ఎం.ఎస్.ఎం.ఈ లకు వై.యస్.ఆర్ నవోదయం పథకము::
ఉద్దేశం:-
- ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎం.ఎస్.ఎం.ఈ లకు) పరిశ్రమలను ఆదుకోవడం. రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలను కల్పించడం.
- కరోనా వలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న దాదాపు 10 లక్షల మందికి ఊరటను కలిగించడం.
- ఇచ్చిన మాట మేరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ( 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అదనపు ప్రోత్సాహకాలతో కలిపి) రాయితీలను చెల్లించడం.
- ఎంతో కాలంగా ఉన్న గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించి పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడం.
ప్రయోజనాలు:-
- కరోనా విపత్తు వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు జగనన్న ప్రభుత్వం రూ.1,110 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించింది.
- 2014 – 15 నుండి దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.828 కోట్లు.
- ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షకు పైగా యూనిట్లకు చెందిన రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి.
- గత ప్రభుత్వ బకాయిలతో పాటు 2019 – 20 సంవత్సరం యొక్క రాయితీలు కలిపి మొత్తం రూ.905 కోట్లను రెండు విడతలుగా జగనన్న ప్రభుత్వం చెల్లించింది.
రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా సహాయం అందించే విధానం:-
- రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు కరెంటు ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలు గా ఉన్న మొత్తం రూ.188 కోట్లను జగనన్న ప్రభుత్వం మాఫీ చేసింది. తద్వారా 97,428 పరిశ్రమలకు లబ్ధి చేకూరింది.
- తక్కువ వడ్డీ పై వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గరిష్టంగా రూ.10 లక్షల వరక 6 నుండి 8 శాతంతో రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు.
- ప్రభుత్వానికి అవసరమైన 25% వస్తు, సామాగ్రిని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో 4 శాతం ఎస్సీ ఎస్టీలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుండి సేకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- శ్రీ.గౌ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల నుండి కొనుగోలు చేసిన వస్తు సామాగ్రికి ఖచ్చితంగా 45 రోజులలో బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు.
- ప్రోత్సాహక బకాయిల విడుదలతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.280 కోట్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.496 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది.
▶ YSR Navodayam Scheme Apply Online Click here
▶ YSR Navodayam Scheme GO Copy Download