ysr kapu nestham 2021

YSR Kapu Nestham Scheme in Telugu

వై.యస్.ఆర్ కాపు నేస్తం పథకము మార్గదర్శకాలు:

పథకం యొక్క ఉద్దేశం:

కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం.

ప్రయోజనాలు:

  1. అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం.
  2. మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం

అర్హతలు :                 

  1. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/-   లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12,000/-  వేల లోపు ఉండాలి.
  2. కుటుంబానికి గరిష్ఠంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించరాదు.
  3. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు, ఆటో, టాటాఏస్, ట్రాక్టర్ వంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చును.
  4. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే.

 అనర్హతలు:

  1. కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు.
  2. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
  3. కుటుంబంలో ఎవ్వరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
  4. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు.
  5. కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అర్హులు కాదు.

కావలసిన పత్రాలు:

  1. ఆధార్ కార్డు
  2. కుల దృవీకరణ పత్రం
  3. ఆదాయ ధ్రువీకరణ పత్రం
  4. నివాస ధ్రువీకరణ పత్రం
  5. వయసు నిర్ధారణ పత్రం

ఇతర వివరములు:

  • డబ్బులు ఖాతాలో పడగానే లబ్ధిదారుల ఫోను కు సందేశం వస్తుంది.
  • ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేని వారు ఉంటే గ్రామ /వార్డు సచివాలయాని కి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కూడా తప్పనిసరిగా ఆర్థిక సాయం అందిస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top