వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి లబ్దిపొందని వారికి మరో అవకాశం:
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో,ట్యాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ లు సొంతంగా కలిగివున్న డ్రైవర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి విడతలో లబ్దిపొందని వారికి రెండో విడత కింద జూలై 15 న వీరికి ఆర్థిక సహాయం అందనుంది.కొత్తవారు జూలై 6 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
వివిధ కారణాలతో దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం కల్పిస్తూ రవాణా శాఖా ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులను జారీచేశారు. మొదటి విడతలో లబ్దిపొందని వారు జూలై 6 వ తేదీలోగా తమ పరిధిలో ఉన్న గ్రామ / వార్డు సచివాలయముల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను ఎం.పి.డి.ఒ మరియు మునిసిపల్ కమీషనర్లు జూలై 8 వ తేదీ లోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను జూలై 10 వ తేదీ లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు సమర్పిస్తారు. కలెక్టర్లు వాటిని పరిశీలించి అర్హులైన వారి జాబితాను జూలై 12 వ తేదీ లోగా సంబంధిత కార్పోరేషన్ ఎండీ లకు పంపిస్తారు.
- వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అప్లై చేయటానికి చివరితేది జూలై 6.
- ఎం.పి.డి.ఒ మరియు మునిసిపల్ కమీషనర్లు వచ్చిన దరఖాస్తులను పరిశీలన జూలై 8.
- ఎం.పి.డి.ఒ మరియు మునిసిపల్ కమీషనర్లు తుది జాబితా పరిశీలన జూలై 10.
- కలెక్టర్లు పరిశీలించి అర్హులైన వారి జాబితాను సంబంధిత కార్పోరేషన్ ఎండీ లకు జూలై 12 న పంపిస్తారు.
- వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత ఆర్థికసాయం జూలై 15 న అందనుంది.