agrigold-second-term-payment

AgriGold Second Term Payment Process

అగ్రిగోల్డ్ బాధితులకు రెండోవిడత చెల్లింపులు విధి విధానాలు::

అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత కింద రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు నగదును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇప్పటికే రూ.10 వేల లోపు సొమ్మును డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం ఆ మొత్తాలను మొదటి విడత కింద గత సంవత్సరమే చెల్లించింది. ఈ సంవత్సరం రెండో విడత కింద రూ. 10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ దారులను ఆదుకోవాలని నిర్ణయించింది.గౌ.శ్రీ. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాలలో ఆ మొత్తాలను అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వారి బ్యాంకు ఖాతాలకు ఈ నెల 24న జమ చేయనున్నారు.

ap grama ward volunteer awards 2023 dates
AP Grama Ward Volunteer Awards – 2023

  1. అగ్రిగోల్డ్ సంస్థ లో రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు కట్టిన డిపాజిట్ దారుల సంబంధిత చెక్కు
  2. పే ఆర్డర్
  3. రసీదులు
  4. బ్యాంకు పాస్ పుస్తకం
  5. ఆధార్ కార్డు
  6. రేషన్ కార్డు

పైన పేర్కొన్న అన్ని డాకుమెంట్స్ వివరాలను మీ గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ వద్ద నమోదు చేయించుకోవాలి. ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీలోగా నమోదు చేయించుకోవాలి.

mission-vatsalya-scheme
Mission Vatsalya Scheme Details in Telugu

  • కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.
  • అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వారికి రావాల్సిన నగదును వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సమ్మతించరు.
  • ఒక డిపాజిట్ దారు ఒక క్లెయిమ్ కే అర్హులు.
  • చనిపోయిన డిపాజిట్ దారుల డిపాజిట్ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్ హైర్ సర్టిఫికెట్ కూడా సమర్పించారు.
  • గతంలో పదివేల లోపు క్లెయిమ్ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు.
  • గత సంవత్సరం లబ్ది పొందని వారు మాత్రమే ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకోవాలి.
  • అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004253875 కు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top