మూడో విడత వై ఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తుల స్వీకరణ
- వై ఎస్సార్ వాహన మిత్ర మూడో విడత కుడా ఆర్ధిక పరంగా చేయూతనిచ్చేందుకు అర్హులైన వారి నుంచి జూన్ 7వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. గత సంవత్సరం లబ్ది పొందిన వారు మరలా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు , మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను ఒక సెట్ ను మీ సచివాలయంలో ఇవ్వవలెను.
- డ్రైవింగ్ లైసెన్సు కలిగిన ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులకు ఆర్ధిక సహాయంగా రూ.10,000/- వేల చొప్పున అందించడానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైనది.
- దరఖాస్తులను గ్రామ,వార్డు సచివాలయాలలో పొంది పూర్తి చేసిన దరఖాస్తులను సచివాలయాల్లో ఇవ్వాలి.
- గత ఏడాది లబ్ది పొందిన వారు తమ పేర్లను మీ గ్రామ, వార్డు సచివాలయం నోటీసు బోర్డులో చూసుకోవాలి.
- ఒకవేళ పేరు లేకపోతే మరలా దరఖాస్తులను సమర్పించాలి.
- దరఖాస్తుతో పాటు ఆధార్, తెల్ల రేషన్ కార్డు, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, ఆదాయ & కుల దృవీకరణ సర్టిఫికెట్స్ ను అలాగే మీ వాహనము పక్కన నిలబడిన ఫోటో ను కుడా సమర్పించాలి.
- వాహనం భార్య పేరు మీద వుంటే ఆమెకు డ్రైవింగ్ లైసెన్సు లేకపోయినా , భర్తకు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నా ఈ పథకానికి అర్హులు.
- వాహనం తల్లి, తండ్రి, కూతురు, సోదరుడు పేరుతో వుంటే డ్రైవింగ్ లైసెన్సు మేజర్ కుమారుడి పేరుతో వున్నా ఈ పథకానికి అర్హులు.
- దరఖాస్తు నింపడంలో, నింపినదానిని సమర్పించడంలో సమస్యలు వుంటే స్థానిక ఎంపీడీవో. , మున్సిపల్ కమీషనర్ , గ్రామ , వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చును.
- వెల్ఫేర్ అసిస్టెంట్ , వార్డ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్యదర్శులు జూన్ 9 వ తేదీ నాటికి స్క్రూటినీ చేయాలన్నారు.
- జూన్ 11 వ తేదీలోగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు తిరస్కరణ,ఆమోదం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
- అర్హత గల లబ్దిదారులకు జూన్ 12 వ తేదీన కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయబడతాయన్నారు.
- అర్హులైన లబ్దిదారులకు జూన్ 15 వ తేదీన శ్రీ..గౌ.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు జరుపుతారు.
Post Views: 6