ysr-vahanamitra-ii-phase

YSR Vahanamitra Scheme II Phase Apply | Last Date July 6 |

వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి లబ్దిపొందని వారికి మరో అవకాశం:

             వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో,ట్యాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ లు సొంతంగా కలిగివున్న డ్రైవర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి విడతలో లబ్దిపొందని వారికి రెండో విడత కింద జూలై 15 న వీరికి ఆర్థిక సహాయం అందనుంది.కొత్తవారు జూలై 6 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

AP EAPCET 2026 Counseling dates, web options process, and document verification complete details
AP EAPCET 2026 Counseling Complete Details

వివిధ కారణాలతో దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం కల్పిస్తూ రవాణా శాఖా ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులను జారీచేశారు. మొదటి విడతలో లబ్దిపొందని వారు జూలై 6 వ తేదీలోగా తమ పరిధిలో ఉన్న గ్రామ / వార్డు సచివాలయముల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను ఎం.పి.డి.ఒ మరియు మునిసిపల్ కమీషనర్లు జూలై 8 వ తేదీ లోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను జూలై 10 వ తేదీ లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు సమర్పిస్తారు. కలెక్టర్లు వాటిని పరిశీలించి అర్హులైన వారి జాబితాను జూలై 12 వ తేదీ లోగా సంబంధిత కార్పోరేషన్ ఎండీ లకు పంపిస్తారు.

thalliki-vandanam-2026-2
Thalliki Vandanam Latest Release Date-2026
  • వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అప్లై చేయటానికి చివరితేది జూలై 6.
  • ఎం.పి.డి.ఒ మరియు మునిసిపల్ కమీషనర్లు వచ్చిన దరఖాస్తులను పరిశీలన జూలై 8.
  • ఎం.పి.డి.ఒ మరియు మునిసిపల్ కమీషనర్లు తుది జాబితా పరిశీలన జూలై 10.
  • కలెక్టర్లు పరిశీలించి అర్హులైన వారి జాబితాను సంబంధిత కార్పోరేషన్ ఎండీ లకు  జూలై 12 న పంపిస్తారు.
  • వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత ఆర్థికసాయం జూలై 15 న అందనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top