కొందరి వద్ద రిసిప్ట్స్ లేవు బాండ్స్ మాత్రమే ఉంటే ఎలా?

అలాంటివి స్వీకరించవద్దు, సరైన ఉత్తర్వులు వచ్చే వరకు పెండింగ్ పెట్టండి.

ఇంతకు ముందు వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు తమ పరిధిలో ఉన్నట్లైతే వారికి మేము అప్లై చేయవచ్చా?

[అప్లై చేయవచ్చు.] ఇక్కడ పరిధిని నిర్ణయించలేదు, కేవలం ప్రజల సౌలభ్యం కోసం వాలంటీర్ల సేవలను ఉపయోగించడం జరుగుతోంది.

వాలంటీర్స్ మీలో ఎవరికైన అగ్రిగోల్డ్ డేటా వేరఫికేషన్ యాప్ లాగిన్ సమస్య ఉంటే...,(𝙸𝚗𝚟𝚊𝚕𝚒𝚍 𝚖𝚘𝚋𝚒𝚕𝚎 𝚗𝚘 అని వస్తే...)?

94906 17772 అనే వాట్స్ అప్ నంబర్ కు ఈ కింది డీటెయిల్స్ పంపించాలి 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫 𝐈𝐃: 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐧𝐮𝐦𝐛𝐞𝐫 : 𝐂𝐅𝐌𝐒 𝐈𝐃: 𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐥𝐚𝐲𝐚𝐦 𝐍𝐚𝐦𝐞 : 𝐏𝐡𝐨𝐧𝐞 𝐍𝐨 : 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐬𝐭 : ఈ డీటెయిల్స్ పంపితే వారు ఆ వాట్సాప్ మెసేజ్ చూసిన 2 నిమిషాలలో మీకు అగ్రిగోల్డ్ యాప్ ఓపెన్ అవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top