ap-schemes-calendar-2021

AP Government Welfare Schemes Calendar 2021

ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ 2021 – 22

2021 ఏప్రిల్ నెలలో::

  • జగనన్న వసతి దీవెన మొదటి విడత విద్యార్థుల వసతి, భోజనం ఖర్చులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.
  • జగనన్న విద్యా దీవెన మొదటి విడత విద్యార్థుల ఫీజులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. 2019 రబీకి రైతులు తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు.
  • పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు.

2021 మే నెల::

  • రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా ( 2020 ఖరీఫ్ ) రుణాలను చెల్లిస్తారు.
  • మొదటి విడత వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
  • మత్స్యకార భరోసా ( వేట నిషేధ సబ్సిడీ )ని అందిస్తారు.
  • మత్స్యకార భరోసా ( డీజిల్ సబ్సిడీ) ని అందిస్తారు.

జూన్ నెలలో::

  • జగనన్నతోడు పథకం ద్వారా గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చిరు వ్యాపారి కి సున్నా వడ్డీకే 10 వేల రూపాయల రుణాన్ని ఇప్పించనున్నారు.
  • వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్ ఉన్నవారికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
  •  వైఎస్సార్ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఈ ఏడాదికి గాను 18,750/- రూపాయల నగదుని బదిలీ చేస్తారు.

జులై నెలలో::

  • జగనన్న విద్యా దీవెన రెండవ విడత విద్యార్థుల ఫీజులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఈ ఏడాదికి గాను 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
  • జగనన్న విద్యా కానుకగా స్కూలు పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, బెల్టు, షూ, సాక్సులను మరియు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ని అందజేస్తారు.

ఆగస్టు నెలలో::

సెప్టెంబర్ నెలలో::

  • వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలను నేరుగా వారికే చెల్లించనున్నారు.

అక్టోబర్ నెలలో::

  • వైఎస్సార్ రైతు భరోసా రెండవ విడత సాయాన్ని అందిస్తారు.
  • జగనన్న చేదోడు పథకం ద్వారా నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

నవంబర్ నెలలో::

  • వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణాల్లోని 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు పేద మహిళలకు ఏటా 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని మూడేళ్లపాటు చెల్లించనున్నారు.

డిసెంబర్ నెలలో::

  • జగనన్న వసతి దీవెన రెండవ విడత విద్యార్థుల వసతి, భోజనం ఖర్చులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.
  • జగనన్న విద్యా దీవెన మూడవ విడత విద్యార్థుల ఫీజులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.
  • వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా జూనియర్ లాయర్లకు ప్రతినెలా రూ5,000/- చొప్పున అందించే ఆర్థిక సాయాన్ని ఈ ఏడాదికి సంబంధించి అందిస్తారు.

2022 జనవరి నెలలో::

  • వైఎస్సార్ రైతు భరోసా మూడవ విడత ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
  • జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే పేద తల్లులకు ఈ సంవత్సరానికి గాను 15 వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు ల్యాప్ టాప్ కోరిన విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇవ్వడం జరుగుతుంది. సామాజిక పింఛన్లను నెలకు రూ.2,500/- రూపాయలు గా పెంచనున్నారు.

2022 ఫిబ్రవరి నెలలో::

గమనిక: ఇవి కాకుండా నిరంతరాయంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్ కానుక మొదలైన పథకాలు అమలవుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top