ఆపరేషన్ అయిన తర్వాత ఎవరైనా పనులకు పోలేక పస్తులు పడుకునే పరిస్థితులు రాకూడదని తోడుగా నిలిచేందుకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లో అంతర్భాగంగా ఆరోగ్య ఆసరా పథకమును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకము 2019 డిసెంబర్ 1 నుండి ఈ పథకము అమలుల్లోకి వచ్చింది.
ఈ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకి రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేల రూపాయలను ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేస్తారు.
రోగులకు ఈ తరహా చేయూతను అందించడం భారతదేశంలోనే ఇదే ప్రథమం.
కుటుంబ పెద్ద జబ్బు బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదును జమ చేస్తారు.
26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
రోగి డిశ్చార్జ్ అయ్యే సమయంలో బ్యాంకు ఖాతా మరియు ఆధార్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల యొక్క బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు.
శస్త్రచికిత్స అనంతరం రోగి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకం ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తుంది.
AMONt pending mylavarapu nagamani elurupadu klla madalam Andhra Pradesh