వై.యస్.ఆర్ బీమా సర్వే యాప్ 2.0 లో వాలంటీర్స్ సర్వే ను ఏవిధంగా చేయాలి?
వై.యస్.ఆర్ బీమా రెన్యువల్ యాప్ ను ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
👉 YSR Bima New Scheme Enrolment App V 2.0 Clickhere Download
యాప్ లాగిన్ (వాలంటీర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ తో):
మీరు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ లో వాలంటీర్స్ డీటెయిల్స్ లో మీ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోండి.(ఒకవేళ మీ మొబైల్ నంబర్ మారివుంటే మాత్రమే)
- గ్రామ/వార్డు సచివాలయం మ్యాప్ అయిన వాలంటీర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత GET OTP మీద క్లిక్ చేయాలి.
- మీ SMS Inbox లో OTP వస్తుంది. ఆ OTP నంబర్ ను క్రింద చూపించిన స్క్రీన్ లో ఎంటర్ చేసి OK పై క్లిక్ చేయాలి.
- మీ OTP మ్యాచ్ అయితే మీకు Home Screen కనబడుతుంది.
- ఒకవేళ మీరు గ్రామ/వార్డు సచివాలయం మ్యాప్ చేయకుండా మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి GET OTP పై క్లిక్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.సాంకేతిక ఇబ్బందుల గురించి ఈ హెల్ప్ డెస్క్ డాకుమెంట్ లాస్ట్ లో ఇవ్వడం జరిగింది.
Confirm Bread Earner:
- హోం స్క్రీన్ లో “Confirm Bread Earner” మీద క్లిక్ చేయండి. తరువాత ఈ కింద వివరాలు కనిపిస్తాయి.
- రైస్ కార్డు లిస్టు లో , రైస్ కార్డు నెంబర్ మీద క్లిక్ చేసిన తరువాత మీరు ఎన్ రోల్ చేసి వుంటే ఈ కింద విధంగా వివరాలు కనిపిస్తాయి.
- Whether Policy Holder is Bread Earner or not? ( అంటే పాలసి హోల్డర్ కుటుంబాన్ని పోషించే వ్యక్తా?కాదా? అవును/కాదు అనే ఆప్షన్ లో కింద ఉన్న పాలసీదారుని డీటెయిల్స్ సరయినవి అయితే అవును పై క్లిక్ చేయండి.లేకపోతే కాదు అని క్లిక్ చేయండి.
- పాలసీదారుని ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సమ్మతిని ఎంచుకొని eKYC చేయవలెను.
- eKYC చేయు విధానము:
- Mantra, Startek, Next బయోమెట్రిక్ కు సంబంధించిన RD Devices లో ఏ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD Device యొక్క యాప్ మాత్రమే వుంచి మిగిలిన వాటిని తొలగించండి.
- సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత RD Device తో వేలిముద్ర వేయండి.
- వేలిముద్ర వేసిన తరువాత పాలసీదారుని వివరములు కనిపిస్తాయి. Continue బటన్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
నామినీ వివరములు:
- నామినీ అందుబాటులో వున్నారా లో అవును అయితే అవును అని క్లిక్ చేసి నామినీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సమ్మతిని ఎంచుకొని eKYC చేయవలెను.
eKYC చేయు విధానము:
- Mantra, Startek, Next బయోమెట్రిక్ కు సంబంధించిన RD Devices లో ఏ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD Device యొక్క యాప్ మాత్రమే వుంచి మిగిలిన వాటిని తొలగించండి.
- సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత RD Device తో వేలిముద్ర వేయండి.
- వేలిముద్ర వేసిన తర్వాత నామినీ వివరములు కనిపిస్తాయి. నామినీ 18 సంవత్సరాలు లోపు వున్నవారు అయితే వారి గార్డియన్ (సంరక్షకుడు), వివరములు ఎంటర్ చేయవలసి ఉంటుంది.
- Continue బటన్ ని క్లిక్ చేసిన తరువాత Volunteer eKYC స్క్రీన్ కనిపిస్తుంది.
- Volunteer eKYC స్క్రీన్ లో, వాలంటీర్ I accept the above Dectation సమ్మతిని ఎంచుకొని , తన యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి సమ్మతిని ఎంచుకొని eKYC చేయవలెను.eKYC చేసిన తరువాత Data Saved Successfully అని వస్తుంది.
- నామినీ అందుబాటులో ఉన్నారా లో,కాదు అయితే కాదు అని క్లిక్ చేస్తే నామినీ వివరములు కనిపిస్తాయి.Continue బటన్ ని క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా Volunteer eKYC స్క్రీన్ కనిపిస్తుంది.
Volunteer eKYC స్క్రీన్ లో, వాలంటీర్ I accept the above Dectation ని ఎంచుకోవాలి.
వాలంటీర్ తన యొక్క ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి సమ్మతిని ఎంచుకొని eKYC చేయవలెను. eKYC చేసిన తరువాత Data Saved Successfully అని వస్తుంది.
Whether Policyholder is BreadEarner or Not? లో No అని క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
- మీరు ఎంచుకున్న రైస్ కార్డుకి సంబంధించి కుటుంబ సభ్యుల జాబితాలో నుంచి ఒకరిని ఎంచుకోవాలి.
- ఎంచుకోబడిన వారి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి eKYC చేయవలెను.
- eKYC చేయు విధానము:
- Mantra, Startek, Next బయోమెట్రిక్ కు సంబంధించిన RD Devices లో ఏ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD Device యొక్క యాప్ మాత్రమే వుంచి మిగిలిన వాటిని తొలగించండి.
- సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత RD Device తో వేలిముద్ర వేయండి.
- eKYC చేసిన తర్వాత సర్వే కాని వారి వివరముల స్క్రీన్ వస్తుంది.
- సర్వే కాని వారి వివరములు స్క్రీన్ లో, పాలసీదారుని డీటెయిల్స్ , నామినీ డీటెయిల్స్ eKYC చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది.
- Update History of Aadhaar అను స్క్రీన్ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కొన్ని ఆధార్ నంబర్స్ కి మాత్రమే కనిపిస్తుంది.ఇందులో ఆధార్ చేంజ్ చేసిన వివరములు ఎంటర్ చేయవలసి ఉంటుంది.చివరి ఎంట్రీ కి Do you want to update Another Record లో అవును/కాదు లో, కాదు అని క్లిక్ చేస్తే Capture Aadhaar History image అప్లోడ్ చేయాలి.
- Do you want to update Another Record లో అవును అయితే అవును అని క్లిక్ చేసి సబ్మిట్ చేసి NEXT బటన్ ని క్లిక్ చేస్తే వాలంటీర్ eKYC స్క్రీన్ వస్తుంది.
- డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తరువాత NEXT బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తరువాత Volunteer eKYC స్క్రీన్ కనిపిస్తుంది.
- Volunteer EKYC స్క్రీన్ లో Volunteer I accept the above తన యొక్క ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి సమ్మతిని ఎంచుకొని eKYC చేయవలెను. eKYC చేసిన తర్వాత Data saved Successfully అని వస్తుంది.
Search రైస్ కార్డు:
- Search రైస్ కార్డు స్క్రీన్ లో , రైస్ కార్డు నంబర్ తో సెర్చ్ చేసి Bread Earner వెరిఫై చేయడానికి ఇవ్వబడింది.
Reports:
- Reports Screen లో , Rice Cards వైజ్ వాలంటీర్ చేసిన రిపోర్ట్స్ కనిపిస్తాయి.
సాంకేతిక ఇబ్బందులకై :
- You are not Authorised to login అని వస్తే వాలంటీర్ తన యొక్క మొబైల్ నంబర్ ని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ దగ్గర మ్యాప్ చేయించుకోవాలి.
- For technical issues regarding YSR Bima New Scheme Enrollment App, Please contact via email : support@progment.com, Phn:7731987581, 7731987582 & 9505394510.