ysr-nethanna-nestham-scheme-in-telugu

YSR Nethanna Nestham Scheme in Telugu

వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పథకం యొక్క మార్గదర్శకాలు

లక్ష్యం:

చేనేత కార్మికులు వారి పరికరాలను మెరుగుపరుచుకోవడానికి మరియు పవర్ లూమ్ రంగానికి చెందిన ఉత్పత్తులతో పోటీ పడటానికి ప్రభుత్వం ప్రతి చేనేత కుటుంబానికి రూ.24,000 /- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది.

అర్హతలు:

  1. వాస్తవానికి ప్రతి చేనేత కార్మికుడు సొంత మగ్గం కలిగి ఉండి దాని పై పని చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు
  2. కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గములు ఉన్న ఒక్క చేనేత మగ్గం వరకు మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది.
  3.  చేనేత కుటుంబము దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే లబ్ధి పొందుతారు .
  4. చేనేత కుటుంబము దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  5. ప్రాథమిక చేనేత సంఘముల మరియు మాస్టర్ వీవర్ల షెడ్లలో పనిచేయుచున్న చేనేత కార్మికులు ఈ పథకానికి అనర్హులు
  6. చేనేత అనుబంధ వృత్తులలో పనిచేయు కార్మికులు ఈ పథకం ద్వారా సహాయం పొంది అనర్హులు. (ఉదాహరణ :నూలు వడికే వారు, పడుగు తయారు చేయువారు, అద్దకం పని వారు, అచ్చులు అతికే వారు మొదలైనవారు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

  1. అర్హత కలిగిన చేనేత కార్మికులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కుల మరియు బియ్యం కార్డు/ రేషన్ కార్డు నకలు పత్రములను జతచేసి దరఖాస్తును గ్రామ మరియు  వార్డు సచివాలయములలో స్వయంగా గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ ద్వారా గాని సమర్పించవలెను.
  2. అర్హులైన దరఖాస్తుదారునికి YSR( Your Service Request – మీసేవ అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
  3. దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ.24,000 /- ఒకసారి మంజూరు చేసి వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూర్చబడుతుంది.

వై.యస్.ఆర్ నేతన్న నేస్తం షెడ్యూల్:

  • జూన్ 06 : గ్రామ వార్డు సచివాలయం లో ఉన్న 2020 21 సంవత్సరం లబ్ధిదారుల జాబితాను తీసుకోవాలని ఆదేశం జూన్ 28 నుండి జూలై 5వ తేదీ వరకు: కొత్తగా అర్హులైన వారి పేర్లను గ్రామ/ వార్డు సచివాలయాల్లో పరిశీలన.
  • జూలై  6 నుండి 8 లోపు : గ్రామ/ వార్డు సచివాలయాల్లో అర్హులైన నేతన్నల జాబితాల ప్రదర్శన.
  • జూలై 9,10 తేదీల్లో: సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు పంపడం జరుగుతుంది.
  • జూలై 11 నుంచి 14 లోపు: అర్హుల జాబితా ఆమోదం, తిరస్కరణ వివరాలు పూర్తి చేయాలి.
  • జూలై 15 నుంచి 18 లోపు: జిల్లా స్థాయిలో హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్లకు పంపించాలి.
  • జూలై 19 నాటికి :  జాబితాను పరిశీలించి కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను తయారు చేయాలి.
  • జూలై 20 నుంచి 22 లోపు:  జిల్లాల స్థాయిలో అర్హుల జాబితా ఖరారు చేయాలి.
  • జూలై 23 : తుది జాబితాను హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్  డైరెక్టర్లకు అందజేయాలి.
  • జూలై 24 : అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది.

వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పథకానికి కావలసిన డాక్యుమెంట్స్:

  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • స్టేట్ హ్యాండ్లూమ్ అసోసియేషన్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

1 thought on “YSR Nethanna Nestham Scheme in Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top