ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం కలిసి పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలను దృష్టిలో ఉంచుకొని తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా వచ్చేసి పేద మరియు మధ్యతరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం 13 వేల రూపాయలు నేరుగా వారి తల్లి లేదా సంరక్షకుని యొక్క ఖాతాలోకి అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ అమౌంట్ను విడుదల చేయనున్నారు.
తల్లికి వందనం డబ్బులకి ఎవరు అర్హులు?
ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చేసి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చేసి 13వేల రూపాయలు ప్రతి సంవత్సరం అయితే నేరుగా వారి తల్లి ఖాతాలకైతే జమ కావడం జరుగుతుంది.
- అలాగే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వచ్చేసి ఈ అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది.
- అలాగే స్కూల్ కు వెళ్లేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క హాజరు శాతం అనేది 75 శాతానికి అయితే తగ్గకుండా ఉండాలి.
- అలాగే ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే కాకుండా గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకు కూడా వర్తిస్తుంది.
- అలాగే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది విద్యా శాఖకు సంబంధించి పారదర్శకంగా లిస్ట్ అయితే విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
తల్లికి వందనం డబ్బులు పడాలంటే తప్పకుండా చేయవలసినటువంటి మూడు పనులు:-
Thalliki Vandanam Aadhaar E-KYC
తల్లికి వందనం డబ్బులు పడాలంటే ప్రతి ఒక్కరు వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని సందర్శించి అక్కడ తల్లికి వందనం సంబంధించినటువంటి e-KYC ఏమి కంప్లీట్ చేయండి.
తల్లికి వందనం NPCI LINK
తల్లికి వందనం డబ్బులు పడాలంటే NPCI (National Payments Corporation of India) తప్పకుండా కంప్లీట్ చేసి ఉండాలి. దీని ద్వారా వచ్చేసి ఆధార్ కార్డుకి మరియు బ్యాంక్ అకౌంట్ కి సీడింగ్ అయితే జరగడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చేసి DBT పద్ధతిలో నేరుగా వచ్చేసి తల్లి యొక్క ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది.
📌 NPCI నేను కింద ఇచ్చినటువంటి లింకును ఓపెన్ చేసి నేను చెప్పేటటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి మీరు కంప్లీట్ చేయవచ్చు.
NPCI LINK : Click Here
- Step 1: UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
ముందుగా UIDAI అధికారిక పోర్టల్లోకి వెళ్లి “Check Aadhaar/Bank Seeding Status” సేవను ఎంచుకోండి. - Step 2: ఆధార్ నంబర్ నమోదు చేయండి
మీ 12 అంకెల ఆధార్ నంబర్ను జాగ్రత్తగా నమోదు చేసి, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. - Step 3: OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయండి
మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన One Time Password (OTP) ను నమోదు చేసి Verify చేయండి. - Step 4: NPCI లింకింగ్ వివరాలను పరిశీలించండి
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీ ఆధార్‌కు ప్రస్తుతం ఏ బ్యాంక్ ఖాతా NPCI Mapperలో లింక్ అయి ఉందో స్క్రీన్‌పై చూపిస్తుంది. - Step 5: లింకింగ్ లేకపోతే ఏమి చేయాలి?
మీ బ్యాంక్ ఖాతా NPCI Mapperలో కనిపించకపోతే లేదా వేరే బ్యాంక్ చూపిస్తే, మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి Aadhaar Seeding / NPCI Mapping పూర్తి చేయించుకోవాలి. లింకింగ్ పూర్తైన తర్వాత మళ్లీ స్టేటస్‌ను చెక్ చేయండి.
గమనిక: ప్రభుత్వ పథకాల నగదు ప్రయోజనాలు (DBT) అందుకోవాలంటే, NPCI Mapperలో Active బ్యాంక్ ఖాతా ఉండటం తప్పనిసరి. మీ ఆధార్‌కు ఒకేసారి ఒకే బ్యాంక్ ఖాతా మాత్రమే NPCI Mapperలో యాక్టివ్‌గా ఉంటుంది.
తల్లికి వందనం House Hold Mapping:
తల్లికి వందనం డబ్బులు పడాలంటే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని వారి హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని సంప్రదించి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కంపల్సరిగా చేపించండి.
ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ పిల్లలు లేకపోతే మీరు ఈ తల్లికి వందనం స్కీం కి వచ్చేసి ఇన్ ఎలిజిబుల్ అవుతారు.
తల్లికి వందనం లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
Method 1: Online ద్వారా చెక్ చేసుకునే విధానం:
- Step 1
ముందుగా AP Grama Ward Sachivalayam (GSWS) Application Status Portal లేదా Navakam Portal ను ఓపెన్ చేయండి. - Step 2
హోమ్ పేజీలో “Thalliki Vandanam Eligibility Status Check” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. - Step 3
అక్కడ కనిపించే బాక్స్‌లో తల్లి Aadhaar Number ను నమోదు చేయండి. - Step 4
తర్వాత “Get OTP” లేదా “Send OTP” బటన్‌పై క్లిక్ చేయండి. - Step 5
ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను నమోదు చేసి “Verify OTP” పై క్లిక్ చేయండి. - Step 6
వెరిఫికేషన్ పూర్తైన వెంటనే మీ Eligibility Status, Sanction Status, Payment Status మరియు ఇతర వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Method 2: WhatsApp ద్వారా చెక్ చేసుకునే విధానం:
- Step 1
మీ మొబైల్‌లో +91 95523 00009 నంబర్‌ను “AP Government WhatsApp” పేరుతో సేవ్ చేయండి. - Step 2
ఆ నంబర్‌కు WhatsAppలో “Hi” అని మెసేజ్ పంపండి. - Step 3
తర్వాత కనిపించే సేవల జాబితాలో “తల్లికి వందనం” లేదా సంబంధిత సేవను ఎంచుకోండి. - Step 4
అవసరమైన చోట Aadhaar Number లేదా అడిగిన వివరాలను నమోదు చేయండి. - Step 5
వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ Eligibility, Sanction మరియు Payment Status వివరాలు WhatsAppలోనే చూపించబడతాయి.
గమనిక:
- Aadhaar కు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.
- OTP నమోదు చేసిన తర్వాత మాత్రమే స్టేటస్‌ను చూడగలుగుతారు.
- వివరాలు కనిపించకపోతే కొంత సమయం తర్వాత మళ్లీ చెక్ చేయండి లేదా సమీప Grama/Ward Sachivalayam ను సంప్రదించండి.
తల్లికి వందనం కి సంబంధించి ఇతర ప్రశ్నలు:
1) తల్లికి వందనం డబ్బులు ఒకరికేనా లేక ఎంతమందికి పడుతుంది?
జవాబు : తల్లికి వందనం డబ్బులు అనేది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మరియు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడుతుంది.
2) పదవ తరగతి అయిపోయిన విద్యార్థులకు పడుతుందా లేదా?
జవాబు : తల్లికి వందనం డబ్బులు వచ్చేసి పదవ తరగతి అయిపోయి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం చదువుకునేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వర్తిస్తుంది. నేరుగా ఈ డబ్బులు వారి తల్లి లేదా సంరక్షణ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది.
3) తల్లికి వందనం డబ్బులు తల్లి లేని పిల్లలకు పడుతుందా లేదా?
జవాబు : ఈ తల్లికి వందనం డబ్బులు అనేది ఒకవేళ తల్లి లేనటువంటి విద్యార్థులకు వచ్చేసి వారి తండ్రి లేదా యొక్క సంరక్షకులు యొక్క బ్యాంకు ఖాతాలోకి అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది.

