jagananna-thodu-faqs-telugu

Jagananna Thodu Scheme FAQs


Warning: Trying to access array offset on value of type bool in /home/u833945783/domains/gramavolunteers.com/public_html/wp-content/plugins/sitespeaker-widget/sitespeaker.php on line 13

జగనన్న తోడు పథకము ప్రశ్నలు-సమాధానాలు

జగనన్న తోడు పథకం అనగానేమి?

సాంప్రదాయ వృత్తిదారులకు, చిరు వ్యాపారులకు బ్యాంకు ద్వారా రూ.10,000/- ఋణ సహాయం అందించే పథకము..

చిరువ్యాపారులు అనగా ఎవరు?

ఫుట్ పాత్ లపై పండ్లు, కూరగాయలు అమ్మే వారు, తోపుడు బండ్లు లేదా ఆటోలలో వస్తువులు అమ్మే వారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, ఫుట్ పాత్ లపై ఆహార పదార్థాలు అమ్మేవారు, తల మీద గానీ, భుజం మీద గానీ బుట్టలు పెట్టుకొని అమ్మేవారు... వీరందరినీ చిరువ్యాపారులు అంటారు.

సాంప్రదాయ వృత్తిదారులు ఎవరు?

యంత్రాల సహాయం లేకుండా చేతులతో, నాణ్యమైన పదార్థాలతో అత్యంత నైపుణ్యంతో వస్తువులను తయారు చేసే వారిని సాంప్రదాయ వృత్తిదారులు అంటారు. ఉదాహరణకు లేసులు తయారీదారులు, కలంకారీ కళాకారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ దారులు, తోలు బొమ్మల తయారీ దారులు, కుండలు,బొబ్బిలి వీణలు, ఇత్తడి సామాగ్రి తయారీదారులు.

ఈ పథకం ద్వారా ఎంత ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది?

పెట్టుబడి కోసం వడ్డీ లేకుండా రూ.10,000/- వేల రూపాయలు బ్యాంకు ఋణం ఇవ్వబడుతుంది.

వడ్డీని ఎవరు చెల్లిస్తారు?

నెలసరి కంతులను క్రమం తప్పకుండా కట్టే లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వడ్డీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

ఋణ మొత్తాన్ని ఎప్పటి లోపల చెల్లించాల్సి ఉంటుంది?

ఋణాన్ని తిరిగి చెల్లించడానికి గడువు ఒక సంవత్సరం ఉంటుంది.

ఎవరెవరు ఈ పథకానికి అర్హులు ?

చిన్న తరహా వ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారులు ఈ క్రింద పేర్కొన్న నిబంధనలకు అర్హులు. 1. 18 సంవత్సరాలు దాటి ఉండాలి 2. గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం రూ.10,000/- దాటని వారు పట్టణ ప్రాంతాల్లో రూ.12,000/- దాటకూడదు. 3. కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా రెండూ కలిపి పది ఎకరాల లోపు భూమి ఉండాలి. 4. ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు మరియు ఓటర్ గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులు ) 5. 5 x 5 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలము వున్న దుకాణం ఉండరాదు.

లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారు?

గ్రామ వాలంటీర్లు సర్వే చేసి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా వారి యాప్ లో నమోదు చేస్తారు.

బ్యాంకులకు అర్హుల దరఖాస్తులను ఎలా పంపుతారు?

సర్వే ఆధారంగా, అర్హులైన & ఆసక్తి ఉన్న వారి దరఖాస్తుల పత్రాలను గ్రామ/వార్డు సచివాలయం శాఖ వారి యాప్ ద్వారా తీసుకుని, వాటిని బ్యాంకులకు పంపిస్తారు సంక్షేమ & విద్యా సహాయకులు ( వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్).

ఎవరైనా జగనన్న తోడు కొరకు నేరుగా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చునా?

అవును, అర్హులైనవారు చేసుకొనవచ్చును.

జగనన్న తోడు పథకానికి దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి?

గ్రామ/వార్డు సచివాలయాలలో దొరుకుతాయి. గ్రామ/వార్డు సచివాలయాల యాప్ నుంచి పొందవచ్చును.

వడ్డీ లేని ఋణం అనగా నేమి?

నెలవారీగా కంతులను క్రమం తప్పకుండా కట్టే వారి ఖాతాల్లోకి నేరుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని జమ చేస్తుంది.

బ్యాంకులు వారికి వచ్చిన దరఖాస్తులన్నింటికీ ఋణాలు మంజూరు చేస్తారా?

లేదు. ఎటువంటి బకాయిలు లేని వారికి మాత్రమే బ్యాంకులు ఋణాలు మంజూరు చేస్తారు. ఋణాల మంజూరు పూర్తిగా బ్యాంకుల నిర్ణయం మేరకే జరుగుతుంది.

జిల్లా కలెక్టర్ గారికి అర్హుల జాబితాను ఎవరు పంపిస్తారు?

జాయింట్ కలెక్టర్ ( గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి ) గారి ఆమోదంతో ఎంపీడీవో /మునిసిపల్ కమీషనర్లు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తారు.

జగనన్న తోడు జిల్లా ఋణ ప్రణాళిక తయారు చేయవలసిన అవసరం ఉన్నదా?

అవును. జాయింట్ కలెక్టర్ ( గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి ) వారి మార్గదర్శకంలో ఎంపీడీవో /మునిసిపల్ కమీషనర్లు తయారుచేస్తారు.

ఏ బ్యాంకుకు ఏ దరఖాస్తులను పంపాలని ఎలా తెలుసుకుంటారు?

అర్హుల జాబితాను లీడ్ జిల్లా మేనేజర్ కు పంపాలి. 1. లీడ్ జిల్లా మేనేజర్ అర్హుల జాబితాను బ్యాంకు వారీగా వేరు చేస్తారు. 2.లీడ్ జిల్లా మేనేజర్ నిర్ణయం మేరకు సంబంధిత బ్యాంకులకు అర్హుల జాబితా పంపబడుతుంది.

అర్హులైన వారికి బ్యాంకు ఖాతా లేకపోతే ఏం చేయాలి?

వాలంటీరు /బ్యాంకు కరస్పాండెంట్/ సంక్షేమం & విద్యా సహాయకుడు/ సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శుల సహాయంతో అర్హులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలి.

ఋణ పత్రాలను నింపడంలో బ్యాంకు వారికి సహకరించవలసిన అవసరం ఉన్నదా?

అవును, వాలంటీర్లు /బ్యాంకు కరస్పాండెంట్ /సంక్షేమం & విద్యా సహాయకులు / వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శులు బ్యాంకు వారికి సహకరించవలసిన అవసరం ఉన్నది.

మంజూరు అయిన వెంటనే ఋణం ఇవ్వబడుతుందా?

లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించాకనే ఋణం ఇవ్వబడుతుంది.

సంక్షేమం & విద్యా సహాయకులు /వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శులు ఎప్పుడెప్పుడూ ఋణ మంజూరులను యాప్ లో తీసుకుంటారు?

వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం నాడు సంక్షేమం & విద్యా సహాయకులు / వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శులు ఋణ మంజూరు విషయాలను సేకరించి, గ్రామ/వార్డు సచివాలయాల శాఖవారి పోర్టల్ లో నమోదు చేస్తారు.

డి.ఆర్.డి.ఎ & మెప్మా వారి క్షేత్రస్థాయి సిబ్బంది సహాయ సహకారాలు అవసరమా?

అవును, డి.ఆర్.డి.ఎ & మెప్మా క్షేత్రస్థాయి సిబ్బంది సహాయ సహకారాలు అవసరమా అవసరం. ఎందుకంటే అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించడంలో వారికి అనుభవం ఉన్నది.

డి.ఆర్.డి.ఎ & మెప్మా పథక సంచాలకులకు వారి క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని ఎవరు చెప్పుతారు?

తమ క్షేత్రస్థాయి సిబ్బంది ని భాగస్వామ్యం చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ ( గ్రామ/వార్డు సచివాలయాలు & అభివృద్ధి) జిల్లా కలెక్టర్ ను కోరవలెను.

జగనన్న తోడు ఋణం పొందిన నేను ఇతర ఋణాలు పొందగలుగుతానా? వ్యక్తిగత ఋణాలు, వాహన ఋణాలు ఎక్కువ మొత్తంలో బ్యాంకులు ఇస్తున్నాయి కనుక వాటిని నేను పొందవచ్చునా?

లబ్ధిదారులు ఇతర ఋణాలు పొందడానికి అర్హులే. ఇతర ఋణాలు పొందకూడదని నిషేధమేమీ లేదు. జగనన్న తోడు పథకం కింద గరిష్టంగా రూ.10,000/- ఋణం వడ్డీ చెల్లింపుతో ఇవ్వబడుతుంది. ఒకవేళ బ్యాంకులు ఋణాలు ఇవ్వదలిస్తే లబ్ధిదారులు ఋణాలు పొందవచ్చు. అయితే వడ్డీ చెల్లింపులు మాత్రం రూ.10,000/- వర్తిస్తుంది.

జగనన్న తోడు ఋణం పొందిన నేను ఇతర ప్రభుత్వ పథకాలైన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేదోడు, వైఎస్సార్ కాపు నేస్తం వంటి పథకాలు పొందవచ్చునా?

అవును, పొందవచ్చును. జగనన్న తోడు ఋణం పొందినప్పటికీ ఆయా పథకాల అర్హతలను బట్టి ఇతర పథకాలను కూడా పొందవచ్చును.

ప్రధానమంత్రి సన్నిధి కింద ఋణం పొందాలనుకున్న నేను జగనన్న తోడు కూడా అర్హత కలిగి వున్నానా?

ప్రధానమంత్రి సన్నిధి & జగనన్న తోడు రెండూ ఒకటే. ప్రధానమంత్రి సన్నిధి భారత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ & పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి సన్నిధి లబ్ధిదారులందరూ జగనన్న తోడు లబ్ధిదారులే. ఎందుకంటే వారికి భారత ప్రభుత్వం కేవలం 7% మాత్రమే వడ్డీ చెల్లింపు చేస్తున్నది, మిగతాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తున్నది. కాబట్టి, ప్రధానమంత్రి సన్నిధి లబ్ధిదారులకు మళ్లీ జగనన్న తోడు మంజూరు అవసరం లేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top