ysr-sunna-vaddi-pathakamu

YSR Sunna Vaddi Scheme in Telugu

వై.యస్.ఆర్  “సున్నా” వడ్డీ పథకం

  1. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకొన్న ఋణాలను సక్రమముగా తిరిగి చెల్లించుటకు, వారి పై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వడ్డీ రాయితీ పథకాన్ని  “వై.యస్.ఆర్  సున్నా వడ్డీ ” గా అమలుచేస్తున్నారు. 
  2. ఈ పథకం అమలు వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా  మరింత రుణం  పొందడానికి మరియు  వారు  స్థాపించిన చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా, వడ్డీ భారం లేకుండా నడపడానికి, మెరుగైన జీవనం  సాగించడానికి దోహద పడుతుంది.

ప్రయోజనం:

అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘమునకు రూ.3,00,000 /- లక్షల అప్పు నిల్వ వరకు పూర్తి వడ్డీ ప్రయోజనం చేకూరుతుంది .

అర్హతలు:

  1. తేది.11.04.2019 నాటికి అప్పు నిల్వ ఉన్న స్వయం సహాయక సంఘాలు మరియు 11.04.2019 నుండి కొత్తగా  ఋణం పొంది క్రమం తప్పకుండా ఋణ చెల్లింపులు చేస్తున్న  స్వయం సహాయక సంఘాలు “సున్నా” వడ్డీకి అర్హులు.
  2. క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా అప్పు పొందిన సంఘాలు నెలాఖరునాటికి ఉన్న అప్పు నిల్వలో కనీసం 3 శాతం మరుసటి నెలాఖరు లోపు చెల్లించాలి.
  3. ఉదా: తేది 31.07. 2019 నాటికి ఉన్న బ్యాంకు అప్పు నిల్వ మొత్తం.    రూ.3,00,000/- , పూర్తి వడ్డీ రాయితీ  పొందడానికి కనీసం కట్టవలసిన 3 శాతం అంటే రూ.9,000/- 31.08.2019 నాటికీ పూర్తిగా చెల్లించాలి.
  4. టర్మ్ లోన్ ద్వారా తీసుకొన్న ఋణము నెల వారి వాయిదా మొత్తంను కట్టవలసిన నెలాఖరునాటికి కట్టవలెను.
    ఉదా: తేది 05.07.2019 న అప్పు తీసుకొన్నట్లు అయితే నెలవారీ వాయిదా 05.08.2019 నాటికి కట్టవలసి ఉంటుంది.   అయితే    31.08.2019 నాటికి కట్టినా పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
  5. వడ్డీ లేని ఋణ అర్హతను ప్రతినెల లెక్కించ బడుతుంది.
  6. వాయిదా బకాయి ఉన్న సంఘాలు బకాయిలు పూర్తిగా చెల్లించిన పిదప మాత్రమే వడ్డీ లేని ఋణాల కు అర్హత పొందుతాయి. ఏ నెలలో అయితే బకాయిలు పూర్తిగా చేల్లిస్తారో ఆ నెలకు మాత్రమే వడ్డీ లేని ఋణం పొందుతారు.
  7. ప్రస్తుత అప్పు నిల్వ, అప్పు మంజురుయిన మొత్తంనకు    సమానంగా గాని లేక తక్కువగా గాని ఉన్న సంఘాలు అర్హత  పొందుతాయి.

పథకం అమలు తీరు :

  • స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకుల నుంచి తీసుకున్న బ్యాంకు రుణాలను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్యలో గరిష్టంగా రూ.3 లక్షల వరకు కట్టిన సంఘాలకు వడ్డీని తిరిగి ప్రభుత్వం “వై.యస్.ఆర్ సున్నా వడ్డీ” పథకం ద్వారా సభ్యుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది
  • సక్రమంగా బకాయి తిరిగి చెల్లిస్తున్న సంఘాలకు 3 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం (ఎన్.ఆర్.ఎల్.ఎం) మిగిలిన 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది
  • కేటగిరి 1 జిల్లా (వెనుకబడిన జిల్లా) గా గుర్తింపుపొందిన ఇక్కడి స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూ.3 లక్షల రుణ పరిమితి వరకు7 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారు.
  • “వై.యస్.ఆర్ సున్నా వడ్డీ” పథకాన్ని ఏప్రిల్ 23న ప్రజాప్రతినిధులు స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • సున్నా వడ్డీ అందుకుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చే సందేశం సభ్యుల వివరాలతో కూడిన పత్రాలను అందజేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top