వై.యస్.ఆర్ బీమా పథకము
రైస్ కార్డు ఉన్న కుటుంబాలలో Primary Bread Earner ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) దురదృష్టవశాత్తూ అనారోగ్యము లేదా ప్రమాదవశాత్తు అకాలా మరణానికి గురి అయినప్పుడు ఆ కుటుంబము తీవ్ర మనోవేదనకు గురి అవ్వటమే కాకుండా కుటుంబాన్ని పోషించే వ్యక్తి కష్తంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వటము జరుగుచున్నది.
అకాల మరణము లేదా అంగ వైకల్యము జరిగిన మరియు అన్నరోగ్యముతో కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాలకు ఆర్థికముగా సహాయము అందించి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందించి మనో దైర్యము కల్పించాలనేది “YSR BIMA” పథకం ముఖ్య ఉద్దేశ్యము.
గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెరి సగం చెల్లించేవి, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుండి వైదొలగి తన వాటాగా చెల్లించాల్సిన ప్రీమియం నిలిపివేయడం వలన రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వై.యస్.ఆర్ బీమా పథకం 2020-21 కొత్త పథకం ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రీమియం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
Nodal Agency:
Commissioner of Labour & Employeement Department – కార్మిక సంక్షేమం & ఉపాధి కల్పన శాఖ.
Implementing Agency ( క్షేత్ర స్థాయిలో అమలు పరిచే సంస్థ) :
ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. (YSR క్రాంతి పథం)
Department of Rural Development
వై.యస్.ఆర్ బీమా పథకములోని విశిష్టత :
ఇప్పటివరకు దేశములో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పేద నిరుపేదలు అయిన వారికి సామాజిక భద్రతే ధ్యేయంగా 1.50 కోట్ల మంది రైస్ కార్డ్ కుటుంబాలలో Primary Bread Earner ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) కి బీమా వర్తింప చేయబడుతుంది.
వై.యస్.ఆర్ బీమా పథకం ప్రయోజనాలు:
సభ్యుల వయస్సు | సహజ మరణం | ప్రమాదము వలన మరణం/పూర్తి అంగ వైకల్యం |
18-50 సంవత్సరాలు | రూ.2,00,000/- | రూ.5,00,000/- |
51-70 సంవత్సరాలు | 0 | రూ.3,00,000/- |
YSR బీమా పథకములో నమోదుకై అర్హతలు:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైస్ కార్డు కలిగి వున్నవారు.
- వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు.
- మాగాణి భూమి 2.5 ఎకరాలు లేదా మెట్టభూమి 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు.
YSR బీమాకు అర్హత లేనివారు:
- ఆదాయపు పన్ను చెల్లించేవారు
- PF & EPF చెల్లించేవారు
- గృహిణులు
- నిరుద్యోగులు
- విద్యార్థులు
- Beggars ( బిక్షాటన చేసేవారు)
- మతిస్థిమితం లేనివారు.
వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) చేయవలసిన కార్యక్రమములు:
- YSR బీమా నందు శిక్షణ పొందవలెను
- WEA పరిధిలోని వాలంటీర్స్ కు శిక్షణ ఇవ్వవలెను.
- Enrollment ప్రక్రియ సజావుగా జరిగేలా చుసుకొనవలెను.
- బ్యాంకర్స్ తో మాట్లాడి Primary Bread Earner ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి) కు జన్ ధన్ అకౌంట్ తెరిపించవలెను.
- అనంతరం బీమా క్లెయిమ్స్ రిజిస్టర్ కోసం డేటా ఎంటర్ చేసి జిల్లా సమాఖ్య కాల్ సెంటర్ కు బదిలీ చేయవలెను.
గ్రామ/వార్డు వాలంటీర్ చేయవలసిన పనులు:
- YSR బీమా కార్యక్రమముపై శిక్షణ తీసుకోవలెను.
- వాలంటీర్ తన స్మార్ట్ ఫోన్ లో వై.యస్.ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకోవలెను.
- వాలంటీర్ YSR బీమా మొబైల్ అప్లికేషన్ తో రైస్ కార్డు హోల్డర్ ఇంటివద్దకు వెళ్లి వారి యొక్క రైస్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంకు ఖాతాలను Verify చేయవలెను.
- కుటుంబ సభ్యులతో మాట్లాడి “Primary Bread Earner” ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి) ని ఎంపిక చేయవలెను.
బీమా 2020-21 కొత్తగా నమోదు కార్యక్రమములో Primary Bread Earner ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి) గుర్తించు విధానము:
- చాలా కుటుంబాలలో రైస్ కార్డు లో Head of the House Hold గా మహిళలు ఉన్నారు. కానీ ఇంటిలో సంపాదించే వ్యక్తిగా భర్త ఉంటున్నారు. ఆ కుటుంబంలో భర్తను సంపాదన పరుడుగా ( Bread Earner గా ) ఉంటాడు. భార్యగాని పిల్లలుగాని లేదా వృద్ధులు అయిన తల్లి తండ్రి గాని నామినిగా ఉంటారు.
- కొన్ని కుటుంబాలలో భర్త చనిపోయి కొడుకుపై కుటుంబం ఆధారపడి ఉంటుంది. కొడుకు ( Bread Earner గా ) ఉంటాడు. ఇక్కడ అతని భార్య కాని, పిల్లలుగాని లేదా ఆమె కాని నామినిగా ఉంటారు.
- కొన్నిచోట్ల భర్త చనిపోయి మహిళే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆమె ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) గా ఉంటుంది పిల్లలు గాని లేదా వృద్ధులు అయిన కుటుంబ సభ్యులు కాని నామినిగా ఉంటారు.
- అక్కడక్కడ భర్త వికలాంగుడు అయితే భార్యే సంపాదిస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో భార్యే ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) గా ఉంటుంది. పిల్లలుగాని లేదా భర్తగాని నామినిగా ఉంటారు.
- కొన్ని ఉమ్మడి కుటుంబాలలో ఇద్దరు లేదా ముగ్గురు కుడా సంపాదన పరులు ఉంటారు.వారిలో ఎవరిని కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఆ కుటుంబం నిర్ణయించుకుంటే మంచిది. నామినిగా కుడా ఎవరు ఉండాలని వారే నిర్ణయించుకుంటారు.
- అరుదుగా కుటుంబంలో ఒక్క మహిళ గాని లేదా ఒక్కడే పురుషుడు గాని ఉంటారు వారే కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉంటారు కాని వీరికి నామినీ గా Legal Heir ఉంటారు.
- ఒక కుటుంబంలో భర్త మరియు భార్య ఇద్దరూ కూలీ చేసుకుంటూ ఉన్నారు అందులో ఎవరు కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా పెట్టాలి అనేది వారి కుటుంబం నిర్ణయించుకుంటుంది. సహజంగా భర్త ఉంటాడు నామినిగా లైఫ్ పార్టనర్ గాని పిల్లలు గాని ఉంటారు.
- సదరు ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి) తనకి ఇష్టమైన కుటుంబ సభ్యులను నామినిగా నియమించుకోవలెను.
- “Primary Bread Earner” ( కుటుంబాన్ని పోషించే వ్యక్తి) వివరములు YSR బీమా మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయవలెను.
కుటుంబాన్ని పోషించే వ్యక్తి జనధన్ అకౌంట్ ఈ కింద ఇవ్వబడిన వివరములు నమోదు చేయవలెను.
- బ్యాంకు అకౌంట్ నెంబర్
- IFSC కోడ్
నామిని ఈ క్రింది విధంగా నమోదు చేయవలెను.
- భార్య/భర్త లేదా పిల్లలు , వీరిపై ఆధారపడినవారు.
- ఒకవేళ నామిని మైనర్ అయితే సంరక్షకుని నియమించాలి మైనర్ తరపున వారు వచ్చిన లబ్దిని వారి సంరక్షణలో ఉంచుతారు.
- నామిని యొక్క SB A/c Details సాధారణ ఖాతా మరియు IFSC కోడ్ వివరములు నమోదు చేయాలి.
10. Primary Bread Earner మరియు నామిని యొక్క వివరములు డేటా ఎంట్రీ చేసిన తరువాత , బయోమెట్రిక్ Authentication వారి ఇరువురి నుండి తప్పనిసరిగా తీసుకోవలెను.
11. YSR బీమా మొబైల్ అప్లికేషన్ నందు Primary Bread Earner తో Aadhar eKYC తప్పనిసరిగా చేయించవలెను.
12. వై.యస్.ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేసిన వివరములు తప్పనిసరిగా SAVE చేయవలెను.
13. వాలంటీర్ SAVE చేసిన తరువాత ఆ డేటా బీమా వెబ్ సైట్ కు చేరుతుంది. ( YSR Bima )
14. వాలంటీర్ సంబంధిత Primary Bread Earner కు బ్యాంకు ఖాతా లేనియెడల ఆటను/ఆమెకు జనధాన్ ఖాతాను తెరిపించవలెను. అంతటితో నమోదు కార్యక్రమములో వాలంటీర్ యొక్క భాద్యత పూర్తవుతుంది.
15. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” YSR బీమా “ Identity Cards ను పాలసీదారులకు పంపిణీ చేస్తుంది.
YSR బీమా క్లెయిమ్ ప్రక్రియ : పాలసీదారు మరణించిన తరువాత చేయవలసిన పనులు :
మరణించిన తరువాత కుటుంబ సభ్యులు కానీ వాలంటీర్ కానీ పాలసీదారు యొక్క వివరాలు WEA/YSR Bima Facilitattion Centers కు నమోదు కొరకు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయాలి.
మరణ నమోదు ప్రక్రియ రెండు రకాలు:
- Village Secretariat
- YSR Bima Facilitattion Centers ( జిల్లా సమాఖ్య కాల్ సెంటర్)
1. Village Secretariat :
మరణించిన వ్యక్తియొక్క వివరములు గ్రామ/వార్డు వాలంటీర్.కుటుంబ సభ్యులు/ఇతరులు ఎవరైనా Village/Ward Secretariat లో ఉన్న WEA కు ఫోన్ ద్వారా తెలియజేయవలెను.WEA డేటా ఎంట్రీ చేసి YSR Bima Facilitattion Centers ( జిల్లా సమాఖ్య కాల్ సెంటర్) కు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ కొరకు పంపిస్తారు.
2.YSR Bima Facilitattion Centers ( జిల్లా సమాఖ్య కాల్ సెంటర్) :
మరణించిన వ్యక్తియొక్క వివరములు బీమా మిత్ర/వాలంటీర్/ కుటుంబ సభ్యులు/ఇతరులు ఎవరైనా కాల్ సెంటర్ కు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి మరణించిన వ్యక్తి యొక్క సమాచారం అందిస్తారు. టెలిఫోన్ ఆపరేటర్ వివరములు రాసుకొని మరలా కన్ఫర్మేషన్ కొరకు WEA/వాలంటీర్/బీమా మిత్రల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తరువాత క్లెయిమ్ రిజిస్త్రేషన్ చేయడం జరుగుతుంది.
Insurance కంపెనీ కు క్లెయిమ్ వివరములు సమర్పించుటకు కావలసిన పత్రములు:
- క్లెయిమ్ రిజిస్త్రేషన్ అయిన తరువాత క్లెయిమ్ ఐ.డి. వస్తుంది.
- బీమా మిత్ర Login నుండి క్లెయిమ్ ఐ.డి. ద్వారా క్లెయిమ్ ఫారం డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి వాటిపై నామిని మరియు సాక్షి సంతకం తీసుకోవాలి.
సహజ మరణము పొందిన వారు సమర్పించవలసిన పత్రములు:
- క్లెయిమ్ ఫారం
- Enrollament పత్రం బ్యాంకు నుండి పొందవలెను.
- ప్రీమియం insurance కంపెనీ కు బదిలీ అయినట్టు బ్యాంకు స్టేట్ మెంట్ పొందవలెను.
- బీమా మిత్ర నివేదిక (రిపోర్ట్)
- చనిపోయిన వ్యక్తి ఆధార్.
- నామినీ ఆధార్.
- డెత్ సర్టిఫికేట్
- నామినీ సేవింగ్ బ్యాంకు అకౌంట్ ( జనధాన్ అకౌంట్ పనికిరాదు)
- మరియు నామినీ డిశ్చార్జ్ రసీదు.
ప్రమాద మరణం క్లెయిమ్ కొరకు అవసరం అయిన పత్రాలు:
- సహజ మరణమునకు తెలియ చేసిన పత్రాలకు అదనంగా
- ఎఫ్.ఐ.ఆర్.
- శవ పంచనామా
- శవ పరీక్ష నివేదిక / పోస్తుమార్టం
- పోలీస్ ఫైనల్ రిపోర్ట్ (అనుమానాస్పద ప్రమాదాలలో)
- పోలీస్ శాఖ వారు , వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు ఈ పత్రాలన్నీ ఆన్ లైన్ లో పంపిస్తారు.
ప్రమాదం వలన కలిగిన అంగవైకల్యం క్లెయిములకు అవసరం అయిన పత్రాలు:
- క్లెయిమ్ దరఖాస్తు పత్రము (బీమా మిత్ర దగ్గర లభించును)
- పాలసీదారుని యొక్క ఆధార్ కార్డు
- FIR – కంప్లైంట్ లెటర్
- హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరి
- Hospital Wounded Certificate
- సదరం సర్టిఫికేట్
- CNS క్వస్చనీర్ ( బీమా మిత్ర/కాల్ సెంటర్ వారు ఇస్తారు).
- పాలసీదారుని సంతకంతో డిశ్చార్జ్ ఫారం
- పాలసీదారుని బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్ కాపీ.
డాకుమెంట్స్ అన్నీ పొందిన తరువాత చేయవలసిన పని:
- క్లెయిమ్ కు సంబంధించిన పత్రములు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా సరి చూసుకోవాలి.
- డాకుమెంట్స్ అన్ని స్కాన్ చేసి వాటిని లాగిన్ ద్వారా YSR Bima Website నందు అప్ లోడ్ చేయాలి.
- Upload తర్వాత క్లెయిమ్స్ అన్ని కాల్ సెంటర్ లోని కంప్యూటర్ ఆపరేటర్ చెక్ చేసి కరెక్ట్ గా ఉంటె క్లెయిమ్స్ ని ఫార్వార్డ్ చేస్తారు.
- APM & కాల్ సెంటర్ అకౌంటెంట్ అప్ లోడ్ చేసిన డాకుమెంట్ కరెక్ట్ గా ఉందా అని చెక్ చేసి వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేస్తారు.
- అప్ లోడ్ అయిన డాకుమెంట్స్ ను Website service provider వాటిని తీసి సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అందిస్తారు.
- కరెక్ట్ గా ఉన్న క్లెయిమ్ లు ఇన్సూరెన్స్ వారు సెటిల్ చేస్తారు. డాకుమెంట్స్ కరెక్ట్ గా లేకపోయిన ఇంకా ఇతర సమాచారము కావాల్సిన Requirements కోసం వెనక్కి పంపిస్తారు.
- Not eligible అయితే పర్మనెంట్ గా రిజెక్ట్ చేస్తారు.
క్లెయిమ్ మంజూరు అయిన తరువాత చేయవలసిన పనులు:
- క్లెయిమ్ మంజూరు అనంతరం గౌరవ ముఖ్య మంత్రివర్యుల సందేశం ను సంబంధిత గౌరవ శాసన సభ్యుల ద్వారా నామినీ కు అందజేయవలెను.
- YSR బీమా లబ్దిదారుల విజయగాధ (కేస్ స్టడీ) ను తయారు చేయవలెను.