YSR Pension Scheme in Telugu

YSR Pension Kanuka Scheme in Telugu | Andhra Pradesh |

వై.యస్ ఆర్. పెన్షన్ కానుక

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన  “నవరత్నాల”లో “వై.యస్.ఆర్ పెన్షన్ కానుక” ఒకటి. ఈ పధకం పారదర్శకంగా అర్హులైన అందరికి పించను అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంతోంది. దీని కొరకు అర్హతలను సడలించి అన్ని వర్గాల ప్రజలకు పించను కానుక అందిచేవిధంగా చర్యలు గైకొనడం జరిగింది.

1.కేటగిరీ వారిగా  నూతన విధానంలో పెన్షన్ దరఖాస్తు దారులకు ఉండవలసిన అర్హతలు :

a) మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతంలో నెలకు   రూ.12,000 మించరాదు.

b) వయస్సు ఆధార్ కార్డు ప్రకారం తీసుకొనబడును.

c) భూమికి సంబంధించి మొత్తం కుటుంబానికి మాగాణి  అయితే 3 ఎకరాలు లేదా మెట్ట అయితే 10 ఎకరాలు లేదా మాగాణి, మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.

d) కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీ, ట్రాక్టర్ మరియు ఆటోలు మినహాయింపు).

e) కుటుంబం సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారులై ఉండరాదు.

f) కుటుంబ నివాసం (సొంత / అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.

g) పట్టణ ప్రాంతంలో కుటుంబ నివాసం1000చదరపు అడుగుల లోపు నిర్మించినదై ఉండాలి.

h) కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకూడదు.

i) కింది షరతులతో కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ పెన్షన్లు అనుమతించబడుతుంది.

         i) 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగుల కుటుంబం.

        ii) డయాలసిస్ రోగులు (సికెడియు) / తీవ్రమైన మెంటల్ రిటార్డేషన్ /పిఎల్‌హెచ్‌వి (ఎఆర్‌టి)

ap grama ward volunteer awards 2023 dates
AP Grama Ward Volunteer Awards – 2023

       iii) జి.ఓ.ఆర్.ఆర్టి.నెం.551 లో ప్రతిపాదించిన పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది.

2.వివిధ కేటగిరీ వారీగా ఫించనుదారులకు కావలసిన అర్హతలు:

  • వృయోవృద్ధులు: 60 సంవత్సరాలు మరియు ఆ పై వయస్సు కలవారు (జిఓతేది.30.05.19) మరియు    గిరిజనులకు 50 సంవత్సరాలు మరియు ఆ పై వయస్సు కలవారు (జి.ఓ.నెం.49, తేదీ 10.02.2019 ప్రకారం)
  • వితంతులు: వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాల పై బడి వయసు కలవారు. భర్త మరణ ద్రువీకరణ
  • వికలాంగులు: వీరికి వయో పరిమితి లేదు. 40% మరియు ఆపైన వికలత్వం కలిగి ఉన్నవారు   మరియు  SADAREM సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • చేనేత కార్మికులు: వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగి ఉండాలి.
  • కల్లుగీత కార్మికులు: వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. టాడీ కో-ఆపరేటివ్ సొసైటీస్ (టిసిఎస్) సభ్యులు లేదా ట్రీ ఫర్ టాపర్స్ (టిఎఫ్‌టి) పథకం కింద ఒక వ్యక్తిగత ట్యాప్పర్‌కు. ఎక్సైజ్ శాఖ వారు జారీ చేసిన గుర్తింపు పత్రం  కలిగి ఉండాలి.
  • ఆర్ట్ పెన్షన్స్(PL HIV): 6 నెలలు వరుసగా ART treatment (Anti Retroviral Therapy) తీసుకుంటున్నవారు.
  • డయాలిసిస్ పెన్షన్ (CKDU): వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి నెలా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు.
  • ట్రాన్స్ జెండర్: 18 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి సర్టిఫికేట్ కలిగినవారు.
  • మత్య్సకారులు: వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. మత్స్య శాఖ వారిచే జారీ చేసిన గుర్తింపు పత్రం కలిగి ఉండాలి.
  • ఒంటరి మహిళ: 35 ఏళ్లు పైబడి, భర్త నుండి విడిపోయిన మహిళలు మరియు భర్త  నుండి విడిపోయి 1 సంవత్సర కాలం మించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో  30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెళ్లికాని మహిళలు మరియు పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెళ్లి కాని మహిళలు.
  • డప్పు కళాకారులు: 50 సంవత్సరాల వయసు నిండిన వారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ వారు జారీ చేసిన లబ్దిదారుల జాబితా ప్రకారం {as per G.O.R.T. No 199 dated 30.06.18 (SWD)}.
  • చర్మకారులు: 40 సంవత్సరాల వయసు నిండిన వారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ వారు జారీ చేసిన లబ్దిదారుల జాబితా ప్రకారం {as per G.O.R.T. No 191  dated 12.11.18 (SWD)}.
  • దీర్ఘ తలసేమియా: వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి / జిల్లా కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద అందుబాటులో ఉన్న జాబితాకు మాత్రమే పింఛను ఇవ్వబడుతుంది.
  • సికిల్ సెల్ వ్యాధి: వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి / జిల్లా కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద అందుబాటులో ఉన్న జాబితాకు మాత్రమే పింఛను ఇవ్వబడుతుంది.
  • తీవ్ర హీమోఫీలియా (<2% of factor 8 or 9): వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి / జిల్లా కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద  అందుబాటులో ఉన్న జాబితాకు మాత్రమే పింఛను ఇవ్వబడుతుంది.
  • ద్వైపాక్షిక బోద వ్యాధి – గ్రేడ్ – 4: వయోపరిమితి లేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య  అధికారి / జిల్లా కుష్టు అధికారి / జిల్లా మలేరియా అధికారి వద్ద అందుబాటులో ఉన్న జాబితాకు మాత్రమే పింఛను ఇవ్వబడుతుంది.
  • పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు: వయో పరిమితి లేదు. డేటాను SADAREM డేటా బేస్ నుండి పొందవచ్చు మరియు వైద్య అధికారిచే క్షేత్రస్థాయిలో ధృవీకరించబడుతుంది.
  • తీవ్రమైన కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులు, చక్రాల కుర్చీకి లేదా  మంచానికి పరిమితమైనవారు: వయో పరిమితి లేదు.  డేటాను SADAREM డేటా బేస్ నుండి పొందవచ్చు మరియు వైద్య అధికారిచే క్షేత్రస్థాయిలో ధృవీకరించబడుతుంది.
  • దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధిగ్రస్తులకు (3, 4 & 5 స్టేజీలలో) డయాలసిస్ చేయించుకోని మరియు క్రింది పరిస్థితులు కలిగి ఉన్నవారు:

                 a) సీరం క్రియాటినిస్ 5 mg కంటే ఎక్కువ మరియు రెండు వేర్వేరు కనీసం 3 నెలల వ్యవధితో (ప్రభుత్వ ల్యాబ్ లో) పరీక్షించబడి నిర్ధారించిన వారు.

                 b) సోనోగ్రాఫిక్ మూల్యాంకనం పై కుచించుకుపోయిన మూత్ర పిండాలు (8సెం.మీ కంటే తక్కువ) 15ml అంచనా (G.O.Rt. No.551 HMFW dt. 26.10.2019)

3.జీవిత భాగస్వామి పెన్షన్:

వృద్ధాప్యం, చేనేత, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, వికలాంగ కేటగిరీ పెన్షనర్లు మరణించిన సందర్భంలో, కుటుంబాన్ని పోషించడానికి వారి జీవిత భాగస్వామి (భార్య) కు వితంతు పెన్షన్ గా మంజూరు చేయబడుతుంది.

4.అర్హత ధృవీకరణ:

సంబదిత శాఖలు అభివృద్ధి చేసిన డేటాబేస్లలోని సామాజిక-ఆర్థిక డేటా మరియు వెబ్ సేవ ద్వారా డేటా రిపోజిటరీతో అర్హత ప్రమాణాలు ధృవీకరించబడతాయి.

5.గ్రామ /వార్డు వాలంటీర్ల పాత్ర:

గ్రామ / వార్డు వాలంటీర్లు సామాజిక భద్రత పెన్షన్‌కు అర్హులైన లబ్దిదారులను వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక కింద గుర్తించి, ప్రతి కేటగిరీ పెన్షన్‌కు సూచించిన అర్హత ప్రమాణాల ప్రకారం భౌతిక ధృవీకరణ (సామాజిక తనిఖీ) చేయడం జరుగుతుంది.  వాలంటీర్లు పెన్షన్ ప్రయోజనాల పంపిణీని పెన్షన్ దారు ఇంటికి చేరేలా నిర్ధారించుకోవాలి.

6.మండల అభివృద్ధి అధికారి మరియు మునిసిపల్ కమీషనర్ పాత్ర:

గ్రామీణ ప్రాంతాలలో మండల అభివృద్ధి అధికారి మరియు పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ కమీషనర్ వారు ఈ పథకం అమలులో పూర్తి బాధ్యతను పోషిస్తారు.డేటా నిర్దారించుటలో మరియు క్షేత్ర స్థాయి పరిశీలనలో ఏవిధమైన తేడాలు ఉన్నచో, టీం అనగా మండల అభివృద్ధి అధికారి,తహసీల్దారు మరియు ఈ.ఓ పి.ఆర్.డి గ్రామీణ ప్రాంతాలలో మరియు మున్సిపల్ కమిషనరు మరియు తహసీల్దారు పట్టణ ప్రాంతాలలో పునఃపరిశీలన చేసిన నివేదికను జిల్లా పధక సంచాలకులకు సమర్పించవలెను. 

7.జిల్లాలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఏ వారు పర్యవేక్షిస్తారు.

mission-vatsalya-scheme
Mission Vatsalya Scheme Details in Telugu

8.ముఖ్యకార్యనిర్వహణాధికారి, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఆంద్ర ప్రదేశ్, విజయవాడ వారు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలి.

9. లబ్దిదారుని వయస్సును నిర్ణయించడానికి మొత్తం కుటుంబాన్ని పరిగణలోనికితీసుకోవడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి,

i) ఆధార్ కార్డు ద్వారా వయస్సును ధృవీకరించడం.

ii)ఆధార్ కార్డు వివరాలను రేషన్ కార్డు డేటాతో పోల్చడం.

iii) సంబదిత శాఖల డేటా ప్రకారం కుటుంబం వివరాలతో నిర్ధారించడం.

iv) క్షేత్ర స్థాయి తనిఖీలు

      a)వ్యక్తిగత సర్టిఫికెట్స్ ఆధారంగా పరిశీలించాలి.

      b) వారి పిల్లల సర్టిఫికెట్స్ ఆధారంగా పరిశీలించాలి.

      c) పెళ్లి నిర్ధారణ సర్టిఫికెట్స్ ఆధారంగా పరిశీలించాలి.

      d) పెళ్లి జరిగిన సంవత్సరం ఆధారంగా.

      e) స్థానికంగా విచారించడం.

v)మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఆధారంగా ధృవీకరించడం.

పది రోజుల్లో పింఛన్ల మంజూరు
దరఖాస్తు స్వీకరించిన తేదీ నుండి 10 పని దినాలలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి.
1 వ రోజువాలంటీర్లచే తప్పనిసరి పత్రాలతో పాటు దరఖాస్తును స్వీకరించండి .
2 & 3 వ రోజుWEA / WWDS దరఖాస్తుదారు వివరాల నిర్ధారణ కోసం భౌతిక ధృవీకరణను చేపట్టాలి మరియు ధృవీకరించబడిన డేటాను అప్డేట్ చేసి GSWS పోర్టల్‌లో తప్పనిసరి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
4 & 5 వ రోజుఎంపిడిఓ / మున్సిపల్ కమిషనర్ లు దరఖాస్తులను పరిశీలిస్తారు. మరలా ధృవీకరణ అవసరమైతే WEA / WWDS కు పంపబడుతుంది.
6 & 7 వ రోజుఅంగీకరించిన మరియు తిరస్కరించబడిన ముసాయిద దరఖాస్తులను సామాజిక తనిఖీ కోసం GSWS నోటీసు బోర్డులో ఉంచబడుతుంది. మరియు దరఖాస్తుదారుల నుండి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తుంది.
8 & 9 వ రోజుఎంపిడిఓ / మున్సిపల్ కమిషనర్ జాగ్రత్తగా పరిశీలించి ధృవీకరించిన తరువాత అభ్యంతరాలు పరిష్కరించబడును.
10 వ రోజుఅంగీకరించిన దరఖాస్తులకు మంజూరు ఉత్తర్వులను పెన్షన్ పాస్ బుక్, కార్డు మరియు HCM లేఖతో పాటు లబ్దిధారునకు వాలంటీర్ ద్వారా అందజేస్తారు. తిరస్కరించబడిన దరఖాస్తుల కోసం తుది చర్యలతో పాటు ఉత్తర్వులు అందజేయబడతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top