ysr-sunna-vaddi-crop-loans

YSR Sunna Vaddi Crop Loan Scheme in Telugu

వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు::

ముఖ్య ఉద్దేశం:-

  • రైతులు తీసుకున్న పంట రుణాల పై పూర్తి వడ్డీ మాఫీ చేయడం.
  • పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ, ఆర్థిక వెసులుబాటు కల్పించడం.
  • అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఎక్కువ మంది రైతులకు సంస్థాగత రుణాలను అందించడం.

ప్రయోజనాలు:-

  • లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులందరికీ పూర్తి వడ్డీ రాయితీ.
  • ప్రతి ఏటా పంట సీజన్ ముగిసే సమయానికి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు జమ.
  • రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే చాలు, వడ్డీ చెల్లింపు బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.
  • ఈ- క్రాప్ ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడం.
  • నిర్ణీత వ్యవధిలోగా రుణాలు చెల్లించేలా ప్రోత్సహించడం.
  • గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన సున్నా వడ్డీ బకాయిలు అన్నింటినీ జగనన్న ప్రభుత్వమే చెల్లించింది. అర్హతలు
  • రుణం తీసుకుని ఏడాదిలోగా వడ్డీతో సహా మొత్తం చెల్లించిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హతా ప్రమాణాలు ఉంటాయి.
  • రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పొందే సౌకర్యం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలకు వడ్డీ సొమ్మును జమ చేస్తుంది.

వడ్డీ చెల్లింపు విధానం:-

  • పంట రుణాల పై సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ చెల్లిస్తుంది.
  • అసలు, వడ్డీ ని రైతు చెల్లించి నట్టు జాబితాలు తయారు చేసి ఆయా బ్యాంకులు లేదా నోడల్ బ్యాంకు శాఖలు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయానికి పంపుతాయి.
  • వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ కమిషనర్ వడ్డీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా http://ysrsvpr.gov.in వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది.

ఇతర ప్రయోజనాలు:-

  • ఈ – క్రాప్ ద్వారా వాస్తవంగా ఏ రైతు ఎంత విస్తీర్ణం వరకు పంట సాగు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది. రైతులకు మరియు వాస్తవ సాగు దారులకు పంట రుణాల పై సున్నా వడ్డీ పథకం ద్వారా ఏ సీజన్ కి ఆ సీజన్ లోనే  సజావుగా ఆర్థిక లబ్ధి చేకూరుతున్నది.
  • నేరుగా రైతుల పొదుపు ఖాతాలకు వడ్డీ రాయితీ సొమ్మును సకాలంలో బదిలీ చేయడం ద్వారా జవాబుదారీతనం పెరిగింది.
  • లబ్ధిదారుల జాబితాను సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించడం ద్వారా పారదర్శకత ఏర్పడింది.
  • పంట సాగు రుణాలను సకాలంలో చెల్లించని రైతులలో చైతన్యం కలిగి ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందడానికి వీలు కలిగింది.

ఇతర వివరములు:-

  • రైతులకు వడ్డీ లేని పంట రుణాల కోసం దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవచ్చు.
  • సహాయం మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 155251 ను సంప్రదించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top