ప్రభుత్వం వారు రైస్ కార్డ్ డేటా తో ఒంటరి మహిళా, వితంతు పెన్షన్ పొందుతున్న వారి వివరములు సరి పోల్చినప్పుడు వివిధ రకములైన కారణములతో ఒంటరి మహిళా, వితంతు పెన్షన్ వివరములు సరిపోనందున “సంబంధిత కారణం” చూపుతూ “నోటీసులు” (పిడిఎఫ్) లో జనరేట్ చేసి సంబంధిత సచివాలయ వెల్ఫేర్ లాగిన్ నందు పెట్టబడినవి. వాటిని డౌన్లోడ్ చేసి రెండు కాపీలు ప్రింట్ తీసి సంబంధిత పెన్షన్ దారులకు ఒకటి ఇచ్చి సదరు నోటీసు ముట్టినట్లు రెండవ కాపీ పై పెన్షనుదారుని సంతకము/వేలి ముద్ర, నోటీసు ఇచ్చిన తేదీ నమోదు చేసి వెల్ఫేర్ వారు తీసుకుని నోటీసు లోని Acknowledgement (2nd Copy of Notice) ను, మరియు నోటీస్ ఇచ్చిన తేదీను ఆన్లైన్ నందు అప్లోడ్ చేయవలసి ఉన్నది. తదుపరి చర్యల కొరకు అనగా పింఛనుదారులు ఇచ్చిన సమాధానము, సంబంధిత ధృవపత్రము ఆన్లైన్లో నందు అప్లోడ్ చేయుటకు Module ఇవ్వబడునని తెలియజేసియున్నారు.గమనించగలరు.
- Widow Pensions అన్ని WEA LOGIN లోకి వెనక్కి రావడం జరిగింది, కావున WEA లు అందరు ఆమె భర్త చనిపోయినట్టు…
- AePDS app లో » Volunteer login” లో Death Declaration చేసిన తరువాత
- Aepds portal లో » VRO login” లో Death Case Confirmation option లో భర్త చనిపోయినట్లు Update చేసిన తరువాత మాత్రమే అవి క్లియర్ అయ్యి మళ్ళీ వారికీ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది.
- MPDO గారి లాగిన్ లో వారికీ negative endorsment రావడం జరిగింది. వాటిని print తీసుకుని wea లాగిన్ లో upload చేయాలి.