జాతీయ అసంఘటిత కార్మికుల సమగ్ర రిజిస్ట్రేషన్ కార్యక్రమం
కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న జాతీయ అసంఘటిత కార్మికుల సమగ్ర రిజిస్ట్రేషన్ NDUW – National Database of Unorganized Workers registration లో భాగంగా నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, గృహ కార్మికులు ,ఇతర అసంఘటిత కార్మికుల సమూహాల సమాచారాన్ని ఆధార్ తో అనుసంధానం చేయనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామ/ వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు /వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లు CSC పోర్టల్ ద్వారా నమోదు చేసిన కార్మికుల వివరాలు e-SHRAM పోర్టల్ లో పొందుపరచబడతాయి.
ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండు కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. వీరందరినీ గ్రామ/ వార్డు సచివాలయాల (CSC కేంద్రాలు) ద్వారా NDUW లో నమోదు చేయాలనుకుంటున్నారు.
రైతులు:
- చిన్న మరియు మధ్య తరగతి రైతులు
- వ్యవసాయ కూలీలు
- కౌలు రైతులు
- పశువుల కాపరులు
- సెరికల్చర్ కార్మికులు
మత్స్యకారులు:
- ఉప్పు బట్టీల కార్మికులు
- పడవలు /తెడ్లు నడిపేవారు
- రోడ్డుమీద చేపలు అమ్మే వారు
- సముద్రం /నదులు/ కాలవల్లో చేపలు పట్టే వారు
- బీడీలు చుట్టే వారు
- లేబులింగ్ మరియు ప్యాకింగ్ చేసేవారు
చిన్న పరిశ్రమల కార్మికులు:
- తోలు పని కార్మికులు
- తినుబండారాల తయారీదారులు
- చర్మశుద్ధి కార్మికులు
- క్యాటరింగ్ పనివాళ్ళు
చేనేత కార్మికులు:
- గార్మెంట్స్ కార్మికులు
- నూలు వడికే వారు
- చేనేత సహాయ కార్మికులు (పొడుగులు చేసే వారు ,లడ్డీలు చుట్టేవారు, మొలలు కట్టేవారు మొదలైనవారు.
వడ్రంగులు:
- చెక్కల పని చేసేవాళ్ళు
- కట్టెలు /చెట్లు కొట్టే కూలీలు
వీధి వర్తకులు:
- కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు
- వార్తాపత్రికల విక్రేతలు
- చిరుతిండ్లు అమ్మేవారు
రవాణా కూలీలు:
- రిక్షావాలాలు
- ఆటో డ్రైవర్లు
- లగేజీ మోసే కూలీలు
కూలీలు:
- తాపీ పనివాళ్ళు
- ఇటుక బట్టీలు మరియు రాతి క్వారీలలో పనిచేసేవారు
- భవన నిర్మాణ కార్మికులు
- రోడ్డు నిర్మాణ కూలీలు
ఇతరులు:
- సాధారణ సేవా కేంద్రాలు
- ఇంటి పని మనుషులు
- మంత్రసానులు
- బార్బర్లు
- MNGRGA కార్మికులు
- ఆశా వర్కర్స్
- పాలు అమ్మే రైతులు
- వలస కార్మికులు మొదలైనవారు.
పై జాబితా సూచనకు మాత్రమే. పైన తెలిపిన కేటగిరీల వారే కాకుండా ఇంకా అసంఘటిత రంగాల్లోని కార్మికులు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా గ్రామ /వార్డు సచివాలయ సిబ్బంది ఈ జాబితాలో చేర్చవచ్చు.
NDUW రిజిస్ట్రేషన్‘కు ఉండవలసిన అర్హతలు::
ఈ కింది అర్హతలు కలిగిన కార్మికులందరూ NDUW రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులే.
- వయస్సు 16 – 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు.
- EPFO మరియు ESIC లో సభ్యులుగా ఉండకూడదు.
- అసంఘటిత కార్మికుల కేటగిరీలలోనే పని చేస్తూ ఉండాలి.
NDUW రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన పత్రాలు::
తప్పనిసరి (Mandatory):
- ఆధార్ నెంబర్ ని ఉపయోగిస్తూ ఈ -కేవైసీ చేయడం తప్పనిసరి
- OTP
- వేలిముద్ర
- IRIS
- వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతా
లేకున్నా పర్వాలేదు (Optional):
- విద్యార్హత సర్టిఫికెట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- వృత్తి ధ్రువీకరణ పత్రం
- స్కిల్ సర్టిఫికెట్
NDUW రిజిస్ట్రేషన్ వలన కలిగే ప్రయోజనాలు:
- NDUW రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితంగా నిర్వహించబడుతుంది. కార్మికులు ఎవరూ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఈ NDUW రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అసంఘటిత కార్మికుల కి ప్రత్యేకమైన నెంబర్ తో కూడిన ఒక గుర్తింపు కార్డు జారీ చేయబడుతుంది.
- NDUW రిజిస్ట్రేషన్ చేసుకున్న అసంఘటిత కార్మికులను PM సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది.
- కేవలం రూ.12/- రూపాయల ప్రీమియంతో ఒక సంవత్సరం పాటు బీమా ప్రయోజనం అందించబడుతుంది.
- అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత & సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా పొందుతారు.
- ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కార్యక్రమాల కల్పనలో NDUW కింద నమోదైన అసంఘటిత కార్మికుల డేటాబేస్ ఉపయోగపడుతుంది.
- అనధికారిక రంగం నుండి అధికారిక రంగానికి మారుతున్న కార్మికుల వివరాలను తెలుసుకోవడానికి, అలానే వారి వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.
- అలానే వలస కార్మికుల శ్రామిక శక్తిని తెలుసుకోవడానికి మరియు వారికి మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి కూడా ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.
- NDUW జాతీయ అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ ని గ్రామ/ వార్డు సచివాలయాలలో ఉచితంగా నిర్వహిస్తారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం కార్మికుల నుండి ఎటువంటి మొత్తాన్ని వసూలు చేయరు.
వాలంటీర్ల పాత్ర:
- గ్రామ/ వార్డు వాలంటీర్లందరూ NDUW రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను మీకు కేటాయించిన కుటుంబాల్లోని అన్ని వర్గాల అసంఘటిత కార్మికులకు సవివరంగా తెలియజేయాలి.
- అన్ని వర్గాల అసంఘటిత కార్మికులను గ్రామ/ వార్డ్ సచివాలయ ల దగ్గర సమీకరించాలి.
- అసంఘటిత కార్మికులందరూ ఆధార్ కార్డులతో గ్రామ/ వార్డు సచివాలయాల్లో హాజరయ్యేలా చూసుకోవాలి.
- 15 సెప్టెంబర్ 2021 లోపు తమ క్లస్టర్ పరిధిలోని అసంఘటిత కార్మికులందరూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా చూసుకోవాలి.
డిజిటల్ అసిస్టెంట్లు /WEDPS పాత్ర:
- సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ /వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లు (WEDPS) వారికి ఇప్పటికే ఇచ్చిన CSC ఆపరేటర్ ఐడీలను ఉపయోగించి e-SHRAM పోర్టల్ లో ఉన్న అసంఘటిత కార్మికుల వివరాలను CSC పోర్టల్ ద్వారా నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, UAN కార్డు జనరేట్ చేయబడుతుంది మరియు దానిని ప్రింట్ చేసి అసంఘటిత కార్మికుడికి అప్పగించాలి.( దీనికి ప్రత్యేకంగా స్టేషనరీ అందించబడదు).
MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ ల పాత్ర:
- వాలంటీర్లకు శిక్షణ ఇవ్వటం.
- డిజిటల్ అసిస్టెంట్/ WEDPS లకు శిక్షణ ఇవ్వటం.
- అసంఘటిత కార్మికులందరికీ ఈ రిజిస్ట్రేషన్ గురించి ప్రచారం మరియు అవగాహన కల్పించడం.
- అసంఘటిత కార్మికులను గ్రామ /వార్డు సచివాలయం సమీకరించడానికి చర్యలు తీసుకోవటం.
- వారి అధికార పరిధిలోని అసంఘటిత కార్మికులందరికీ రిజిస్ట్రేషన్ జరిగేలా చూసుకోవటం.
డిస్ట్రిక్ట్ మేనేజర్ CSC సేవలను సక్రమంగా వినియోగించుకునేలా వాలంటీర్లకు మరియు డిజిటల్ అసిస్టెంట్లు/ WEDPS లకు జాయింట్ కలెక్టర్లు (VWS&D) శిక్షణ ఇస్తారు. ఇంకా GVWV&VSWS డిపార్ట్మెంట్ గ్రామ /వార్డు సచివాలయాలకు ఈ రిజిస్ట్రేషన్ నిర్వహణ నిమిత్తం ప్రోత్సాహకంగా స్టేషనరీ వంటి కార్యాచరణ వ్యయం కోసం ఉపయోగించుకునేలా ప్రతి రికార్డుకు రూ.6/- ( ఆరు రూపాయలు) చొప్పున చెల్లించనుంది.
వాలంటీర్లకు మరియు డిజిటల్ అసిస్టెంట్ లకు/WEDPS లకు శిక్షణ ఇవ్వటానికి అవసరమయ్యే మెటీరియల్:
- NDUW –PPT
- e-SHRAM అప్లికేషన్
- e-SHRAM హ్యాండ్ బుక్
ఈ విషయంలో జాయింట్ కలెక్టర్లు (VWS &D) 24 ఆగస్టు 2021 నుండి 15 సెప్టెంబర్ 2021 వ తేదీ లోపు గ్రామ /వార్డు సచివాలయాల ద్వారా మన రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు అందరూ NDUW రిజిస్ట్రేషన్ పూర్తయ్యేందుకు అవసరమైన సూచనలను MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్లకు జారీ చేయాలి.
syedrasool056@gmail.com