YSR Cheyutha Scheme in Telugu

వైఎస్సార్ చేయూత పథకము (రెండవ విడత)

ఉద్దేశ్యము :
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన  ఎస్.సి, ఎస్.టి, బి.సి., మరియు మైనారిటీ మహిళల కుటుంబాల పేదరికం, ఆర్ధిక వెనుకబాటు తనాన్ని రూపు మాపి వారి యొక్క కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోనుటకు చేయుతనిస్తూ, వారికి  సుస్థిరమైన జీవనోపాధులను ఏర్పాటుతో పాటు, మార్కెటింగ్ సదుపాయాలు సమకూర్చటమే ఈ పధకము యొక్క ముఖ్య ఉద్దేశము. 

లక్ష్యము:
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని సుమారు 25 లక్షల వెనుకబడిన బడుగు బలహీన వర్గాల మరియు మైనారిటి మహిళల ఆర్థికాభివృద్దితోపాటు, సుస్థిర జీవనోపాధి మరియు మహిళా సాధికారత సాధించడమే రాష్ట్ర ప్రభుత్వము యొక్క లక్ష్యం.

వై.యస్.ఆర్ చేయూత పధకము అర్హతలు :

వై.యస్.ఆర్ చేయూత పధకము-లబ్దిదారుల ఎంపిక విధానము:

1) గ్రామ/వార్డ్ వాలంటీర్ ద్వారా అర్హత కలిగిన మహిళను యాప్ ద్వారా సమాచార సేకరణ చేయడము జరిగింది.

2) గ్రామ/వార్డ్ వాలంటీర్ ద్వారా సేకరించన సమాచారమును గ్రామ/వార్డ్ సంక్షేమ సెక్రటరీ మరొక సారి పరిశీలించడము జరుగుతుంది.

3) గ్రామ/వార్డ్ సంక్షేమ సెక్రటరీ సేకరించిన సమాచారమును బట్టి సామాజిక తనిఖీ కొరకు ప్రతి గ్రామ/వార్డ్  సచివాలయములో ప్రదర్శించడము జరిగింది.

4) గ్రామ/వార్డ్ సంక్షేమ సెక్రటరీ ద్వారా తాత్కాలిక అర్హత కలిగిన లబ్దిదారుల సమాచారమును మండల అభివృద్ధి  అధికారికి మరియు మునిసిపల్ కమీషనర్ వారికి ఆన్లైన్ లో పంపడము జరిగింది .

5) మండల అభివృద్ధి అధికారికి మరియు మునిసిపల్ కమీషనర్ సామాజిక తనిఖీ లో వచ్చిన పిర్యాదులను  మరొకసారి పరిశీలించి తన లాగిన్ నందు అప్డేట్ చేసి తుది లబ్దిదారుల జాబితాను తయారు చేయడము జరిగింది.

6) మండల అభివృద్ధి అధికారికి మరియు మునిసిపల్ కమీషనర్ తుది వై.యస్.ఆర్ చేయూత లబ్దిదారుల  జాబితాను సంబందిత E.D కార్పోరేషన్ (SC,ST,BC మరియు మైనారిటీ) వారికి సమర్పించడము జరిగింది.

వై.యస్.ఆర్ చేయూత పధకము-లబ్దిదారుల ఎంపిక విధానము:

1) E.D, SC,ST,BC మరియు మైనారిటీ కార్పోరేషన్ వారు తుది వై.యస్.ఆర్ చేయూత  లబ్దిదారుల జాబితాను సంబందిత జిల్లా కలెక్టర్ వారికి పంపించి వారి ఆమోదము పొందడము జరుగుతుంది.

2) జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఆమోదము పొందిన లబ్దిదారుల జాబితాను CEO SERP  కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా పొందడము జరుగుతుంది.

3) CEO-SERP వారు కార్పోరేషన్ వారిగా తుది లబ్దిదారుల జాబితా ప్రకారము నిధులను ప్రభుత్వము నుండి సమకూర్చుకొని CFMS కు లబ్దిదారుల జాబితాను పంపడము  జరుగుతుంది.

4) గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y.S జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా  తేది.12.08.2020 న అక్క,చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్ కు  నిధులను జమ చేయడము జరుగుతుంది.

వై.యస్.ఆర్ చేయూత పధకము-లబ్దిదారుల ఎంపిక విధానము:

ap grama ward volunteer awards 2023 dates
AP Grama Ward Volunteer Awards – 2023

1) ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన దాదాపు 23 లక్షల మంది మహిళలకు 4 ఏళ్లలో రూ.17250 కోట్ల లబ్ది చేకూరనుంది. మహిళలు జీవనోపాధి పొందే మార్గాలపై ఈ సహాయాన్ని వినియోగించుకుంటే వారి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా ప్రభుత్వం చేయుతనిస్తుంది .

2) ప్రభుత్వం అందిస్తున్న సహాయం ద్వారా మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా మహిళల ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటునందిస్తుంది.

3) వ్యవసాయం, పశు పోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు, తదితర రంగాలల్లో ఉన్న మహిళలకు  బలమైన తోడ్పాటు అందించడం తో పాటు వారి జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.

4) ఈ దిశగా మహిళలకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలు  అందించేలా ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్ యు ఎల్, పి&జీ మరియు రిలయన్స్ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ  కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా   ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంపనీలతోనే కాకుండా భవిష్యత్తులో  మరికొన్ని ప్రపంచ ప్రఖ్యాత కలిగిన భహుళ కంపనీలతో మహిళల వ్యాపార సామర్ధ్యాన్ని పెంచుటకు ఒప్పందాలు చేసుకోవడము జరుగుతుంది.

5) ఈ కంపెనీల ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించేలా జీవనోపాధి  కలగడంతో పాటు గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో కార్యకలాపాలు పుంజుకొని అదనంగా దాదాపు 2.25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.

6) ఇందులోభాగంగా రిటైల్‌ రంగంలో దుకాణాలు నడుపుకుంటున్న  వై.యస్.ఆర్.చేయూత పథకం లబ్ధిదారులైన మహిళలను గుర్తించి .హెచ్‌యూల్,  ఐటీసీ, పీ అండ్‌ జీ కంపెనీల సేవలు కలిగిన ప్రాంతాలలో  ఉన్న వ్యాపారము చేసే  మహిళలను  గుర్తించి అనుసంధానము చేయడము జరుగుతుంది.

బహుళ జాతి కంపినీల సహకారము (హెచ్‌యూల్, ఐటీసీ, పీ అండ్‌ జీ) :

1) ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, స్టాకింగ్‌ మేనేజ్‌మెంట్‌లో వారికి శిక్షణ ఇస్తారు.

2) భాగస్వాములైన కంపెనీలు ఏం చేస్తాయంటే…

3) మహిళకు చేయూతనిచ్చే కార్యక్రమాల్లో ఎంఓయూలు (MOU) కుదుర్చుకున్న కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తాయి.

4) లబ్ధిదారులైన మహిళలు ఉన్న ప్రాంతాల్లో తమ సేవల కలిగిన ప్రాంతాలను గుర్తిస్తాయి. 

5) ఉత్పత్తుల కొనుగోలులో వారికి తోడ్పాటు అందిస్తాయి.

6) కిరణా వ్యాపారం చేసే వారికి శిక్షణ ఇస్తాయి. వారిలో వ్యాపార సామర్థ్యాన్ని  పెంచుతాయి.

7) గుర్తించిన క్లస్టర్లలో కార్పొరేట్‌ కార్యక్రమాలతో సుస్థిర ఆదాయాలకు ప్రణాళికను అమలు చేస్తాయి

మహిళా లబ్దిదారులను గుర్తించుట లో తీసుకోవలసిన జాగ్రత్తలు :

mission-vatsalya-scheme
Mission Vatsalya Scheme Details in Telugu

1) “వై.యెస్.ఆర్. చేయూత” లబ్దిని ఉపయోగించుకుని యూనిట్ పెట్టటానికి ఆసక్తి కలిగి ఉండాలి.

2) పైన తెలిపిన కంపెనీలతో అనుసంధానం చేసుకుని వారి ఆధ్వర్యములో ఉత్పత్తులను తయారు చేయటం లేదా   మార్కెటింగ్ చేసుకోవటానికి ఒప్పందము చేసుకోవలసి ఉంటుంది.

3) పాడి పరిశ్రమ – పాల ఉత్పత్తి యూనిట్లు పెట్టటానికి ఆసక్తి ఉన్నవారు.

4) గృహ మరియు ఆరోగ్యమునకు (జనరల్ స్టోర్, కిరాణా మరియు ఆహార) సంబంధమైన ఉత్పత్తులు తయారీ యూనిట్లు పెట్టటానికి ఆసక్తి ఉన్నవారు.

5) కూరగాయలు, పూలు  మరియు పండ్ల తోటలు పెంపకము నకు అవకాశము మరియు ఆసక్తి వున్నవారు.

6) వ్యవసాయం మరియు అనుబంధ కార్యక్రమాలు.

7) వస్త్ర,  చేనేత మరియు చేతి వృత్తులకు సంబంధించిన ఉత్పత్తులు

8) అగరుబత్తీలు తయారీ

9) కోళ్ళ పెంపకము మొదలైనవి.

లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ప్రస్తుతము ఉన్నది అయితే దానిని అభివృద్ధి చేసుకోవటానికి లేదా నూతనముగా ఏర్పాటు చేసుకోవటానికి కాని రూ.75,000/- లు మంజూరు చేయబడతాయి. దానిలో ఒక వంతు రూ.18,750/-లు లబ్దిదారుని వాటా కాగా (వై.యెస్.ఆర్. చేయూత పథకము ద్వారా వచ్చిన మొదటి విడత మొత్తము) మిగిలిన 3 వంతులు రూ. 56,250/- లను  బ్యాంకు నుండి ఋణము మంజూరు చేయబడుతుంది. ఆ ఋణమును సభ్యులు వారి ఆదాయమును బట్టి నెలవారీ వాయిదాలు నిర్ణయించుకుని అసలు మరియు వడ్డీతో సహా బ్యాంకునకు చెల్లించవలసి ఉంటుంది.

దరఖాస్తు చేయటానికి కావలసిన డాకుమెంట్స్::

  1. Rationcard
  2. Aadhar Card
  3. Bank Account Passbook Xerox
  4. Caste Certificate
  5. Income Certificate
  6. Aadhar Update History

Note : ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ ను లింక్ చేయించుకోవలెను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top