volunteers-notification-ap

Grama/Ward Volunteers Notification in Kurnool District

కర్నూల్ జిల్లా నోటిఫికేషన్ నెం.818/2019
             గ్రామ వాలంటీర్ల ఎంపిక               

             ప్రభుత్వం ద్వారా అందించే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకములను మరియు నవరత్నాలను ప్రజల చేరువ కు తీసుకువెళ్లే బాధ్యత గ్రామ పంచాయతీల పై ఉన్నది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించుట కొరకు గ్రామ పంచాయతీలు గ్రామ వాలంటీర్లను నియమించుటకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు గ్రామ పంచాయతీలకు మధ్య అనుసంధాన కర్తలు గా పనిచేయుటకు అర్హులైన ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకొనవచ్చును ఈ అనుసంధాన కర్తలు గ్రామ/వార్డు వాలంటీర్లు గా పిలువ బడతారు. గ్రామ/వార్డు వాలంటీర్లు సమాజసేవ దృక్పథంతో పనిచేయవలెను.

              కర్నూలు జిల్లాలో ప్రస్తుతము సుమారు 352 మంది గ్రామ వాలంటీర్ల మరియు 131 మంది వార్డు వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుండి తేదీ: 14.06.2021 నుండి 16.06.2021 వరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

దరఖాస్తు రుసుము లేదు.

గ్రామ వార్డు వాలంటీర్ల విధులు:

  • గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబములను గ్రామ పంచాయతీతో/ వార్డును అనుసంధానము చేసి, ప్రభుత్వ పథకముల లబ్ధిని వారి ఇంటి దగ్గరకు ఎప్పటికప్పుడు చేరవేయవలెను.
  • కుటుంబాల సమస్యను గ్రామ పంచాయితీ/ వార్డుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలెను. గ్రామ /వార్డు వాలంటీర్లు ఫలాపేక్షణ లేకుండా విధులు నిర్వర్తించినందుకు గాను పనితీరు ఆధారంగా గౌరవ వేతనం గరిష్టంగా రూ.5,000/- నెలకి ఇవ్వబడును.

అర్హతలు:

  • దరఖాస్తుదారు పదవ తరగతి లేదా తత్సమానమైన పరీక్షలలో ఉత్తీర్ణుడై ఉండవలెను.
  • గిరిజన ఏజెన్సీ ప్రాంతములలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే.
  •  గ్రామ /వార్డు వాలంటీర్లు గా ఏ పంచాయతీ /వార్డు నందు పని చేయవలెనని ఆశిస్తారో వారు ఆ గ్రామ పంచాయతీ /వార్డు కు చెందిన వారై ఉండాలి.
  • తేదీ 11.06.2021 నాటికి 18 సంవత్సరములు నిండిన వారై, 35 సంవత్సరములు దాటని వారై ఉండాలి.
  • నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
  • మహిళలకు దాదాపు 50% శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
  • క్రమశిక్షణతో మెలుగుతూ, నిజాయితీగా సేవ చేయదలచిన, నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేయవచ్చును.

దరఖాస్తు చేయు విధానము:

  • ప్రతి మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ /వార్డు వాలంటీర్ ఎంపిక చేయబడును. ఈ పనిని మండల /నగర స్థాయి కమిటీ నిర్వహించును, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు https://gswsvolunteer.apcfss.in/ అనే వెబ్సైటు ద్వారా  ఆన్లైన్ నందు అప్లై చేయవచ్చును.
  • దరఖాస్తుతోపాటుగా ఆధార్ నెంబరు, విద్యార్హతల ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము తదితర ధృవీకరణ పత్రములను సమర్పించవలెను.

అర్హత కలిగిన దరఖాస్తు దారులందరికీ ఈ క్రింద తెలిపిన అంశములపై మౌఖిక పరీక్ష నిర్వహించి తద్వారా గ్రామ /వార్డు వాలంటీర్లు గా ఎంపిక చేయబడును.

  • ప్రభుత్వ పథకములు మరియు కార్యక్రమాలు, సంక్షేమ పథకముల పై అభ్యర్థుల అవగాహన.
  • సామాజిక సమస్యలు మరియు వారు నివసించే ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు.
  • NGOs /సాంఘిక కార్యక్రమములలో /సంస్థలలో అభ్యర్థులకు గల అనుభవము పై.
  • నాయకత్వపు లక్షణములు మరియు భావవ్యక్తీకరణ నైపుణ్యముపై
  • అభ్యర్థి వ్యక్తిత్వము మరియు సేవ చేసే సామర్ధ్యము పై.

ఈ క్రింద తెలిపిన కాల నియతి ప్రకారము గ్రామ /వార్డు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

వ.నెం.                                    విషయము               తేదీలు
   1నోటిఫికేషన్ జారీ చేయు తేదీ11.06.2021
   2దరఖాస్తుల స్వీకరణ14.06.2021 నుండి
 16.06.2021 వరకు
   3దరఖాస్తుల పరిశీలన17.06.2021
   4మౌలిక పరీక్ష 18.06.2021
   5వాలంటీర్లుగా ఎంపికైన వివరములు తెలియజేయు తేదీ19.06.2021
   6 శిక్షణ తరగతులు21.06.2021
   7వాలంటీర్లు పనిచేయుట ప్రారంభించు తేదీ22.06.2021

▶ ఇతర వివరములకై సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి /మున్సిపల్ అధికారి వారిని సంప్రదించవలెను.  

1 thought on “Grama/Ward Volunteers Notification in Kurnool District”

  1. Bro downside lo menu ala add chasaru bro home, WhatsApp, telegram.

    Meru Anni Plugin use chastaru avi aavi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top