వై.యస్.ఆర్ కాపు నేస్తం పథకము మార్గదర్శకాలు:
పథకం యొక్క ఉద్దేశం:
కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం.
ప్రయోజనాలు:
- అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం.
- మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం
అర్హతలు :
- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12,000/- వేల లోపు ఉండాలి.
- కుటుంబానికి గరిష్ఠంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించరాదు.
- పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు, ఆటో, టాటాఏస్, ట్రాక్టర్ వంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చును.
- కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే.
అనర్హతలు:
- కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
- కుటుంబంలో ఎవ్వరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
- ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు.
- కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అర్హులు కాదు.
కావలసిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- కుల దృవీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- వయసు నిర్ధారణ పత్రం
ఇతర వివరములు:
- డబ్బులు ఖాతాలో పడగానే లబ్ధిదారుల ఫోను కు సందేశం వస్తుంది.
- ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేని వారు ఉంటే గ్రామ /వార్డు సచివాలయాని కి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కూడా తప్పనిసరిగా ఆర్థిక సాయం అందిస్తారు.
Post Views: 16