covid helpline number andhra pradesh,

5 Lakh sanctioned through NBCFDC funds to BC Families

                      కరోనాతో మృత్యువాత పడి కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన బి.సి కుటుంబములకు ఆర్థికముగా చేయూత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సదరు బి.సి. వర్గమునకు చెందిన బాధితులకు ప్రభుత్వం రూ.5.00 సహాయం  “National Backward Finance Development Corporation”  (NBCFDC Scheme ) అందించుటకు స్మైల్ అనే పథకమును ప్రవేశపెట్టినది. కరోనా తో చనిపోయిన కుటుంబంలో తరువాతి కుటుంబ పెద్ద లేదా కుటుంబ సభ్యులలో ఎవరైతే కుటుంబ పోషణను చూస్తున్నారో మరియు కుటుంబంలో పిల్లలు మైనర్లు అయి ఉంటే వారి సంరక్షకులకు ఆర్థిక సహాయం అందించుటకు అర్హత కలిగిన వారి వివరాలను గ్రామ మరియు వార్డు సచివాలయముల ద్వారా సేకరించి సదరు వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మునిసిపల్ కమిషనర్ వారిద్వారా ధ్రువీకరించి ప్రభుత్వమునకు సమర్పించవలసిన ఉన్నది.

                      సదరు మొత్తము రూ.5.00 సహాయముతో రూ.1 లక్ష సబ్సిడీ మరియు రూ 4.00 లక్షలు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ న్యూఢిల్లీ వారి రుణం చేయబడును. రూ 4.00 లక్షల రుణము ను వాయిదా పద్ధతిలో అతి తక్కువ వడ్డీతో తిరిగి చెల్లించవలెను.

ఈ పథకమును పొందుటకు అర్హతలు:

  1. బీ.సీ కుటుంబంలో భార్య భర్తల లో ఎవరైనా కరోనాతో మరణించినా ఆ కుటుంబము నుండి ఎవరైతే కుటుంబంలో ఇంటి బాధ్యతలు చూసే వారు మాత్రమే ఈ పథకమునకు దరఖాస్తు చేసుకొనవలెను.
  2. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయినప్పుడు వారి పిల్లలు మైనర్ గా ఉన్నప్పుడు వారి సంరక్షకులు ఈ పథకము నకు దరఖాస్తు చేసుకొనవచ్చును.
  3. కరోనాతో మరణించిన వ్యక్తి మరియు దరఖాస్తుదారుని వయస్సు 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉండవలెను. కుటుంబ వార్షిక ఆదాయం రూ 3.00 లక్షల లోపు ఉండవలెను.

దరఖాస్తు చేసుకొనుటకు కావలసిన పత్రములు:

  1. తహసిల్దార్ వారు మంజూరు చేసిన మీసేవ కుల దృవీకరణ పత్రము
  2. ఆధార్ కార్డు
  3. కరోనాతో మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రము (సంబంధిత అధికారులచే మంజూరు చేయబడినది)
  4. రేషన్ కార్డు
  5. బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ 
  6. మొబైల్ నెంబర్
  7. పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటో

దరఖాస్తు చేసుకునే విధానము:

  • పై అర్హతలు కలిగిన వారు పైన తెలిపిన పత్రములతో మీ గ్రామ మరియు వార్డు సచివాలయములలో 22 జూన్ 2021 వ తేదీ లోగా మీకు కావలసిన పథకం (యూనిట్స్) వివరములు తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవలెను. దరఖాస్తు ఫారంలు  మీ మండల/ మునిసిపల్ కార్యాలయంలో మరియు గ్రామ/ వార్డు సచివాలయములలో అందుబాటులో కలవు.

దరఖాస్తుల పరిశీలన:

  • సదరు గ్రామ / వార్డు సచివాలయముల ద్వారా సేకరించిన దరఖాస్తులను ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మునిసిపల్ కమిషనర్లు పరిశీలించి 23 జూన్ 2021 బి.సి కార్పొరేషన్ కార్యాలయమునకు అందచేయుట జరుగును.
  • మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మునిసిపల్ కమిషనర్ నుంచి వచ్చిన దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీ.సీ కార్పొరేషన్ వారు పరిశీలించి జిల్లా కలెక్టర్ వారి ఆమోదముతో 25 జూన్ 2021 వ తేదీ లోగా ది.వి.సి & మేనేజింగ్ డైరెక్టర్ బీ.సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయముకు మంజూరు కొరకు పంపబడును.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top