వై.యస్.ఆర్ బీమా పథకము
వై.యస్.ఆర్ బీమా పథకము గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసిన వివరాలు:
- వై.యస్.ఆర్ బీమా : CMM లు అందరూ మీ వెల్ఫేర్ సెక్రటరీలతో ఒక మీటింగ్ పెట్టుకుని ఈ క్రింది విషయాలు వారికి, వారి ద్వారా వాలంటీర్లకు తెలియచేయండి…
- కొత్త వై.యస్.ఆర్ బీమా అమలు తేదీ జులై 1, 2021 (01-07-2021)…
- సర్వే ఎన్రోల్ మెంట్ సెర్ప్ వారు సమాచారం అందించిన వెంటనే ప్రారంభించాలి. 16 వ తేదీ జులై 2021 నుండి సర్వే ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి…
- 7 నుండి 10 రోజుల్లో తప్పనిసరిగా సర్వే పూర్తి చెయ్యాలి. ఇది చిట్ట చివరి అవకాశం…
- ఏ క్లస్టర్ లో సర్వే పెండింగ్ ఉంటే ఆ సంబంధిత సిబ్బంది ఆ జిల్లా కలెక్టర్ వారికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది…
- బీమా రెన్యువల్ యాప్ అందరూ వాలంటీర్లు రేపు ఉదయం 12 గంటల లోపు డౌన్లోడ్ చేసుకునే విధంగా చూడండి…
- బీమా కేవలం ఒక కుటుంబం లోని “Bread Earner” ఒక్కరికి మాత్రమే.(“Bread Earner” అనగా “కుటుంబాన్ని పోషించే వ్యక్తి,” అంతే కాని రైస్ కార్డ్ హోల్డర్ పేరు కాదు గమనించండి)…
- రైస్ కార్డ్ కలిగివున్న కుటుంబాన్ని తప్పనిసరిగా సందర్శించి, వారిని సంప్రదించి మాత్రమే “Bread Earner” (“కుటుంబాన్ని పోషించే వ్యక్తి,”) ని సెలెక్ట్ చెయ్యండి. తరువాత eKYC చెయ్యండి (తప్పనిసరి). తర్వాత నామినీ వివరాలు, నామినీ eKYC చెయ్యండి (అప్షనల్)
- మరణం సంభవించిన 30 రోజుల లోపు…
- 18 నుండి 50 : సహజ మరణం – ఒక లక్ష రూపాయలు…
- 18 నుండి 70 – ప్రమాదవశాత్తు మరణం – 5 లక్షల రూపాయలు…
- బీమా భద్రత బ్యాంకు లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామిని కి అందించడం జరుగుతుంది. 10 వేల రూపాయల తక్షణ సహాయం దహన సంస్కారాల నిమిత్తం మరణం సంభవించిన రోజే నామినికి అందించడం జరుగును…
- గతంలో ఉన్న బ్రెడ్ ఎర్నెర్ ను మార్పు చేసుకునే అవకాశం ఉన్నది గమనించండి…
- పాలసీదారుని వయస్సు ను నిర్దారించడం లో అత్యంత శ్రద్ద కనబరచవలెను…
- రేపటికల్లా సర్వే చేయవలసిన డేటా పుష్ చేస్తారు…
- వాలంటీర్లు చేసిన డేటా ను వెరిఫై చేయుటకు, “Bread Earner” ను ధృవీకరణ చేసి బయోమెట్రిక్ ద్వారా నిర్దారించడం కొరకు, వెల్ఫేర్ సెక్రెటరీ కి ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి బాధ్యత వెల్ఫేర్ సెక్రెటరీ కావున సమాచారాన్ని నిర్దారించడం లో శ్రద్ద వహించాలి…
- వయస్సు నిర్ధారించడం లో ఏమైనా తప్పులు జరిగితే ఆ పాలసీదారుని కి క్లెయిమ్ రాదు. ఆ సంబంధిత వెల్ఫేర్ సెక్రెటరీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును. వాలంటీర్ ను తొలగించబడును…
- ప్రజా సాధికార సర్వే మరియు వై.యస్.ఆర్ బీమా సర్వే డేటా ను పోల్చి చూసి, ఆధార్ మాచింగ్ అయ్యిన డేటా ను ఈ సంవత్సరం బిమాకు ఆటో రెన్యూవల్ చేస్తారు. మ్యాచ్ కాని డేటా మాత్రమే సర్వే కొరకు ఇస్తారు. కావున మన టార్గెట్ చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి…
Post Views: 16