ysr cheyutha scheme in andhra pradesh

YSR Cheyutha Scheme | Second Phase | FAQs

YSR Cheyutha Scheme FAQ

వై.యస్.ఆర్ చేయూత పథకమునకు ఏ తేదీ నాటికి 45 సంవత్సరాలు ఉండాలి?

12 ఆగష్టు 2021 నాటికి 45 సంవత్సరాలు నిండి ఉండాలి.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఈ సంవత్సరం అర్హత వుండి Volunteer App లో New Registration ఆప్షన్ లో చూపించడం లేదు?

ఈ సంవత్సరం అర్హత కలిగిన వారికి Grama/Ward Volunteer యాప్ లో సేవల అభ్యర్ధన ఆప్షన్ లో Update eKYC అనే ఆప్షన్ ద్వారా Benificiary దీ Biometeric Athentication వేయించాలి.24 గంటల తరువాత అప్డేట్ అవుతుంది.ఒకవేళ అప్పుడూ రాకపోతే మీ సచివాలయంలో స్పందన ద్వారా కంప్లైంట్ పెట్టాలి.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఏ ఏ డాకుమెంట్స్ కావాలి?

1. రేషన్ కార్డు 2. ఆధార్ కార్డు 3. క్యాస్ట్ సర్టిఫికేట్ 4.ఇన్ కమ్ సర్టిఫికేట్ 5. ఆధార్ అప్డేట్ హిస్టరీ.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఏ క్యాస్ట్ క్యాటగిరీలకు వర్తిస్తుంది?

ఎస్సీ/ఎస్టీ/బిసీ/మైనారిటీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.

కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు వుంటే ఈ పథకానికి అర్హులా ?

అర్హులు కాదు.

కుటుంబంలో ఎంత భూమి వరకు వుంటే ఈ పథకానికి అర్హులు?

తడి భూమి 3 ఎకరాలు, మెట్టభూమి 10 ఎకరాలు (లేదా) తడి మరియు మెట్ట భూమి కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి గత సంవత్సరం ఎలిజబుల్ అయిన వారి మొబైల్ నంబర్ తప్పుగా వుంటే ఏ విధంగా మార్చాలి?

మీ సచివాలయం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది.

ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎవరెవరికి అవసరం?

వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసే వారికి మాత్రమే అవసరం, గత సంవత్సరం లబ్ది పొందిన వారికి అవసరం లేదు.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి కొత్తగా క్యాస్ట్ & ఇన్ కమ్ సర్టిఫికెట్స్ మల్లీ అప్లై చేయాలా?అవసరం లేదా?

గత సంవత్సరం ఎలిజబుల్ అయిన వారు మరలా క్యాస్ట్ & ఇన్ కమ్ సర్టిఫికెట్స్ చేపించడం అవసరం లేదు.ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసేవారు కుడా పాత సర్టిఫికెట్స్ వుంటే వాటినే అప్లై చేయవచ్చును. ఒకవేళ లేకపోతే కొత్తగా అప్లై చేయాలి.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఏ పెన్షన్ వచ్చే వారు అర్హులు?

వితంతు మరియు ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఈ పథకానికి అర్హులు.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి ఏ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు?

వృద్దాప్య మరియు వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఈ పథకానికి అనర్హులు.

వై.యస్.ఆర్ చేయూత పథకానికి అప్లై చేయటానికి చివరి తేది ఎప్పుడు?

8 జూన్ 2021.

వై.యస్.ఆర్ చేయూత పథకము లబ్దిదారుల IFSC కోడ్స్ ను ఏవిధంగామార్చాలి?

మీ సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ లో మార్చుకోవచ్చును..

వై.యస్.ఆర్ చేయూత పథకము ఫైనల్ సెలక్షన్ లిస్టు ఎప్పుడు వస్తుంది?

15 జూన్ 2021 న ఫైనల్ లిస్టు వస్తుంది.

1 thought on “YSR Cheyutha Scheme | Second Phase | FAQs”

  1. Mariamma Lloyd

    My name Mariamma Lloyd. DOB 18-6-73 , Visakhapatnam VUDA LAYOUT Marripalem, was there in the first list last year. Due to minority I didn’t get my scheme money. This year still the same problem please look into to the matter

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top