YSR-Bima-Scheme-Telugu

YSR Bima Scheme Latest Guidelines Released

వై.యస్.ఆర్ బీమా పథకము తాజా మార్గదర్శకాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయినప్పుడు వెంటనే ఆదుకునే విధంగా మరో అడుగు ముందుకు వేసింది.

                  18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి (కుటుంబాన్ని పోషించే వ్యక్తి) సహజ మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు నామినీకి రూ.1 లక్ష రూపాయల పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ తో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే చెల్లించనుంది.ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు.ఏ.పీ. సీఎం గౌ.శ్రీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

                   వై.యస్.ఆర్ బీమా పథకానికి సంబంధించి ప్రభుత్వం GO.Ms.No.7 లో మార్గదర్శకాలు విడుదల చేశారు.ఈ నిబంధనలు 1 జూలై  2021 నుంచి అమల్లోకి రానున్నాయి.

వై.యస్.ఆర్ బీమా పథక నిబంధనలు:

  • 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి (కుటుంబాన్ని పోషించే వ్యక్తి) సహజ మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు నామినీకి రూ.1 లక్ష రూపాయల పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ తో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే చెల్లించనుంది.
  • 18 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యం పొందిన వారికి రూ.5,00,000/- లక్షల ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • వై.యస్.ఆర్ బీమా పథకానికి నోడల్ ఏజెన్సీగా కార్మిక శాఖ, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా గ్రామ / వార్డు సచివాలయాల విభాగం పనిచేస్తుంది.
  • బీమా పరిధిలోకి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు ఈ పథకము వర్తిస్తుంది. ఈ పథకం నుంచి కేంద్రం ప్రభుత్వం వైదొలిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తుంది. అయినప్పటికీ బీమా కంపెనీలు బ్యాంకుల ద్వారా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా వై.యస్.ఆర్ బీమా పథకంలో మార్పులు చేయాలని ఆ మేరకే అధికారులు చర్యలు తీసుకున్నారు.

వై.యస్.ఆర్ బీమా తాజా మార్గదర్శకాలు:

  1. లబ్ధిదారులను గుర్తించడం కోసం గ్రామ /వార్డు సచివాలయాలా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సర్వే చేస్తారు. లబ్ధిదారులను నిర్ధారించే అధికారం (రిజిస్టరింగ్ అధారిటీ) వెల్ఫేర్ అసిస్టెంట్ కు ఇస్తారు.ఈ జాబితాను కార్మిక శాఖ పరిశీలిస్తుంది.
  2. వై.యస్.ఆర్ బీమా పథకము వర్తించాలంటే 18 ఏళ్ల పైన 70 ఏళ్ల లోపు వారు, దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. అతను లేదా ఆమె కుటుంబ పోషణ చేసే వారై ఉండాలి.
  3. వయసు నిర్ధారణ విషయంలో నోడల్ ఏజెన్సీ సంతృప్తి చెందాలి.
  4. ప్రతి గ్రామ /వార్డు సచివాలయం లో వై.యస్.ఆర్ బీమా పథక రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుంది.
  5. లబ్ధిదారుల నమోదుకు సంబంధించిన ఫిర్యాదులను డి.ఆర్.డి.ఎ పీడీ పరిష్కరిస్తారు.
  6. సహజ మరణం చెందిన వారికి ఇచ్చే రూ.1,00,000/- లక్ష రూపాయలు చట్టబద్ధమైన వారసుడికి చెందే విషయమై గ్రామ /వార్డు వాలంటీర్లే పర్యవేక్షణ చేస్తారు.
  7. బీమా పథకంలో ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం గుర్తించే విషయంలో గ్రామ/ వార్డు సేక్రటేరియట్ పర్యవేక్షణ చేస్తుంది.
  8. జిల్లా స్థాయిలో ఈ పథకాన్ని జాయింట్ కలెక్టర్లు నిశితంగా పరిశీలించారు.
  9. కుటుంబాన్ని పోషించే వ్యక్తి  మరణించిన 15 రోజుల నుంచి 30 రోజుల లోపు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
  10. నామినీ లేదా వారసులకు చెల్లింపులు ఆన్ లైన్ ద్వారా బ్యాంకు ఖాతాకు( Direct Benefit Transfer- DBT ) ద్వారా జమ చేస్తారు.
  11. ఈ పథకము యొక్క పర్యవేక్షణను జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్టు డైరెక్టర్ కన్వీనర్ గా ఉంటారు. మరో ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు.
  12. అదే విధంగా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి కార్మిక ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా మరో తొమ్మిది మంది వివిధ విభాగాల కమీషనర్లు, డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top